ETV Bharat / science-and-technology

Short Videos: షార్ట్ వీడియోస్.. ప్రభావం మాత్రం గట్టిగానే..! - షార్ట్​ వీడియో ఫ్లాట్​ఫామ్​లో వ్యాపారం

దేశంలో సమాచార వ్యవస్థ శర వేగంగా విస్తరిస్తోంది. సమాచారాన్ని వీలైనంత తక్కువ సమయంలో చెప్పగలిగే వాటికే యూజర్లు జై కొడుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన షార్ట్​ వీడియోస్ (Short Videos) ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వీడియో చిన్నదే అయినా.. దాని ప్రభావం ఎంతో మందిపై చూపిస్తోంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. దీంతో అది కాస్త వ్యాపారంగా మారింది.

Short-form Content
చిన్న వీడియోలు
author img

By

Published : Sep 20, 2021, 6:46 PM IST

భారత్​లో ఇప్పుడు షార్ట్​ వీడియోస్​ (Short Videos) ట్రెండ్ నడుస్తోంది. దేశంలో చాలామంది ప్రజలు వీటిని చూసేందుకు బాగా అలవాటు పడ్డారు. కొంచెం తీరిక దొరికినా.. స్మార్ట్​ఫోన్​లో షార్ట్​ వీడియోస్​ యాప్స్​ ఓపెన్​ చేసి గంటల తరబడి చూస్తూనే ఉండిపోతున్నారు. ఇంతలా ఓ వ్యక్తిని ప్రభావితం చేయగలగాలంటే వాటిలో ఉండే కంటెంట్​ ఏ స్థాయిలో ఉండాలి? ప్రతిరోజు మనల్ని ఫాలో అయ్యే వారిని మెప్పించాలి అంటే ఎంత కొత్తగా వీడియోలు చేయాలి? మాధ్యమం ఏదైనా కానీ వారి చూపు తిప్పకుండా ఉంటాలి అంటే అందులో మనం జోడించాల్సిన అంశాలు ఏంటి? ఇలా చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని వీడియోలు చేస్తున్నారు కంటెంట్​ క్రియేటర్స్.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. చివరిగా ఫాలోవర్​ను నిలుపుకోవాలి అంటే పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇదంతా కేవలం ఆ షార్ట్​ వీడియోస్ మీదే ఆధారపడి ఉంది. అందుకే టిక్​టాక్​ బ్యాన్​ అయిన తరువాత కూడా చిన్న వీడియోలను ప్రామాణికంగా చేసుకోని చాలా యాప్స్​ పుట్టుకొచ్చాయి. మరికొన్ని యాప్​లు అయితే ఏకంగా వాటి రూపాన్నే మార్చుకున్నాయి. అయితే నిజంగానే ఆ చిన్న వీడియోలకు అంతలా ప్రభావితం చేసే శక్తి ఉందా? ఉంటే ఎలా వచ్చింది? దాని ద్వారా ఏం జరుగుతోంది?

టిక్​టాక్​తో మొదలు..

చిన్న వీడియోలకు మంచి పాపులారిటీ తీసుకొచ్చింది టిక్​టాక్(Tiktok)​. తొలుత సినిమా డైలాగ్స్​కు సంబంధించిన విధంగా పెదాలు కదిలించి, హావభావాలు వ్యక్తపరచడం చేసేవారు. ఇలా మొదలై.. చివరకు అందులో ఉన్న వ్యక్తి సొంతంగా కంటెంట్​ను జనరేట్​ చేసి ఏకంగా వీడియోలు పెట్టే స్థాయికి వచ్చింది. కొత్తదనంతో ముందుకు వచ్చిన వారికి ఫాలోవర్స్​ పెద్ద సంఖ్యలోనే పెరిగారు. వీటిలో ఎక్కువగా చిరుతిండి, ఫ్యాషన్​, ఫిట్​నెస్​, వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీడియోలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఫాలోవర్లు కూడా ఇలాంటి వీడియోలను ఎక్కువ చూస్తున్నారు.

అంకెలు ఇలా..

చిన్న వీడియోలను మన దేశంలో ఒక నెలలో సుమారు 5 బిలియన్ల మంది చూస్తున్నట్లు డిజిటల్​ అన్​డిస్కవర్డ్ అనే సంస్థ తను చేపట్టిన సర్వేలో తేలినట్లు పేర్కొంది. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం. 2016 ఆర్థిక సంవత్సరం చివరికి కంటెంట్​ వీడియోలు చేసే వారి సంఖ్య 20 మిలియన్లు ఉండగా... 2020 నాటికి వారి సంఖ్య 180 మిలియన్లకు చేరినట్లు రెడ్​ సీర్​ కన్సెల్టింగ్​ సంస్థ తెలిపింది. టిక్​టాక్​ బ్యాన్​ చేసే నాటికి చిన్న వీడియోలకు ప్రభావితం అయిన వారి సంఖ్య భారతీయుల్లో కాకుండా 200 మిలియన్లు అని పేర్కొంది.

అదే దారిలో..

