గూగుల్ మీట్(google meet).. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో వీడియో మీటింగ్ సేవలు అందించే ప్రధానమైన యాప్‌లలో ఒకటి. ఇప్పుడు వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియో మీటింగ్‌లలో అవతలి వ్యక్తి మాట్లాడిన వాయిస్‌తో పాటు లైవ్ క్యాప్షన్ ఫీచర్‌ను ఇప్పటివరకు గూగుల్ మీట్(google meet) అందించింది. దీంతో మీటింగ్‌లో వాయిస్‌కు లైవ్ క్యాప్షన్లు కూడా చూడగలిగాం.
కానీ ఇప్పడు మరో అడుగు ముందుకేసి, ఆ క్యాప్షన్‌ను ఇతర భాషలలోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. లైవ్ క్యాప్షన్లను ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, పోర్చుగీసు భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే వేసులుబాటు కలుగుతుందని గూగుల్ వర్క్‌స్పేస్ అప్డేట్లో(google meet download for pc) ఆ కంపెనీ పేర్కొంది. మరికొన్ని భాషలను త్వరలో చేర్చుతామని వెల్లడించింది.
ఆన్లైన్ విద్యలో విద్యార్థులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. వివిధ దేశాల్లో ఉన్న కంపెనీలకు భాషా సమస్యను తొలగించగలుగుతుంది. ఉద్యోగులు ఇతర ఉద్యోగులు మాట్లాడిన భాషలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో వీడియో మీటింగ్ సామర్థ్యం ఏ మాత్రం తగ్గదని కంపెనీ యాజమాన్యం తెలిపింది.