Admin Review Feature In WhatsApp : వినియోగదారుల భద్రత, గోప్యతే లక్ష్యంగా ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్.. కొత్త అప్డేట్లు, ఫీచర్లు తెస్తూ యూజర్స్‌కు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్నో అప్డేట్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. అదే 'అడ్మిన్ రివ్యూ ఫీచర్'. కాగా, ఈ ఫీచర్ గ్రూపు చాట్లల్లో మాత్రమే పనిచేయనుంది. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్ల కోసం దీనిని రూపొందించారు. అయితే ప్రస్తుతానికి బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను.. మున్ముందు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ పనిచేస్తున్నట్లు వాట్సాప్ అప్డేట్లను సమీక్షించే వెబ్సైట్ Wabetainfo వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో గ్రూప్ అడ్మిన్లు ఒక్కోసారి తాము గ్రూపుల్లో అందుబాటులో లేకున్నా సరే, తాము నిర్వహించే గ్రూపుల్లో ఇతర సభ్యులు చేసే పోస్టులు, జరిగే సంభాషణలు, చర్చలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండొచ్చని తెలిపింది.
ఎలా పనిచేస్తుంది..?
WhatsApp New Features Today : వాబీటాఇన్ఫో రిపోర్ట్ ప్రకారం.. ఈ నయా ఫీచర్‌ను ఆస్వాదించేందుకు గ్రూప్ అడ్మిన్లు ముందుగా గ్రూప్ సెట్టింగ్స్ స్క్రీన్‌లోకి వెళ్లి పలు సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్‌ను అడ్మిన్లు ఎనేబుల్ చేసుకున్న తర్వాత గ్రూప్ సభ్యులు గ్రూప్‌లో వచ్చిన అసభ్యకర మెసేజ్‌లను ఈ ఫీచర్ సాయంతో గ్రూప్ అడ్మిన్‌కు చాట్ రూపంలో రిపోర్ట్ చేయవచ్చు. అలా రిపోర్ట్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేసే అధికారం గ్రూప్ అడ్మిన్‌కు ఉంటుంది. ఆ సందేశం అందరి చాట్లోనూ డిలీట్ అవుతుంది. అంతేకాకుండా గ్రూప్‌లో మరోసారి అలాంటి సందేశాలు పంపకుండా సంబంధిత సభ్యుడిని గ్రూప్ అడ్మిన్ మందలించవచ్చు.. లేదా అతడిని గ్రూప్ నుంచి తొలగించవచ్చు.
WhatsApp Admin Features : గ్రూపులోని ప్రతి సభ్యుడు ఏదైనా సందేశాన్ని రిపోర్ట్ చేయాలనుకుంటే గ్రూప్ అడ్మిన్‌కు మెసేజ్ ఆప్షన్స్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అలా గ్రూప్ సభ్యులు రిపోర్ట్ చేసే అన్నీ గ్రూప్ ఇన్ఫో స్క్రీన్‌లోని ఓ సెక్షన్లో సేవ్ అయి ఉంటాయి. వీటిని గ్రూప్ అడ్మిన్లు రివ్యూ చేసుకోవచ్చు.
ఏంటి లాభం..?
Usage Of Admin Review In WhatsApp : ఈ ఫీచర్ సాయంతో గ్రూపుల్లో ఆరోగ్యవంతమైన చర్చ జరిగే ఆస్కారం ఉంటుందని.. అలాగే అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పలు సందేశాలను పంపే వారిపై పూర్తి నియంత్రణను విధించే అధికారం గ్రూప్ అడ్మిన్‌కు ఈ ఫీచర్ కల్పించనుందని Wabetainfo పేర్కొంది. ఈ ఫీచర్‌తో గ్రూప్ సభ్యులు పంపే మెసేజ్‌లను రివ్యూ కూడా చేయవచ్చు. అలాగే అడ్మిన్లు గ్రూప్‌లో అందుబాటులో లేనప్పుడు జరిగే సంభాషణలపై ఓ కన్నేసి ఉంచవచ్చు.
భవిష్యత్తులో అందరికీ..
WhatsApp New Update 2023 : గ్రూప్ చాట్‌ల కోసం రూపొందించిన ఈ 'అడ్మిన్ రివ్యూ ఫీచర్'ను కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తేనుంది వాట్సాప్. మొత్తంగా రాబోయే ఈ సరికొత్త టూల్‌తో గ్రూప్ అడ్మిన్లు తాము నిర్వహించే వివిధ గ్రూపులను మేనేజ్ చేసే సాధనంగా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
- Whatsapp Email Login : వాట్సాప్‌లో కొత్త రూల్.. ఇకపై ఈమెయిల్‌తో లాగిన్!
- WhatsApp New Feature : వాట్సాప్ నయా ఫీచర్.. కొత్త గ్రూప్‌లో సభ్యులను చేర్చుకోవడం ఇప్పుడు మరింత సులభం!
- WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై నేరుగా వీడియో మెసేజ్‌లు పంపొచ్చు!
- వాట్సాప్‌లో కొత్త అప్డేట్స్.. ఆకర్షణీయంగా సెర్చ్ బార్.. ఈజీగా గ్రూప్ క్రియేషన్!
- WhatsApp Video Call : వాట్సాప్ నయా ఫీచర్.. ఒకేసారి 15 మందితో గ్రూప్ వీడియో కాల్!