ETV Bharat / science-and-technology

3డీ ప్రింటెడ్​ బయోరియాక్టర్​ను రూపొందించిన ఐఐటీ - iit madras research

కణాలపై పరిశోధనకు సంబంధించి ఐఐటీ మద్రాస్​కు చెందిన శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను కనుగొన్నారు. అమెరికాకు చెందిన మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ శాస్త్రవేత్తల సాయంతో 3డీ ప్రింటెడ్​ బయోరియాక్టర్​ను రూపొందించారు.

3d printed bio reactor, ఐఐటీ మద్రాస్​ బయోరియాక్టర్
ఐఐటీ మద్రాస్​
author img

By

Published : May 18, 2021, 9:53 AM IST

Updated : May 18, 2021, 11:33 AM IST

ఐఐటీ మద్రాస్​, అమెరికాకు చెందిన మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్​ బయెరియాక్టర్​ సాయంతో మనిషి మెదడు కణజాలాన్ని అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతతో ఆర్గనాయిడ్స్​గా పిలిచే ఈ బ్రెయిన్​ టిష్యూస్​ల వృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. దీని ద్వారా క్యాన్సర్​, అల్జీమర్స్​, పార్కిన్సన్స్​ వంటి ప్రమాదకర వ్యాధుల నివారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఆ సమస్యను పరిష్కరించారు..

మానవ శరీరానికి సంబంధించి ఏ విషయాన్ని అయినా తెలుసుకునే క్రమంలో సెల్​ కల్చర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ వ్యాధికైనా చికిత్స లేదా ఔషధం కనుగొనడంలో కణాలపై పరిశోధన ఎంతో ముఖ్యం. కణజాలాన్ని అభివృద్ధి చేసేందుకు ఇన్​క్యుబేషన్, ఇమేజింగ్​ సహా కణాలను భౌతికంగా ఇమేజింగ్​ ఛాంబర్​లోకి బదిలీ చేసేందుకు వేర్వేరు ఛాంబర్లు అవసరం. అయితే ఈ క్రమంలో దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటీ, ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ 3డీ ప్రింటెడ్​ బయోరియాక్టర్​ను రూపొందించారు. మైక్రో ఇన్​క్యుబేటర్​, ఇమేజింగ్​ ఛాంబర్లను ఒకే పరికరంలోకి తీసుకువచ్చారు. దీని ద్వారా కణాల వృద్ధిని గమనిస్తూ దీర్ఘ కాలం పరిశోధన జరిపేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు.

ఆరుగురు సభ్యుల బృందం

ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ఇటీవల బయోమైక్రోఫ్లూయిడిక్స్ అనే జర్నల్​లో ప్రచురితమయ్యాయి. ఐఐటీ మద్రాస్​ నుంచి ఇమ్రాన్​ ఖాన్, ప్రొఫెసర్​ అనిల్​ ప్రభాకర్​, ఎంఐటీ నుంచి క్లోయ్​ డెలెపైన్​, హేలే సాంగ్​, విన్సెంట్​ ఫామ్​, ప్రొఫెసర్​ మ్రిగంకా సుర్​ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

3d printed bio reactor, ఐఐటీ మద్రాస్​ బయోరియాక్టర్
పరిశోధన బృందం

3డీ ప్రింటెడ్​ బయోరియాక్టర్​

మైక్రో ఫ్లూయిడిక్​ టెక్నాలజీకి చెందిన ఈ పరికరం ద్వారా దీర్ఘ కాలంపాటు అపరిమిత ఆర్గనాయిడ్​లను వృద్ధి చేయవచ్చు. ఈ బయోరికార్టర్​ను పూర్తిగా ఆటోమేటెడ్​గా అభివృద్ధి చేయడం ద్వారా ఔషధాలు కనుగొనడం సులభం అవుతుంది. దీని ద్వారా ఖర్చు కూడా తగ్గుతుంది. దాదాపు అన్ని మైక్రోస్కోప్​లకు మా పరికరం సరిపోవడమే కాక వివిధ ఎన్విరాన్​మెంటల్​ సెన్సార్​లను ఈ మైక్రో ఇన్​క్యుబేటర్​కు జోడించవచ్చు

-ప్రొఫెసర్ అనిల్​ ప్రభాకర్​, ఐఐటీ మద్రాస్

హెల్త్​కేర్​, ఫార్మా రంగాల్లో మైక్రో ఇన్​క్యుబేటర్​ల అవసరాన్ని పరిగణలోకి తీసుకొని.. దీనిని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నాము. ఇందుకోసం నిధులను సేకరిస్తున్నాము. దీని ద్వారా ఆర్గనాయిడ్స్​పై పరిశోధన జరపడం అందరికీ సులభతరం కానుంది.

-ఇక్రామ్​ ఖాన్, ఐఐటీ మద్రాస్​ పూర్వ విద్యార్థి

ప్రస్తుతం ఈ సాంకేతికతకు సంబంధించిన పేటెంట్​ హక్కులు భారత్​లోనే ఉన్నాయి. దీనిపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు పరిశోధన బృందం ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : 'భారత్​లో టీకా తర్వాత రక్తస్రావం కేసులు తక్కువే!'

Last Updated : May 18, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.