ETV Bharat / science-and-technology

How to Lock Whatsapp Web on PC : మీ ల్యాప్​టాప్​లో వాట్సాప్​ చాట్స్​ ఎవరూ చూడకూడదా? - can we lock whatsapp web in pc

How to Lock Whatsapp Web on PC : ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకుపైగా యూజర్స్​ కలిగిన వాట్సాప్​ రోజుకో కొత్త ఫీచర్​తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. వినియోగదారుల గోప్యతను కాపాడటమే లక్ష్యంగా తాజాగా మరికొన్ని అప్​డేట్స్​ను తెచ్చేందుకు సిద్ధమైంది. మరి ఆ అప్​గ్రేడ్​ వివరాలు మీ కోసం.

Whatsapp Web New Screen Lock Feature Update
Whatsapp Web New Update
author img

By

Published : Aug 14, 2023, 7:12 PM IST

Updated : Aug 14, 2023, 10:04 PM IST

How to Lock Whatsapp Web on PC : తమ వినియోగదారులు వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రముఖ మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​ రోజుకో కొత్త ఫీచర్​తో యూజర్స్​ ముందుకు వస్తోంది. ఇప్పటికే వాట్సాప్​కు చెందిన పలు కీలక అప్డేట్​లు వినియోగదారులకు అందిబాటులోకి రాగా.. మరికొన్నింటిని బీటా టెస్టర్ల కోసం అందిస్తూనే అభివృద్ధి చేస్తోంది. మరి తాజాగా వచ్చిన సరికొత్త ఫీచర్లతో పాటు ఇప్పటికే యూజర్స్​ వినియోగిస్తున్న ఆ నయా ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్​ వెబ్​లో కొత్త స్క్రీన్​ లాక్​ ఫీచర్​..
Whatsapp Latest Update Features : తాజాగా విడుదల చేసిన వాట్సాప్​ వెబ్​ న్యూ స్క్రీన్​ లాక్​ ఫీచర్( Can We Lock Whatsapp Web )​తో వినియోగదారుల గోప్యతను మరింతగా రక్షించవచ్చని వాట్సాప్​ తెలిపింది. ముఖ్యంగా డెస్క్​టాప్​లు లేదా ల్యాప్​టాప్​లలో వినియోగించే వాట్సాప్​ వెబ్​ వినియోగదారులకు ఈ నయా ఫీచర్​ ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. ఇది మన వాట్సాప్​ అకౌంట్​లోకి అనధికారిక యాక్సెస్​ను నిలుపుదల చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్​ను బీటా టెస్టర్లు మాత్రమే వినియోగించగలరు. త్వరలో దీనిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్​ అభివృద్ధి చేస్తోందని ప్రముఖ వైబ్​సైట్​ WABetaInfo వెల్లడించింది.

స్క్రీన్​ లాక్​ ఫీచర్​ ఇలా పనిచేస్తుంది..
ఈ నయా ఫీచర్​ మీ డివైజ్​లో అందుబాటులోకి వచ్చిందా లేదా అని తెలియాలంటే ఈ కింది స్టెప్స్​తో చెక్​ చేసుకోండి.

  • ముందుగా సెట్టింగ్స్​>ప్రైవసీలోకి వెళ్లాలి.
  • ఒకవేళ ఈ ఫీచర్ మీ అకౌంట్​లో ఎనేబుల్​ అయితే గనుక 'స్క్రీన్​ లాక్​' అనే ఆప్షన్​ కనిపిస్తుంది.
  • అప్పుడు మీరు వాట్సాప్​ వెబ్​ను తెరవడానికి పాస్​వర్డ్​ను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మీరు చాట్​ లిస్ట్​ను యాక్సెస్ చేయగలరు.

ఒకవేళ పాస్​వర్డ్​ మర్చిపోతే..
Whatsapp New Lock Feature : మీరు ఒకవేళ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే వాట్సాప్​ వెబ్ నుంచి లాగ్ అవుట్ అవ్వాలి. అనంతరం QR కోడ్‌ స్కాన్​ సాయంతో మళ్లీ లాగిన్ చేయాలి. దీనికితోడు మీ వాట్సాప్​ వెబ్​ను లాక్​( How To Lock Whatsapp In PC )చేసినప్పుడు వచ్చే మెసేజ్​లు నోటిఫికేషన్​ల రూపంలో కనిపించవు. దీంతో అన్​ఆథరైజ్డ్​ యూజర్స్​ మీ వ్యక్తిగత సందేశా​లను చూడలేరు. అయితే వాట్సాప్​ వెబ్​ బీటా తాజా వెర్షన్​ను ఉపయోగించే కొంతమంది వినియోగదారులకు ఈ స్క్రీన్​ లాక్​ ఫీచర్​ను కల్పించింది ఆ సంస్థ​. మరికొద్ది వారాల్లోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తేనుంది.

వాట్సాప్​లో వీడియోకాల్​ అప్​గ్రేడ్​..
Whatsapp Video Call Latest Update : వీడియోకాల్​ సమయంలో మీరు ఎవరికైనా మీ స్క్రీన్​ను షేర్​ చేయాలనుకుంటే వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్​ను వినియోగించవచ్చు. ఈ నయా ఫీచర్( Whatsapp Latest Features )​ను​ యాపిల్​ ఫేస్​టైమ్​తో పోలి ఉంటుంది. ఈ ఫీచర్​ సాయంతో మీరు వీడియో కాల్​లో ఉన్న సమయంలోనే మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఏవైనా డాక్యుమెంట్లు, ఫొటోలు వంటి వాటిని సులంభంగా షేర్​ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు షేర్​ ఐకాన్​పై క్లిక్​ చేయాలి. అనంతరం మీరు పంపాల్సిన అప్లికేషన్​ను​ సెలెక్ట్​ చేసుకోవాలి. దీనికి అదనంగా వాట్సాప్​ లేటెస్ట్ వెర్షన్​ను కలిగి ఉన్న వినియోగదారులు​ ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో కూడా వీడియో కాల్​ను ఆస్వాదించవచ్చు.

15 నిమిషాల ముందే 'షెడ్యూల్డ్​ వాట్సాప్​ వాయిస్​ కాల్స్'​..
Whatsapp Scheduled Voice Call : వాట్సాప్​లో వాయిస్​ కాల్​లను షెడ్యూల్​ చేసే విధంగా ఉండే సరికొత్త ఫీచర్​ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు మెటా అధినేత జుకర్​ బర్గ్​ పేర్కొన్నారు. ఇది​ కాల్​ను స్వీకరించే వారికి 15 నిమిషాల ముందే వాయిస్​ కాల్​ను గుర్తు చేస్తూ ఓ అలర్ట్​ను పంపిస్తుంది. కాగా, ఈ ఫీచర్​ ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు మెటా తెలిపింది.

Last Updated : Aug 14, 2023, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.