Lander And Rover Wake Up : చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తర్వాత జాబిల్లి ఒడిలో నిద్రాణ స్థితిలోకి వెళ్లింది. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరిగి క్రియాశీలకంగా మార్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. చంద్రుడిపై పగటి సమయం కావడం వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపే ప్రయత్నం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇస్రో వెల్లడించింది. ల్యాండర్, రోవర్‌తో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు తమకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని వివరించింది. ల్యాండర్, రోవర్‌ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో వెల్లడించింది.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition.
As of now, no signals have been received from them.
Efforts to establish contact will continue.
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 22, 2023
Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition.
As of now, no signals have been received from them.
Efforts to establish contact will continue.Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 22, 2023
Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition.
As of now, no signals have been received from them.
Efforts to establish contact will continue.
తిరిగి లేస్తే మరింత కీలక డేటా..
నిజానికి ల్యాండర్, రోవర్‌ల జీవితకాలం 14 రోజులే. ఇది జాబిల్లిపై ఒక పగలుకు సమానం. ఆ రెండింటితో పాటు వాటిలో పొందుపర్చిన పేలోడ్‌లు అత్యంత కీలక డేటాను ఇస్రోకు ఇప్పటికే చేరవేశాయి. ఆ తర్వాత సూర్యాస్తమయం కావడం వల్ల రోవర్‌ను ఈనెల 2న, ల్యాండర్‌ను 4న శాస్త్రవేత్తలు నిద్రాణ దశలోకి పంపారు. చందమామపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్ 120 నుంచి 200 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోవడం, అంతటి శీతల పరిస్థితుల్లో అవి పనిచేసే అవకాశాలు లేకపోవడమే అందుకు కారణం. ప్రస్తుతం ల్యాండర్, రోవర్ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో వాటిని నిద్ర నుంచి లేపి, కమ్యూనికేషన్‌ను పునఃస్థాపించుకునేందుకు ఇస్రో యత్నించింది. అదృష్టం బాగుండి ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే మరింత కీలక డేటా మన చేతికి అందుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
"చంద్రయాన్-3ని కేవలం 14 రోజుల పాటు మాత్రమే పనిచేసేలా రూపొందించారు. రాత్రి పూట చంద్రుడిపై ఉష్ణోగ్రతలు మైనస్ 250 డిగ్రీలకు పడిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయడం చాలా కష్టం. ఈ కారణంగానే 14 రోజుల తర్వాత చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్, రోవర్లు పనిచేయదని అనుకుంటున్నాం. కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు.. అవి తిరిగి పనిచేస్తాయేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే వరమనే చెప్పాలి. దీంతో మరిన్ని కీలక వివరాలను రాబట్టవచ్చు."
-సువేందు పట్నాయక్, అంతరిక్ష శాస్త్రవేత్త
మరిన్ని కీలక వివరాలు..
విక్రమ్ ల్యాండర్, రోవర్లు పనిచేసిన 14 రోజుల్లో కీలక సమాచారాన్ని ఇస్రోకు పంపించాయని భువనేశ్వర్‌కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త సువేందు పట్నాయక్ తెలిపారు. వాటిని లేపేందుకు ప్రస్తుతం తాము చేస్తున్న కృషి ఫలిస్తే వాటితో ఇదివరకే చేయించిన ప్రయోగాలను మళ్లీ చేయిస్తామని చెప్పారు. ఇదే జరిగితే మరిన్ని కీలక వివరాలను భారత్ సంపాదించనుంది.
Water On Moon : జాబిల్లిపై నీళ్లు.. అసలు గుట్టు విప్పిన చంద్రయాన్ డేటా