టిక్​టాక్​ను భారత్​లో బ్యాన్​ చేసిన తరువాత అలాంటి ఫీచర్​నే కొనసాగిస్తూ చాలా యాప్స్​ వచ్చాయి. వాటిలో ముఖ్యంగా జోష్(Josh App)​, మోజ్(Moj App)​, రొపోసో( Roposo App), ఎంఎక్స్​టకాటక్​(Mx Takatak) లాంటి యాప్​లు వచ్చాయి. ఇన్​స్టా, యూట్యూబ్​ లాంటి టాప్​ బ్రాండ్లు కూడా ఇదే దారిలో వచ్చి.. యాప్​ రూపాన్నే మార్చుకున్నాయి. అలా పుట్టుకొచ్చినవే ఇన్​స్టా రీల్స్​, యూట్యూబ్​ షార్ట్​. ప్రస్తుతం ఇవి టిక్​టాక్​కు ఉన్న 97శాతం యూజర్లను తమ వైపు తిప్పుకొన్నట్లు రెడ్​సీర్​ తెలిపింది. దీంతో కంటెంట్​ను ఉత్పత్తి చేసే వారి సంఖ్య 45 మిలియన్​లకు చేరింది. వివిధ మాధ్యమాలను వేధికగా చేసుకొని ఒక్కరోజులో సుమారు 50 మిలియన్ల పోస్టులు వస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే 2025 నాటికి భారత్​లో కంటెంట్​ ఉత్పత్తి చేసే వారి సంఖ్య 580 మిలియన్లుగా ఉంటుంది అనే అంచనా వేసింది రెడ్​ సీర్​.

వారి మీదనే ఆధారపడి..

ఈ షార్ట్​ వీడియో ఫ్లాట్​ఫామ్​లో ముఖ్యంగా ముగ్గురు ఉంటారు. వారే కంటెంట్​ క్రియేటర్స్​, ఫాలోవర్స్​, అడ్వటైజర్స్​. వీరి ముగ్గురు మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఒకరి మీద మరొకరు ఆధారపడి ఉంటారు. కంటెంట్​ క్రియేటర్స్​ ఫాలోవర్స్​ మీద ఆధారపడుతారు. ఎక్కువమంది ఫాలోవర్స్​ ఉండే వారి మీద అడ్వటైజర్స్​ కన్ను ఉంటుంది. ఫాలోవర్స్​ కూడా వారికి కావాల్సిన దాని కోసం కంటెంట్​ క్రియేటర్స్​ను ఫాలో అవుతారు. ఇది ఓ చక్రంలాంటి అని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్​ ఉండే వారికి ప్రభావశీలులు అని చెప్పవచ్చు. వీరి పాత్ర కూడా ఇందులో కీలకమైంది.

ఇలా వ్యాపారంగా మారింది..

మొదటగా వినోదం కోసం ప్రారంభమైన చిన్న వీడియోలు ఫాలోవర్లు, కంటెంట్​ క్రియేటర్లు, అడ్వటైజర్​, ఇన్​ఫ్లూయెన్సర్లు లేదా ప్రభావితం చేసే వారితో వ్యాపారంగా మారిపోయింది. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్​ ఉన్నారు అంటే ఫాలోవర్స్​కు నచ్చిన అంశం ఆ కంటెంట్​ క్రియేటర్​లో ఏదో ఉందని అర్థం. వీరి ప్రభావం ఫాలోవర్స్​పై ఎంతో కొంత ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొన్న అడ్వటైజర్లు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న వారి చేత తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రచారం చేయిస్తున్నారు. ఇందుకుగాను వారు కొంత మొత్తాన్ని వారికి ముట్టచెప్తున్నారు. ఈ విధంగా షార్ట్​ వీడియోలు వ్యాపారంగా కూడా మారాయి. ఇలా వెచ్చించిన మొత్తం 2019లో సుమారు 400 మిలియన్​ డాలర్లు కాగా... 2020కి ఆ సంఖ్య 900 మిలియన్​ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆ మొత్తం 2021కి 1.5 బిలియన్​ డాలర్లను తాకింది.

సామాన్యుల నుంచి స్టార్లుగా..

చిన్న వీడియోలను చేసే చాలా మందికి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ షార్ట్​ వీడియోల కోసం వీరు వెచ్చించే సమయం తక్కువే అయినా.. సరైన వీడియోతో ఓవర్​ నైట్​ స్టార్లుగా మారిపోతున్నారు. ఇటీవల వచ్చిన డుగ్గు డుగ్గు బండి పాటతో ఆ జంట సోషల్​ మీడియోలో ఎంత ఫేమస్​ అయ్యారో చూశాం. ఇలా ఎక్కుమంది ఫాలోవర్లు ఉన్న వారిని ప్రముఖ ఛానెల్స్​ వారు నిర్వహించే రియాల్టీ షోలకు పిలుస్తున్నారు. మరికొందరికి సినిమా అవకాశాలు లభిస్తున్నాయి.

ఇదీ చూడండి: వ్యక్తిగత గోప్యత.. గాలిలో దీపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.