ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలు, రీల్స్‌కు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారనే ఫిర్యాదులు ఇటీవల యూజర్ల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అందుకే వాటిని నియంత్రించేందుకు సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టామని ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోసేరి తెలిపారు.
"ఇన్‌స్టా యూజర్ల అకౌంట్స్‌ను సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత మాపై ఉంది. ఇక్కడ దూషించే, ద్వేషించే కామెంట్స్‌ను సహించం. అలా ఎవరైనా కామెంట్ చేస్తే కచ్చితంగా వాటిని తీసి వేస్తాం. అందుకే 'లిమిట్స్' అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీన్ని తేలికగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేస్తే పరిమితమైన కామెంట్స్, మెసేజ్ రిక్వెస్ట్‌లు మాత్రమే వస్తాయి. అంతే కాదు మీరు ఫాలో అవ్వని వారి నుంచి ఎలాంటి అసభ్యకరమైన కామెంట్స్ వచ్చే అవకాశం ఉండదు" అని ఆడమ్ వివరించారు.
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పదేపదే అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారని మీదృష్టికి వస్తే మాత్రం కమ్యూనిటీ గైడ్ లైన్స్‌ప్రకారం.. వారి కామెంట్‌ను డిలీట్ లేదా హైడ్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ వాడే వారి సంఖ్య 120 మిలియన్ల మందితో రెండో స్థానంలో ఉండగా... 140 మిలియన్ల ఇన్‌స్టా యూజర్లతో మొదటి స్థానంలో అమెరికా నిలిచింది.



ఇవీ చదవండి: