ETV Bharat / science-and-technology

క్రోమ్​లో​ ఇన్​కాగ్నిటో మోడ్​ను వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

సాధారణంగా మనకేదైనా డౌట్​ వస్తే ​గూగుల్​ను ఆశ్రయిస్తాం. ఇందుకోసం రకరకాల బ్రౌజర్లను ఉపయోగిస్తాం. అయితే సెర్చింగ్​ విషయాన్ని పక్కన పెడితే మనం అన్వేషించే ప్రతిదీ వీటిలో సేవ్​ అవుతుంది. దాన్నే మనం సెర్చ్​ హిస్టరీ అంటాం. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ క్రోమ్​లో ఉండే ఇన్​కాగ్నిటో మోడ్​ బ్రౌజర్​లో సెర్చ్​ చేసిన అంశాలు వాటిలో సేవ్​ అవ్వవు అనే భ్రమలో ఉంటారు. కానీ దీంట్లో కూడా మనం వెతికే ప్రతీ కంటెంట్​ సేవ్​ అవుతుందన్న విషయం మీకు తెలుసా? అసలు ఇది ఎలా సేవ్​ చేసుకుంటుంది? దీని వల్ల భవిష్యత్​లో మనకేమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న విషయాలు తెలియాలంటే.. ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Chrome Icognito Browser History Deletion
Chrome Icognito Browser
author img

By

Published : Jan 21, 2023, 7:37 AM IST

సాధారణంగా మనం వాడే మొబైల్స్​లో, ల్యాప్​టాప్​లలో ముందుగా ప్రైవసీ ఉండేలా చూసుకుంటాం. ఉదాహరణకు మన పర్సనల్ వాట్సాప్​ చాటింగ్​లు, ఫొటోలు, వీడియోలు వంటి వాటికి లాక్​లు పెట్టుకుంటాం. కొన్ని సార్లు సెర్చ్​ ఇంజన్​లలో వెతికే వివిధ రకాల సమాచారం కూడా డివైజ్​లో సేవ్​ అవ్వకూడదని అనుకుంటాము. అలా సేవ్​ కాకుడదు అనుకుంటే వీటికి కొన్ని సెట్టింగ్స్​ కూడా ఉంటాయి. కాకపోతే దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. అయితే థర్డ్​ పార్టీ సర్వర్లు కూడా వీటిని ట్రేస్​ చేస్తున్నాయన్న విషయం బహుశా టెక్​ నిపుణులకు తప్ప సాధారణమైన డివైజ్ యూజర్లకు తెలియకపోవచ్చు. ఇలా మనం దేని కోసం అన్వేషించినా కొన్ని సార్లు మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే పలు థర్డ్​ పార్టీ సర్వర్లు మనల్ని ఇరుకున పడేసేలా చేస్తాయి. వాటినుంచి ఎలా బయట పడాలో తెలియక అలానే ఉండిపోతుంటారు.. టెక్నాలజీ గురించి అంతగా తెలియనివాళ్లు. మరి ఈ కింది సూచనలను పాటిస్తే ఇటువంటి వాటికి చెక్​ పెట్టొచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు.

అందరిలాగే ప్రైవసీ కోసం మీరూ గుగల్​ను కాదని ​క్రోమ్​లో ఉండే ఇన్​కాగ్నిటో మోడ్​లో​ సెర్చ్​ చేస్తున్నారా.. వాస్తవానికి అది కూడా మన బ్రౌజింగ్ హిస్టరీని సేవ్​ చేసుకొని మనకే ముప్పు తెస్తుందనే విషయం మీకు తెలుసా..? అయితే మీరు ఇన్​కాగ్నిటో మోడ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ఐఎస్​పీ)తో పాటు ఇతర థర్డ్-పార్టీలు కూడా మీ ఆన్‌లైన్ యాక్టివిటీని ట్రాక్ చేస్తాయట. అంతేగాక మీరు మీ ఫోన్​ను ఇతరులకు ఇచ్చినప్పుడు క్రోమ్​లోని ఈ ప్రైవేట్ మోడ్‌లో మనం వీక్షించిన వాటిని వారు సులువుగా కనిపెట్టేస్తారు. మరి మీరు మీ బ్రౌజింగ్​ హిస్టరీని ఎలా చెక్​ చేసుకోవాలి అలాగే దానిని ఎలా డిలీట్ చేయాలి.. దీంతో మన ప్రైవసీని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

బ్రౌజింగ్​ హిస్టరీ ఇన్​కాగ్నిటో మోడ్​లో ఎలా సేవ్​ అవుతుంది?
సాధారణంగా ఇన్​కాగ్నిటో మోడ్‌లో బ్రౌజ్ చేసినప్పుడు, సెర్చ్ చేసిన వెబ్‌సైట్‌లను సేవ్ చేయదు. బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్​ లేదా ఇతర సైట్​ల సమాచారం దీంట్లో సేవ్​ అవ్వదు. అయితే, ఈ మోడ్‌ని ఉపయోగించడం వల్ల వ్యక్తికి ప్రైవసీ ఉంటుందా అంటే చెప్పలేము. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే కేవలం సెర్చ్​ ఇంజన్​ మాత్రమే మనం వెతికే సైట్లను సేవ్​ చేయదు. దీంతో పాటుగా డివైజ్​లో అంతర్గతంగా ఉండే థర్డ్​ పార్టీ సర్వర్లూ మన ఆన్​లైన్​ ఆక్టివిటీని పర్యవేక్షిస్తుంటాయట. మీరు గూగుల్​, మోజిల్లా ఫైర్​ఫాక్స్​ వంటి సెర్చ్ ఇంజన్​లతో పాటు క్రోమ్ ఇన్​కాగ్నిటో మోడ్​లో వెతికే ప్రతి కంటెంట్​ను ఐఎస్​పీ సేకరించి సేవ్​ చేస్తుంది.

ఇంకా, కొన్ని వెబ్‌సైట్‌లు తమ సైట్‌లోకి ప్రవేశించడానికి మన డివైజ్​ ఐపీ అడ్రస్​ను కూడా ట్రాక్​ చేస్తుంది. దీంతో మన బ్రౌజింగ్​ హిస్టరీ సెర్చ్​ ఇంజన్​ సేవ్​ చేసినా చేయకపోయినా సరే మన వ్యక్తిగత గోప్యతకు బంగం కలుగుతుంది. అలా కాకుండా, మీరు ప్రైవేట్ బ్రౌజర్​ను ఉపయోగించినప్పటికీ, మీ డివైజ్​లో​ని డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్​ఎస్​) క్యాచీలో బ్రౌజింగ్ హిస్టరీ సేవ్​ అవుతుంది. మరి అదెలా అంటే..

  • మీరు కొత్త వెబ్‌సైట్‌ను క్లిక్​ చేసే ప్రతిసారీ, మీరు తప్పక దాని పేరును మీ బ్రౌజర్‌లో టైప్ చేస్తారు.
  • మనం టైప్​ చేసిన డొమైన్​ పేరు ఐపీ చిరునామా రిక్వెస్ట్​ను మీ బ్రౌజర్ డీఎన్​ఎస్​ సర్వర్​కు పంపుతుంది.
  • తర్వాత డీఎన్​ఎస్ మీ డివైజ్​లో వెబ్​సైట్​ వివరాలను లోకల్​గా సేవ్​ చేసుకుంటుంది. ఇది గతంలో వెతికిన సైట్​ని వేగంగా యాక్సెస్​ చేయడానికి సహాయపడుతుంది. ఈ తాత్కాలిక డీఎన్​ఎస్ రికార్డును డీఎన్​ఎస్ క్యాచీ అంటారు.
  • మీరు సాధారణ సెర్చ్​ ఇంజన్​తో పాటు ఇన్​కాగ్నిటో మోడ్‌లో సెర్చ్​​ చేసిన వెబ్​సైట్ల పేర్లతో పాటు వాటి ఐపీ అడ్రస్​లను కూడా డీఎన్​ఎస్ క్యాచీ సేవ్​ చేసుకుంటుంది.
  • కాగా, ఈ డీఎన్​ఎస్ క్యాచీ మన డివైజ్​లో సేవ్​ అయి ఉంటుంది కాబట్టి మీ కంప్యూటర్‌ డివైజ్​ను ఉపయోగించే ఎవరైనా కొన్ని లైన్ కమాండ్స్​ సాయంతో మనం సెర్చ్​ చేసిన కంటెంట్​ లేదా వెబ్​సైట్లను సులువుగా చూడగలరు.

అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఇన్​కాగ్నిటో బ్రౌజర్​ అనేది అత్యంత సురక్షితమైనది అలాగే ప్రైవసీని మెయిన్​టేన్​ చేస్తుంది అనేది అవాస్తవం. దీని నుంచి బయటకు రావాలి. ఎప్పుడైతే మీ డీఎన్​ఎస్​ క్యాచీతో పాటు ఇతర వెబ్​సైట్లలో స్టోర్​ అయ్యే​ బ్రౌజింగ్​ హిస్టరీని పూర్తిగా డిలీట్​ చేసినప్పుడే మనకు ప్రైవసీ లభిస్తుంది.

పీసీ(పర్సనల్​ కంప్యూటర్​)లో ఇన్​కాగ్నిటో మోడ్ హిస్టరీని ఎలా చూడాలి?
మీ పీసీ విండోస్​లో, మీ ఇన్​కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ హిస్టరీను డీఎన్​ఎస్​ క్యాచీని చెక్​ చేయడం చాలా సులభం. అదెలా అంటే..!

  • రన్ కమాండ్ విండోను ప్రారంభించడానికి 'Windows+R' నొక్కాలి.
  • డైలాగ్ బాక్స్‌లో 'cmd' అని టైప్ చేసి, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్​తో కమాండ్ ప్రాంప్ట్‌ను ప్రారంభించడానికి 'Ctrl + Shift + Enter' నొక్కాలి.
  • కమాండ్ ప్రాంప్ట్ విండోలో, 'ipconfig/displaydn' అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి.
  • అప్పుడు ఇన్​కాగ్నిటో మోడ్​తో పాటు సాధారణ మోడ్​లో రీసెంట్​గా సెర్చ్​ చేసిన వెబ్‌సైట్‌లు వాటి ఐపీ అడ్రస్​లతో సహా కనిపిస్తాయి.

ఐఓఎస్​తో పాటు ఆండ్రాయిడ్​లో ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని ఎలా చూడాలి?
ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని ఆండ్రాయిడ్, ఐఓఎస్​ డివైజ్​లలో చూడటానికి ఎటువంటి ప్రామాణికమైన ప్రాసెస్​ అందుబాటులో లేదు. అయితే, మీరు బ్రౌజింగ్​ హిస్టరీని యాక్సెస్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది. వీటికోసం ఫ్యామిలీటైమ్​, కిడ్స్​గార్డ్​, హోవర్​వాచ్​ అనే యాప్​లతో పాటుగా మరిన్ని ఇతర యాప్​లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మన డివైజ్​లోని ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని తేలిగ్గా యాక్సెస్​ చేయడానికి సహాయపడతాయి. ఈ యాప్‌లు మీ ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని కేవలం చూడటానికి మాత్రమే అవకాశాన్ని కల్పిస్తాయి.. తప్ప వాటిని డిలీట్​ చేసే అవకాశం ఉండదు.

పీసీలో ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని ఇలా డిలీట్​ చేయండి..!

  • రన్ కమాండ్ విండోను ప్రారంభించడానికి 'Windows + R' నొక్కాలి.
  • డైలాగ్ బాక్స్‌లో 'cmd' అని టైప్ చేసి, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్​తో కమాండ్ ప్రాంప్ట్ తెరవడానికి 'Ctrl + Shift + Enter' నొక్కాలి.
  • కమాండ్ ప్రాంప్ట్ విండోలో, 'ipconfig/flushdns' అని టైప్ చేసి, ఎంటర్ బటన్​ను నొక్కాలి.

ఇది మీ డీఎన్​ఎస్ క్యాచీని డిలీట్​ చేస్తుంది. అలాగే రీసెంట్​గా సెర్చ్​​ చేసిన వివరాలను పూర్తిగా తొలగిస్తుంది.

ఆండ్రాయిడ్​ ఫోన్​లో ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని ఇలా క్లియర్​ చేయండి..!
ఆండ్రాయిడ్ డివైజ్​లో ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని డిలీట్​ చేయడం చాలా సింపుల్​. డీఎన్​ఎస్ క్యాచీని తొలగించడానికి మీరు చేయాల్సిందల్లా క్రోమ్​ బ్రౌజర్‌ని ఉపయోగిస్తూ ఈ కింది సూచనలను పాటించడమే..

