ETV Bharat / science-and-technology

వైఫై కనెక్షన్‌ను ఇతరులు వాడేస్తున్నారా?.. అడ్డుకోండిలా.. - how to check how many wifi users

Wifi Users Check: కరోనా లాక్​డౌన్​లో ఇంటర్నెట్‌ వినియోగం అధికమై వైఫై కనెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే కొందరు అపరిచితులు సాంకేతిక పరిజ్ఞానంతో వైఫై పాస్‌వర్డ్‌ను హ్యాక్‌ చేసి ఇంటర్నెట్‌ను తెగ వాడేస్తుంటారు. అయితే మన వైఫైను ఇతరులు వాడకుండా సురక్షితంగా ఉంచుకోవడమెలా..?

wifi hacking
wifi hacking
author img

By

Published : Feb 19, 2022, 10:36 AM IST

Wifi Users Check: ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ డేటా, వైఫై (వైర్‌లెస్‌ ఫెడిలిటీ) అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇవి కూడా నిత్యజీవితంలో భాగమైపోయాయి. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇంటర్నెట్‌ వినియోగం అధికమై వైఫై కనెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అయితే, కొందరు అపరిచితులు సాంకేతిక పరిజ్ఞానంతో వైఫై పాస్‌వర్డ్‌ను హ్యాక్‌ చేసి ఇంటర్నెట్‌ను తెగ వాడేస్తుంటారు. దీంతో మన ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోవడం పరిపాటి అయిపోతోంది. మరి ఇలా మన వైఫైను ఇతరులు వాడకుండా సురక్షితంగా ఎలా ఉంచుకోవాలనే సింపుల్‌ ట్రిక్స్‌పై ఓ లుక్కేద్దామా..

  • ముందుగా ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ చేసిన డివైస్‌లో వెబ్‌ బ్రౌజర్‌ను తెరిచి 192.168.0.1/192.168.1.1/192.168.2.1లో ఏదో ఒక అడ్రస్‌ను ఎంటర్‌ చేసి రూటర్‌లోకి లాగిన్‌ అవ్వాలి. వీటిలో ఏదీ పని చేయకుంటే సిస్టమ్‌లోని కమాండ్‌ (cmd) ప్రాంప్ట్‌ తెరిచి ipconfig/all అని ఎంటర్‌ చేయగానే డిఫాల్ట్‌ గేట్‌వే పక్కన రూటర్‌ ఐపీ అడ్రస్‌ కనిపిస్తోంది.
  • తర్వాత యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. ఒకవేళ రూటర్‌ పాస్‌వర్డ్‌ తెలియకపోతే వైఫై రూటర్‌ మీద ఉన్న స్టిక్కర్‌పై చెక్‌ చేసి రీసెట్‌ చేసుకోవాలి. అలాకాకుంటే ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించాలి.
  • ఒకసారి లాగిన్‌ అయ్యాక 'వైఫై క్లయింట్‌ల జాబితా','కనెక్ట్‌ అయిన డివైస్‌'ను కనుగొనడానికి నావిగేట్‌ చేసుకోవాలి. అలాగే కొన్ని మనకు తెలియని కనెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో గుర్తించాలి.
  • అలాగే కమాండ్‌లో arp-a అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా వైఫైకి ఏయే డివైస్‌ కనెక్ట్‌ అయ్యి ఉన్నాయో తనిఖీ చేయవచ్చు.

అపరిచితుల కనెక్షన్లు తొలగించండిలా..

  • ఎనేబుల్‌ WPA2 సెక్యూరిటీ: ముందుగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో రూటర్‌లోకి లాగిన్‌ అవ్వాలి. తర్వాత రూటర్ కంట్రోల్‌ డ్యాష్‌బోర్డులో ఉన్న WPA2 సెక్యూరిటీని ఎనేబుల్‌ చేసుకోవాలి.
  • సెటప్‌ ఏ స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌: వైఫైకి లాగిన్‌ అవ్వడానికి పాస్‌వర్డ్‌ చాలా కీలకం. దీని విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న అపరిచితులు సులువుగా యాక్సెస్ చేసేస్తారు. స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లు సెటప్‌ చేసుకోవాలి. పాస్‌వర్డ్‌ను మార్చుకోవడానికి రూటర్‌ కంట్రోల్‌ డ్యాష్‌బోర్డులోకి వెళ్లాలి. అందులో పాస్‌వర్డ్‌ను మార్చుకొని కనెక్ట్‌ అయిన డివైస్‌ను తొలగించాలి.
  • లాగిన్‌ వివరాలు మార్చుకుంటే..: రూటర్‌ లాగిన్‌ వివరాలనూ మార్చుకోవాలి. ఇంతకుముందు ఎవరైనా మీ వైఫైకి కనెక్ట్‌ అయినట్లయితే వారి డివైస్‌ డిస్‌కనెక్ట్‌ అయిపోతోంది. వారు మరలా కొత్త పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రూటర్‌ లాగిన్‌ వివరాలను అప్పుడప్పుడూ మార్చుకుంటూ ఉండాలి.
  • వైఫై పేరును దాచేయండి: ఎవరైనా వైఫై కోసం స్కాన్‌ చేసినపుడు మన వైఫై పేరు కనిపించకుండా ఉండేలా సెటప్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా డివైస్‌ను కనెక్ట్‌ చేయాలనుకుంటే వైఫ్‌ పేరు, పాస్‌వర్డ్‌ను ఆ డివైస్‌లో మాన్యువల్‌గా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కనెక్ట్‌ చేస్తే ఇంకా సులువుగా కనెక్ట్‌ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: మీ ఫోన్​లో ఛార్జింగ్​ వెంటనే అయిపోతుందా?.. ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.