చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ11 సిరీస్‌లో మరో మూడు కొత్త మోడల్స్‌ను ఆవిష్కరించింది. ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ11 లైట్ పేర్లతో వీటిని తీసుకొచ్చింది. ఎంఐ11 అల్ట్రా, ఎంఐ 11 ప్రోలో మూడు వేరియంట్లు, ఎంఐ11 లైట్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇవన్నీ 5జీ ఫోన్లు. బీజింగ్‌లో విడుదలైన ఈ ఫోన్లను త్వరలోనే భారతీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఎంఐ11 ఆల్ట్రా
ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ11 ఆల్ట్రా టాప్ మోడల్. మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.67 వేలకు పైగా ఉంది. ఈ మోడల్లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి.
8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ- రూ. 67వేలు (అంచనా)
12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ-రూ. 73వేలు (అంచనా)
12జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజీ-రూ.78వేలు (అంచనా)
ఫీచర్లు...
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
- 6.81 అంగుళాల స్క్రీన్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్, వైర్లెస్
- ఎంఐయూఐ 12.5 ఆండ్రాయిడ్
- 50ఎంపీ మెయిన్ కెమెరా,48 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, 48ఎంపీ టెలీఫొటో లెన్స్
- 20ఎంపీ సెల్ఫీ కెమెరా
ఎంఐ11 ప్రో
మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.56 వేలకు పైగా ఉంది. ఎంఐ 11 ప్రో మోడల్ స్టోరేజ్ పరంగా మూడు వేరియంట్లలో రానుంది.
8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ- రూ. 56వేలు (అంచనా)
8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ-రూ. 59వేలు (అంచనా)
12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీ -రూ.64వేలు (అంచనా)
ఫీచర్లు...
- 6.81 అంగుళాల స్క్రీన్
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ చిప్
- హెచ్డీ క్వాలీటీతో 8కే వీడియోలను చూడవచ్చు
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్, వైర్లెస్
- ఎంఐయూఐ 12.5 ఆండ్రాయిడ్
- 50ఎంపీ మెయిన్ కెమెరా,13ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, 8ఎంపీ టెలీఫొటో లెన్స్
- 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఎంఐ11 లైట్
మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.25 వేలకు పైగా ఉంది. ఈ మోడల్లో మొత్తం రెండు వేరియంట్లు ఉన్నాయి.
8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ- రూ. 25వేలు (అంచనా)
8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ-రూ. 29వేలు (అంచనా)
ఫీచర్లు...
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 780జీ ప్రాసెసర్
- 6.81 అంగుళాల స్క్రీన్
- 4,250 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్, వైర్లెస్
- ఎంఐయూఐ 12.5 ఆండ్రాయిడ్
- 64ఎంపీ మెయిన్ కెమెరా,8 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, 5ఎంపీ మైక్రో సెన్సార్
- 20ఎంపీ సెల్ఫీ కెమెరా
ఇదీ చూడండి: పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఇలా...