ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో వాయిస్, వీడియో కాల్స్ చేస్తుంటారా? - అయితే ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలుసుకోవాల్సిందే! - How to Hide Ip Address in WhatsApp Call in Telugu

WhatsApp Ip Address Protect Feature : మీరు తరచుగా వాట్సాప్​లో ఆడియో, వీడియో కాల్స్ చేస్తుంటారా? అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మందికి అందులో ఐపీ అడ్రస్ ఫీచర్ గురించి తెలియదు. ఇటీవలే కంపెనీ.. వాట్సాప్ కాల్స్​కు సంబంధించి సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. దీనితో మీ ఐపీ అడ్రస్ ఎవరికీ తెలియకుండా ఆఫ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Whatsapp Call
Whatsapp Call
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 11:00 AM IST

How to Hide WhatsApp Call Ip Address : మనం సాధారణంగా ఎవరితోనైనా ఫోన్​లో మాట్లాడాలంటే నార్మల్​ సెల్యూలార్ నెట్వర్క్ ద్వారా కాల్ చేసి మాట్లాడుతుంటాం. అయితే కొందరు మాత్రం వాట్సాప్ వాయిస్ కాల్స్ కూడా చేస్తారు. ఫోన్​లో నెట్​వర్క్ సరిగా లేనప్పుడు లేదా కాంటాక్ట్ లిస్టులో లేని వారికి వాయిస్ కాల్స్ చేయాల్సి వచ్చినప్పుడు వాట్సాప్ కాల్ ఫీచర్(Whatsapp Call) ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ విధంగా కాల్ చేయడం ద్వారా మీ IP అడ్రస్ కూడా కనిపిస్తుంది. అయితే ఆ అడ్రస్​ను మీరు ఎక్కడా చూడలేరు. కానీ, ఈ సమాచారం మొత్తం మీరు మాట్లాడుతున్న వ్యక్తికి తెలుస్తుంది. దీంతో ఇప్పటివరకు చాలా మంది ఆ సమాచారం తెలియకుండా భాగస్వామ్య ఐపీ అడ్రస్​లతో మాత్రమే వాయిస్ కాల్స్ లేదా వీడియో కాల్స్ చేసేవారు.

WhatsApp Call Ip Address Protect Feature : అయితే ఇకపై మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా వాట్సాప్ వాయిస్​ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ ఇటీవలే.. ఐపీ అడ్రస్‌ను, లొకేషన్‌ను ప్రొటెక్ట్‌ చేసే సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ సదుపాయంతో ఆడియో, వీడియో కాల్స్‌(Video Call) సమయంలో మీ లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ వివరాలు అవతలి వారికి తెలీకుండా చేయొచ్చు. ఇంతకీ వాట్సాప్​లో ఆ ఫీచర్​ను ఎలా సెట్ చేసుకోవాలి? అది ఎలా పనిచేస్తుంది? ఈ ఫీచర్​ ఆన్​లో ఉంటే కాల్స్ క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వాట్సాప్ కాల్స్‌లో IP అడ్రస్ ఎలా ఆఫ్ చేయాలంటే..

  • ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. ముందుగా మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి.
  • అప్పుడు రైట్​ సైడ్​ కార్నర్​లో కనిపిస్తున్న త్రీడాట్స్​ పై క్లిక్​ చేసి 'Settings' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత 'Privacy' ఆప్షన్​పై నొక్కాలి. అనంతరం కిందికి స్క్రోల్ చేసి 'Advanced' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు కనిపించే ‘Protect IP Address in Calls’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే మీ ఫోన్​లో ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
  • మీరు ఒకవేళ వద్దనుకుంటే ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయొచ్చు.

వాట్సాప్​లో మేజిక్ వాయిస్​ మెసేజ్​ ఫీచర్​- ఒక్కసారి వినగానే మాయం- ఇలా పంపాలి!

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. మీ ఫోన్​లో ఈ ఫీచర్ ఆన్ చేస్తే.. మీరు ఎవరికి ఆడియో కాల్ చేసినా లేదా వీడియో కాల్ చేసినా ఆ సర్వర్ లోని డేటా మాత్రమే చేరుతుంది. కానీ, ఐపీ అడ్రస్ ఇకపై అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ ప్రైవసీ మెయింటెయిన్ అవుతుందని కంపెనీ ప్రకటించింది.

వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో ఇది పని చేస్తుందా?: ప్రస్తుతానికి ఈ ఫీచర్ one-to-one కాల్స్ కోసం మాత్రమే కంపెనీ తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూప్ కాల్స్ లో ఐపీ అడ్రస్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం మీరు గమనించాలి.

ఈ ఫీచర్ ఆన్‌లో ఉంటే క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా?: వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ క్వాలిటీపై పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక ప్రశ్నలు దీని గురించి తలెత్తుతున్నాయి. ఈ ఫీచర్‌ను మీరు ఆన్‌లో ఉంచితే క్వాలిటీ తగ్గదనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అలాగే ఈ ఫీచర్ ఆన్ చేస్తే రెండు డివైజ్‌లు నేరుగా కనెక్ట్ కావు. కానీ, సర్వర్ ద్వారా కాబట్టి కాల్ క్వాలిటీ కొంతమేరకు తగ్గొచ్చు. ఈ సందర్భంలో మీరు కాల్స్ ఫీచర్లో Protect IP Address అనే ఫీచర్‌ను ఆఫ్ చేయొచ్చు.

కమ్యూనికేషన్‌కు సంబంధించి యూజర్లకు ఈ ఫీచర్‌ అదనపు భద్రతను అందిస్తుందని వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చే వాబీటా ఇన్ఫో పేర్కొంది. గుర్తు తెలీని వ్యక్తులతో సంభాషించేటప్పుడు మన ఐపీ అడ్రస్‌, లొకేషన్‌ వంటి వివరాలు తెలీకుండా ఈ ఫీచర్‌ అడ్డుకుంటుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మీకూ ఈ ఫీచర్‌ వచ్చిందేమో చెక్‌ చేయండి. లేదంటే లేటెస్ట్‌ వాట్సాప్‌ను అప్​డేట్​ చేసుకోండి.

వాట్సాప్ స్టేటస్​ ఇక ఇన్​స్టాలోనూ షేరింగ్- మెటా నయా ఫీచర్

X Calling Feature : ఎక్స్‌లో ఆడియో-వీడియో కాల్స్‌ ఫీచర్‌.. యాక్టివేట్‌ చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.