ETV Bharat / science-and-technology

ఆన్​లైన్ డేటింగ్ చేస్తున్నారా? రొమాన్స్ స్కామ్​లో చిక్కుకునే ప్రమాదం ఉంది - జాగ్రత్త! - ఆన్​లైన్​ డేటింగ్​ యాప్స్ వల్ల జరిగే మోసాలు

How To Protect Yourself From Romance Scams : ఆన్​లైన్​ డేటింగ్ పేరుతో అందమైన అమ్మాయిలు/ అబ్బాయిలను ఎరగా వేసి.. యువతీయువకుల నుంచి స్కామర్స్ భారీగా​ డబ్బులు దోచేస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో రొమాన్స్​ స్కామ్స్​​ అంటే ఏమిటి? అవి విధంగా జరుగుతాయి? ఈ స్కామ్స్​ నుంచి ఏ విధంగా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

how to prevent dating scams
How To Protect Yourself From Romance Scams
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 2:17 PM IST

How To Protect Yourself From Romance Scams : ప్రస్తుత కాలంలో సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. దాదాపు అందరూ ఆన్​లైన్​లోనే తమ దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకుంటున్నారు. ముఖ్యంగా నేటి యువతీయువకులు డేటింగ్​కు కూడా ఆన్​లైన్​నే మాధ్యమంగా ఎంచుకుంటున్నారు. అందుకే సైబర్​ నేరగాళ్లు వీరిని లక్ష్యంగా చేసుకుని రొమాన్స్​​ స్కామ్​లకు పాల్పడుతున్నారు. ఇంతకూ రొమాన్స్​ స్కామ్​ అంటే ఏమిటి? దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోమాన్స్​ స్కామ్ అంటే ఏమిటి?
స్కామర్స్ ఆన్​లైన్ వేదికగా అందమైన అమ్మాయిలు/ అబ్బాయిల ఫొటోలను పెట్టి యువతను ఆకర్షిస్తారు. ఆకర్షణీయమైన ఫేక్​ ఫ్రొఫైల్​లను క్రియేట్ చేసి.. అమాయకులను మెల్లగా వారి ట్రాప్​లోకి తీసుకుంటారు. తరువాత వారి నుంచి డబ్బును దోచేస్తారు. ఈ పద్ధతినే రొమాన్స్​​ స్కామ్ (వలపు వల)​ అంటారు.

ఏవిధంగా జరుగుతుందంటే?
స్కామర్స్​ కొంతకాలం మీతో ఆన్​లైన్​లో డేటింగ్ చేస్తారు. ఆ సమయంలో మీకు వారిపై పూర్తిగా నమ్మకం కలిగేలా చేస్తారు. ఆ తరువాత తమకు తీవ్రమైన ఆర్థిక సమస్య ఉందని చెబుతారు. మీరు తప్ప తమను ఆదుకొనేవారు ఎవరూ లేరని నమ్మిస్తారు. మీరు కనుక ఈ ట్రాప్​లో పడి ఒక సారి డబ్బు పంపితే చాలు.. ఇక అప్పటి నుంచి పదే పదే డబ్బులు అవసరమని మిమ్మల్ని వేధిస్తుంటారు. అందుకే ఆన్​లైన్​లో కనిపించే, గుర్తు తెలియని వారితో పరిచయాలు, స్నేహాలు పెంచుకోవడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు నడపడం ఏ మాత్రం క్షేమం కాదు.

రొమాన్స్ స్కామ్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే?

  • ఆన్​లైన్​లో మీ పట్ల ప్రేమ చూపించే.. మీకు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.
  • పరిచయం అయిన కొద్ది రోజులకే ప్రేమ సందేశాలు పంపించేవారిని అస్సలు నమ్మకండి.
  • మీతో ఆన్​లైన్​లో డేటింగ్ చేస్తున్న వ్యక్తుల వివరాలు అన్నీ ముందే తెలుసుకోవాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా తెలియని వారికి డబ్బులు పంపించకూడదు.
  • మీరు డేటింగ్ చేస్తున్న వారి ఫోటోలను, వారి వివరాలను సోషల్ మీడియా హ్యాండిల్స్​లో వెతకండి.
  • మీతో ఆన్​లైన్​లో డేటింగ్ చేస్తున్న వారు ఏవైనా ఇతర స్కామ్​లకు పాల్పడుతున్నారేమో తెలుసుకోండి.
  • ఒక వేళ మీరు మోసాగాళ్ల చేతిలో చిక్కుకున్నారని గ్రహిస్తే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
  • మీతో ఆన్​లైన్ డేటింగ్ చేస్తున్నది స్కామర్స్ అని గ్రహిస్తే.. వెంటనే సంబంధిత వెబ్​సైట్, యాప్​లో రిపోర్ట్ చేయండి.
  • వీలైనంత వరకు ఆన్​లైన్​ డేటింగ్ యాప్​లు వాడకపోవడమే మంచిది.

యుక్తవయస్సులో ఆకర్షణలకు లోనుకావడం చాలా సహజం. అయితే ఆన్​లైన్​లో డేటింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. అప్పుడే రొమాన్స్ స్కామ్స్​ నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

ఆన్​లైన్​లో వలపు వల.. చిక్కితే జీవితాలు విలవిల

Cyber Crimes: మీకు ఇలాంటి మెసేజ్​లు వస్తున్నాయా... అయితే ఓ లుక్కేయండి

Electricity Bill Scam Message : ఆన్​లైన్​ కరెంట్​ బిల్లు స్కామ్ అంటే ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.