ETV Bharat / science-and-technology

Iphone 13: సిగ్నల్​ లేకపోయినా ఫోన్​కాల్​ చేసుకోవచ్చు! - ఎల్​ఈఓ టెక్నాలజీ

సిగ్నల్​ లేకపోయినా ఫోన్​కాల్స్​, మెసేజెస్​ చేసుకునే కొత్త ఫీచర్​ వచ్చేస్తోంది! స్మార్ట్​ఫోన్​ దిగ్గజం యాపిల్(Apple)​.. ఐఫోన్​ 13(iphone 13)లో ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెనున్నట్టు సమాచారం.

leo feature
సిగ్నల్​ లేకపోయినా ఫోన్​ కాల్​ చేసుకోవచ్చు!
author img

By

Published : Aug 31, 2021, 3:15 PM IST

మన ఫోన్​లో నెట్​వర్క్​ ఉంటేనే ఎవరికైనా కాల్స్​, మెసేజెస్​ చేయగలం. కానీ కొన్ని సందర్భాల్లో మన ఫోన్​కు సిగ్నల్స్​ అందవు.. అలాంటి సమయంలో మళ్లీ సిగ్నల్స్​ కోసం వేచిచూడటం తప్ప మరో ప్రత్యామ్యాయం లేదు. అయితే ఇప్పుడు ఈ సమస్యకు చెక్​ పెడుతూ.. స్మార్ట్​ఫోన్​ దిగ్గజం యాపిల్(Apple)​.. ఓ కొత్త టెక్నాలజీని కస్టమర్లకు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. అదే ఎల్​ఈఓ (లో ఎర్త్​ ఆర్బిట్​ శాటిలైట్​ కమ్యూనికేషన్ మోడ్​). ఐఫోన్​ సిరీస్​లో త్వరలో రానున్న ఐఫోన్​ 13(iphone 13) మోడల్​లో ఫీచర్​ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఎల్​ఈఓ ఫీచర్​ అంటే?

దిగువ కక్ష్యలో ఉన్న శాటిలైట్ల ఆధారంగా ఎల్​ఈఓ శాటిలైట్లు పనిచేస్తాయి. ఆ ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్​ సిగ్నల్స్​ను అందుకుంటాయి. స్టార్​లింక్​ పేరుతో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ ఈ ఎల్​ఈఓ సేవలను అందిస్తోంది.

ఐఫోన్​ 13లో ఎలా పనిచేస్తుంది?

ఐఫోన్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వాల్​కామ్​ ఎక్స్​ బేస్​బ్యాండ్​ చిప్​ ఆధారంగా​ ఈ ఎల్​ఈఓ శాటిలైట్​ కమ్యూనికేషన్​ మోడ్​ పనిచేస్తుందని ప్రముఖ విశ్లేషకులు కువో వెల్లడించారు. దీని ద్వారా 5జీ లేదా 4జీ కవరేజ్​ లేని వారికి శాటిలైట్​ సాయంతో ఫోన్​ కాల్స్​, మెసేజెస్​ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే ఈ సేవలు వినియోగదారుడికి అందుబాటులోకి రావాలంటే నెట్​వర్క్​ ఆపరేటర్లు గ్లోబల్​స్టార్ శాటిలైట్​ సేవలకు అనుసంధానం కావాలని పేర్కొన్నారు.

ఇదే తొలిసారి..

ఎల్ఈఓ సాంకేతికపై అనేక సంస్థలు ఇప్పటికే కృషి చేస్తున్నాయి. అయితే ఐఫోన్​ 13లో ఎల్​ఈఓపై వస్తున్న వార్తలు నిజమైతే.. ఈ సాంకేతికను అందుబాటులోకి తెచ్చిన తొలి సంస్థగా యాపిల్​ గుర్తింపు పొందనుంది. ​

ఇదీ చదవండి : మీ స్మార్ట్‌ఫోన్ హీటెక్కుతోందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.