ETV Bharat / science-and-technology

బెజోస్​ రోదసి యాత్ర.. ఇవి మీకు తెలుసా? - ఎలాన్ మస్క్

మరో రెండు రోజుల్లో ప్రపంచ కుబేరుడు, ఆమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా సాగుతున్న ఈ యాత్రకు సంబంధించిన పూర్తి, ఆసక్తికర విశేషాలు మీ కోసం..

bezos space trip
జెఫ్​ బెజోస్
author img

By

Published : Jul 18, 2021, 4:28 PM IST

Updated : Jul 18, 2021, 9:27 PM IST

అమెజాన్​ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు జెఫ్​ బెజోస్​ మరో రెండు రోజుల్లో వ్యోమగాముల జాబితాలో చేరనున్నారు. సొంత సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న తొలి మానవసహిత రోదసి యాత్రకు మరో ముగ్గురితో కలిసి మంగళవారం(జులై 20) పయనంకానున్నారు. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగుల వేస్తోన్న 'స్పేస్ టూరిజం' రంగానికి ఈ నెలలోనే ఇది రెండో పెద్ద ఘట్టం!

బిలినియర్ల మధ్య రోదసియానానికి తీవ్ర పోటీ నెలకొన్న వేళ ఇటీవలే దానిని విజయవంతంగా పూర్తి చేశారు వర్జిన్​ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్. అయితే బ్లూ ఆరిజిన్​ లక్ష్యాలు అంతకన్నా పెద్దవి. వ్యోమ నౌక న్యూ షెపర్డ్​ చేరుకునే ఎత్తులోనూ, భవిష్యత్​ ప్రణాళికలలోనూ బ్లూ ఆరిజిన్​ లక్ష్యాలు వేరే స్థాయిలో ఉన్నాయి.

ఏంటీ బ్లూ ఆరిజిన్?

కృత్రిమ గ్రావిటీతో తేలియాడే స్పేస్​ కాలనీలను నిర్మించే లక్ష్యాంతో 2000లో బ్లూ ఆరిజిన్​ను స్థాపించారు బెజోస్. అక్కడ లక్షలాది మంది పని చేసుకుంటూ, జీవించగలగాలని కలలు సంకల్పించారు.

ప్రస్తుతం ఈ సంస్థ.. హెవీ లిఫ్ట్ ఆర్బిటల్​ రాకెట్​ న్యూ గ్లెన్​ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఓ మూన్​ ల్యాండర్​ కూడా తయారు చేసి నాసా ఆర్టెమిస్​ ప్రోగ్రామ్​లో భాగస్వామి కావాలని చూస్తోంది.

జులై 20న పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్​ సైట్​ వన్​ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు) న్యూ షెపర్డ్​ దూసుకెళ్లనుంది. దీనిని గంటన్నర ముందు నుంచే BlueOrigin.comలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

bezos space trip
లాంచింగ్ స్టేషన్

రోదసి వీరులు..

బెజ్​స్​ రోదసి వీరుల జాబితాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పూర్తి స్వయంచాలిత ఫ్లైట్​లో.. బెజోస్​తో పాటు ప్రముఖ మహిళా పైలట్​ వేలీ ఫంక్​ వెళ్లనున్నారు. ఆమెకు 82 ఏళ్లు. దీనితో ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. వీరితో పాటు ప్రయాణించనున్న 18ఏళ్ల ఆలివర్‌ డేమన్‌.. అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు.

ఇక మిగిలిన ఆ నాలుగో వ్యక్తి బెజోస్ సోదరుడు, బెజోస్ కుటంబానికి చెందిన ఫౌండేషన్ నిర్వాహకులు మార్క్​. అయితే ఈ యాత్ర కోసం తొలుత వేలంలో రూ.206కోట్లు పెట్టి టికెట్ కొన్న ఓ వ్యక్తి మాత్రం అనివార్య కారణాలతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.

ప్రత్యేకతలు..

  • లిక్విడ్ హైడ్రోజన్/లిక్విడ్​ ఆక్సిజన్​ ఇంజన్​తో గంటకు 3700 కిలోమీటర్లకు పైగా(మాక్​ 3) వేగంతో న్యూ షెపర్డ్​ నింగిలోకి దూసుకువెళ్తుంది. దీని ద్వారా ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు.
  • ఆ తర్వాత వ్యోమగాములు ఉన్న క్యాప్సుల్ బూస్టర్​ నుంచి విడిపోతుంది. అనంతరం వారు భారరహిత స్థితి అనుభూతిని పొందుతారు.
  • కర్మాన్​ రేఖ (భూమి నుంచి 100కిలోమీటర్ల ఎత్తులో భూవాతావరణానికి, రోదసికి సరహద్దు) ఆవల కొన్ని నిముషాలు గడుపుతారు. ఈ వ్యోమనౌక 65 మైళ్ల (106కి.మీలు) ఎత్తువరకు వెళ్లగలదు.
  • అక్కడి నుంచి భూమిని, విశ్వాన్ని క్యాబిన్​ నుంచి వీక్షిస్తారు.
  • ఆ తర్వాత క్యాప్సుల్ తిరిగి భూమికి చేరుకుంటుంది. పెద్ద ప్యారచూట్ల సాయంతో యాత్రికులు కిందకి దిగుతారు.

భవిష్యత్తులో ఏం చేయబోతోంది?

గోప్యత ఈ సంస్థ ప్రధాన విధానంగా కనబడుతోంది. ఈ తొలి రోదసి యాత్ర మినహా రాబోయే రోజులకు సంబంధించిన ఇతర విశేషాలను పెద్దగా వెల్లడించలేదు.

bezos space trip
బ్లూ ఆరిజిన్

అయితే ఏడాది మరో రెండు యాత్రలను చేపట్టేందుకు ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. ఈ రోదసియానాలు బాగా రిస్క్​తో కూడిన వ్యవహారం అయినందున తొలి యాత్రల ద్వారా లభించే డిమాండ్​పై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: బెజోస్‌ వ్యోమనౌక వెనుక.. భారత యువతి

Last Updated : Jul 18, 2021, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.