గూగుల్ యూజర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డార్క్‌మోడ్ ఫీచర్ ఎట్టకేలకు గూగుల్ సెర్చ్‌లో అందుబాటులోకి వచ్చింది. డార్క్‌మోడ్‌కు సంబంధించి అప్పీయరెన్స్ సెట్టింగ్స్‌లో కొత్తగా డివైజ్ డీఫాల్ట్, డార్క్, లైట్ అనే మూడు ఆప్షన్లను తీసుకొచ్చారు. అలానే ఈ డార్క్‌మోడ్ సిస్టమ్ థీమ్ సెట్టింగ్స్‌తో కలిసి పనిచేస్తుంది. ఇందులో డివైజ్ డీఫాల్ట్ ఆప్షన్ కంప్యూటర్ థీమ్ డార్క్‌మోడ్‌లోకి మార్చుకుంటే గూగుల్ సెర్చ్ థీమ్ కూడా ఆటోమేటిగ్గా డార్క్‌మోడ్‌లోకి మారుస్తుంది. దీనివల్ల యూజర్స్ ప్రతిసారీ గూగుల్ సెర్చ్‌లో డార్క్‌మోడ్ డిసేబుల్, ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరంలేదు. ఇక డార్క్, లైట్ ఆప్షన్లు బ్యాక్‌గ్రౌండ్ డార్క్‌లో ఉంటే లైట్ టెక్ట్స్‌ను, బ్యాక్‌గ్రౌండ్ లైట్‌లో ఉంటే డార్క్ టెక్ట్స్‌ను చూపిస్తాయి. డార్క్‌మోడ్ వల్ల కళ్లపై శ్రమ తగ్గడమే కాకుండా ఫోన్, పీసీ తెర మన్నిక పెరుగుతుందనే ఇటీవల పరిశోధనల్లో నిరూపితమైంది.
గూగుల్ సెర్చ్‌లో డార్క్‌మోడ్
- కంప్యూటర్‌లో గూగుల్ సెర్చ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్. కామ్ అని టైప్ చేయాలి.
- తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్పియరెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ సెట్టింగ్స్‌లో అప్పీయరెన్స్ ఆప్షన్ కనిపించకపోతే.. సెర్చ్ సెట్టింగ్స్‌లోకి వెళితే కనిపిస్తుంది.
- అప్పియరెన్స్‌లో డివైజ్ డీఫాల్ట్, డార్క్, లైట్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేసి సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- గూగుల్ సెర్చ్ ఎప్పుడూ డార్క్‌మోడ్‌లో ఉండాలంటే మాత్రం డార్క్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
ప్రస్తుతం కొద్ది మంది యూజర్స్‌కు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్స్ అందరికీ ఈ డార్క్‌మోడ్ ఆప్షన్లను పరిచయం చేయనున్నారు. గతేడాది చివర్లోనే గూగుల్ డార్క్‌మోడ్‌కి సంబంధించిన వార్తలు వెలువడ్డాయి. పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో యూజర్ల కోసం తీసుకొచ్చారు. ఇక గూగుల్ యాప్‌లో డార్క్‌మోడ్ ఈ ఏడాది మే నుంచి అందుబాటులో ఉంది.
ఇదీ చూడండి.. ఆ ఆండ్రాయిడ్ వెర్షన్లో ఇకపై గూగుల్ సేవలు బంద్!