  • మీ ఆండ్రాయిడ్ డివైజ్​లో క్రోమ్​ బ్రౌజర్‌ను ఓపెన్​ చేయాలి.
  • అడ్రస్​ బాక్స్​లో, 'chrome://net-internals/#dns' అని టైప్ చేసి, ఎంటర్ నొక్కాలి.
  • డివైజ్​ డీఎన్​ఎస్ క్యాచీని డిలీట్​ చేయడానికి క్లియర్​ హోస్ట్ క్యాచీ బటన్​ను ప్రెస్​ చేయాలి.
  • అనంతరం క్రోమ్​ను క్లోజ్​ చేయాలి.

ఐఫోన్‌లో ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని క్లియర్ చేయండిలా..!
ఐఫోన్‌లో డీఎన్​ఎస్ క్యాచీని అలాగే మీ ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీని రిమూవ్​ చేయడం చాలా ఈజీ. కేవలం దీనికోసం చేయాల్సిందల్లా ఫ్లైట్​​​​ మోడ్​ను ఆన్​ ఆఫ్​ చేయడమే. అదెలా అంటే..

  • కంట్రోల్ సెంటర్‌ను ఎక్స్​పాండ్​ చేయడానికి ఐఫోన్‌ స్క్రీన్​పై టాప్​ రైట్​ కార్నర్​ను కిందకు స్వైప్​ చేయాలి.
  • దాన్ని ఆన్​ చేయడానికి ఫ్లైట్​ మోడ్​పై నొక్కాలి.
  • కొన్ని సెకన్లు ఆగి మళ్లీ దాన్ని ఆఫ్​ చేయాలి.

దీంతో మీ డివైజ్​లోని మొత్తం డీఎన్​ఎస్ క్యాచీతో పాటు ఇన్​కాగ్నిటో బ్రౌజింగ్​ హిస్టరీ కూడా క్లియర్​ అవుతుంది.

క్రోమ్​ ఇన్​కాగ్నిటో మోడ్‌కు ప్రత్యామ్నాయం లేదా..?
ఇన్​కాగ్నిటో మోడ్‌ను వాడకుండా మీరు ప్రైవేట్​గా బ్రౌజ్ చేయాలనుకుంటే మీరు ఇవి తప్పక అనుసరించాలి.

వీపీఎన్​ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి..
మీ డివైజ్​లో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్​) యాప్​ను ఇన్​స్టాల్​ చేసి ఎనేబుల్​ చేసుకోవాలి. ఇది మీ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను నియంత్రణలో ఉంచి ఐపీ అడ్రస్​ను హైడ్​ చేస్తుంది. అలాగే అన్​-ఆథరైజ్డ్​ సర్వర్లపై ఆన్‌లైన్ నిఘా వ్యవస్థ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

సురక్షితమైన వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించాలి..
మీ ఆన్‌లైన్ హిస్టరీని గోప్యంగా ఉంచడానికి టోర్ బ్రౌజర్ వంటి సురక్షితమైన సెర్చ్ ఇంజన్లను అందుబాటులో ఉన్నాయి. సమాచారాన్ని సురక్షితంగా బ్రౌజ్​ చేయడంలో ఇది సహాయపడుతుంది.

బ్రౌజింగ్ డేటాను రెగ్యులర్​గా క్లియర్ చేయడం..
మీ డివైజ్​ నుంచి బ్రౌజింగ్ డేటాను క్రమం తప్పకుండా క్లియర్ చేస్తూ ఉండాలి. ఇది సెర్చ్ యాక్టివిటీలను ఎప్పటికప్పుడు తొలగించడంలో సహాయపడుతుంది.

డీఎన్​ఎస్ క్యాచీని డిలీట్​ చేయాడం..
ఇన్​కాగ్నిటో మోడ్‌ ఆన్‌లో ఉన్నప్పుడు కూడా మీరు రీసెంట్​గా వెతికిన వెబ్‌సైట్ వివరాలను తొలగించడానికి డీఎన్​ఎస్ క్యాచీని రెగ్యులర్​గా డిలీట్​​ చేయాలి.

పైన వివరించిన సూచనలను పాటిస్తే థర్డ్-పార్టీ సర్వర్ల బారి నుంచి తప్పించుకోవడానికి వీలుంటుంది. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగకుండా కాపాడుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.