దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. అల్కాజార్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని భారతదేశంలో ఆవిష్కరించనుంది. ఇటీవలి కాలంలో 6/7 సీట్ల ఎస్‌యూవీపై కొనుగోలుదారులు ఆశక్తి చూపడం వల్ల కంపెనీ ఈ విభాగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
హ్యుందాయ్ అల్కాజర్ ఫీచర్లు..
- అల్కాజర్ పేరుతో ఈ సరికొత్త కారు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) విభాగంలో క్రేటా వెర్షన్‌లో మూడు వరుసల సీట్లతో లభిస్తోంది.
- భిన్నమైన గ్రిల్‌తో, అదనపు పొడవుతో(2,760 ఎంఎం వీల్‌బేస్), క్రేటాకు రీడిజైన్ చేస్తున్నారు.
- ఇది రెండు ఇంజన్లతో వస్తుంది.159 పిఎస్ 2.0-లీటర్ పెట్రోల్, 15 పిఎస్ డీజిల్, రెండు ఇంజన్లకు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను అందించారు.
- ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందిస్తున్నారు.
- అల్కాజర్ 6,7 సీట్ల లేఅవుట్‌తో.. మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉండడం వల్ల ప్రయాణం చేసే వారికి సౌకర్యవంతంగా ఉండనుంది.
- మే నెల ప్రారంభంలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు హ్యూందాయ్ తెలిపింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.13 లక్షల నుంచి రూ.20 వరకు ఉంటుందని అంచనా.
ఇవీ చూడండి: