ETV Bharat / science-and-technology

జీమెయిల్ ఫుల్ అయిందా?.. ఇలా క్లియర్ చేసుకోండి! - మెయిళ్లను డిలీట్ చేయడం ఎలా

ఫొటోలను గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి అప్‌లోడ్‌ చేయడం వల్ల మెమొరీని ఆక్రమిస్తాయి. దీంతో జీమెయిల్‌ స్టోరేజ్‌ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో జీమెయిల్‌ మెమొరీని పెంచుకోవడానికి(clear gmail inbox) ఏం చేయాలో చూద్దాం.

clear gmail inbox
జీమెయిల్
author img

By

Published : Sep 6, 2021, 6:15 PM IST

జూన్‌ 1వ తేదీ నుంచి గూగుల్ ఫొటోస్‌ స్టోరేజ్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దీంతో గూగుల్‌ ఫొటోస్‌లో ఇకపై అపరిమితంగా హై క్వాలిటీ ఫొటోలను అప్‌లోడ్‌ చేయటం కుదరదు. ఇప్పటికే అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు ఏవైనా సరే ఉచిత 15 జీబీ స్టోరేజ్‌ పరిధిలోకే వస్తాయి. ఇది నిండిపోతే, అదనపు స్టోరేజీ కోసం గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. లేదంటే కొన్ని ఫొటోల్ని తొలగించాలి. అయితే ఉచిత 15 జీబీ ఇతర గూగుల్‌ యాప్స్‌కు కూడా క్లౌడ్‌ స్టోరేజ్‌గా పనిచేస్తుంది. ఇప్పటికే ఫొటోలను గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌కు అప్‌లోడ్‌ చేయడం వల్ల కొంత మెమొరీని ఆక్రమించి ఉంటాయి. దాంతో జీమెయిల్‌ స్టోరేజ్‌ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో జీమెయిల్‌ మెమొరీని పెంచుకోవడానికి(clear gmail inbox) ఏం చేయాలో చూద్దాం.

జీమెయిల్ అటాచ్​మెంట్స్​ను డిలీట్​ చేయడం..

  • మొదటగా మీ కంప్యూటర్‌లో జీమెయిల్‌ ఓపెన్‌ చేసి సెర్చ్‌ బార్‌లో "has:attachment larger:10M" అని టైప్‌ చేయండి.
  • 10 ఎంబీల కన్నా ఎక్కవ మెమొరీ ఆటాచ్‌మెంట్లు ఉన్న మెయిల్స్‌ ప్రత్యక్షమవుతాయి.
  • వాటిల్లో అవసరం లేని మెయిల్స్‌కు టిక్‌ పెట్టి డిలీట్‌ చేయండి.
  • ఆ తర్వాత ట్రాష్​లోకి వెళ్లి బిన్​ను క్లియర్​ చేయండి.

ఇన్​బాక్స్​ను క్లియర్​ చేయడం..

  • వివిధ వెబ్‌సైట్లకు లాగిన్‌ అయినప్పడు మన మెయిల్‌ ఇస్తే ఆ సైట్‌ నుంచి మనకు కాల్‌ లెటర్స్‌ వస్తుంటాయి. వాటితో జీమెయిల్‌ స్టోరేజ్‌ నిండిపోయే ప్రమాదం ఉంది. ఆ మెయిల్స్‌ రాకుండా ఉండటానికి ఇలా చేయండి.
  • జీమెయిల్​కు వెళ్లి మనం "Unsubscribe" చేయాలనుకుంటున్న మెయిల్‌పై క్లిక్ చేయాలి.
  • సెండర్​ పేరు దగ్గర ఉన్న "Unsubscribe" బటన్​పై క్లిక్‌ చేయాలి.
  • పాప్​ అప్​ విండో ఓపెన్ అయ్యాక.. "Unsubscribe" పై నొక్కాలి.
  • ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు సెండర్​ వెబ్​సైట్​ ఓపెన్​ అవుతుంది. అప్పుడు ఈమెయిల్​ ఆప్షన్​ను నేరుగా డిజెబుల్ చేయొచ్చు.

అలా చేస్తే రకరకాల వెబ్‌సైట్ల నుంచి వచ్చే మెయిల్స్‌కు స్వస్తి చెప్పొచ్చు. అదేవిధంగా జీమెయిల్‌లోని ట్రాష్‌, స్పామ్‌ మెయిల్స్‌ను ఎప్పటికప్పడు పరిశీలిస్తూ అనవసరమైన వాటి తొలగిస్తూ ఉంటే స్టోరేజ్‌ పెరుగుతుంది.

ఇదీ చదవండి : ఈ సెట్టింగ్స్​తో మెయిళ్లు మరింత సురక్షితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.