Content Creators Gadgets : సోషల్ మీడియా మానియా నడుస్తున్న నేటి కాలంలో కంటెంట్ క్రియేటర్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే మంచి కంటెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. దానిని ప్రెజెంట్ చేసే విధానం కూడా చాలా బాగుండాలి. దాని కోసం సరైన ఎక్విప్మెంట్ కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఓ లుక్కేద్దామా..
కెమెరా
విజువల్ కంటెంట్ హవా నడుస్తున్న ఈ సమయంలో.. కంటెంట్ క్రియేటర్స్ దగ్గర తప్పకుండా ఉండాల్సిన మొదటి గాడ్జెట్ కెమెరా. మార్కెట్లో చాలా మంచి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మంచి ఫుటేజ్ కోసం సాధారణంగా డీఎస్ఎల్ఆర్ లేదా మిర్రర్‌లెస్ కెమెరాలు వాడుతుంటారు. కానీ వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.
![best DSLR for visual content creators](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_dslr-1.jpeg)
ఒక వేళ మీరు స్టార్టర్ అయినా మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోయినా మరేం ఫర్వాలేదు. ఇప్పుడు వస్తున్న స్మార్ట్‌ఫోనుల్లో కూడా చాలా మంచి వీడియో క్వాలిటీ ఉంటోంది. 4కే వీడియోలు, హెచ్డీ ఇమేజ్‌లు కూడా తీసుకునే సౌలభ్యం కలుగుతోంది. హై బడ్జెట్ నుంచి లోబడ్జెట్ మొబైల్స్‌లోనూ మంచి కెమెరాలు ఉంటున్నాయి. కనుక వీటిని కూడా ట్రై చేయవచ్చు.
ట్రైపాడ్, గింబల్స్
మీరు తీసే ఫొటోలు, వీడియోలు చాలా మంచిగా, స్టేబుల్‌గా రావాలంటే కచ్చితంగా ట్రైపాడ్ వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా టైమ్ లాప్స్, సెల్ఫ్ రికార్డింగ్ చేసేటప్పుడు వీటి అవసరం ఎంతో ఉంటుంది.
![best tripod and gimbal for video shooting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_trypod-and-gimbal.jpg)
డ్రోన్స్
ఒక వేళ మీ దగ్గర కాస్త బడ్జెట్ ఎక్కువగా ఉంటే.. గింబల్స్తో పాటు డ్రోన్స్ కూడా వాడొచ్చు. గింబల్ వల్ల మీ వీడియో స్టెబిలిటీ బాగుంటుంది. ఇప్పుడు స్మార్ట్ఫోన్లకు, డీఎస్ఎల్ఆర్లకు.. రెండింటికీ ఉపయోగించుకునే గింబల్స్కు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక టాప్ యాంగిల్ షాట్స్ తీయాలంటే డ్రోన్స్ వాడాల్సి ఉంటుంది. అయితే ఇవి ఎక్కడపడితే, అక్కడ వాడడానికి వీలుపడదు. పోలీసుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
![best drones for content creators](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_drone-1.jpg)
మైక్రో ఫోన్
మంచి ఆడియో క్వాలిటీ కావాలంటే కచ్చితంగా బెస్ట్ మైక్రోఫోన్ వాడాల్సి ఉంటుంది. షాట్‌గన్ మైక్, లావాలియర్ మైక్ లాంటి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్స్ వాడడం వల్ల మంచి ఆడియోను రికార్డ్ చేయడానికి వీలవుతుంది. ఒక వేళ మీ బడ్జెట్ తక్కువగా ఉన్న ఫర్వాలేదు. తాజాగా నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్‌తో ఎన్నో మంచి ఇయర్ ఫోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ట్రై చేయండి.
![external microphone for best audio recording](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_microphone.jpg)
లైటింగ్ కిట్
వీడియోలు, ఫొటోలు మంచి క్వాలిటీగా తీయాలంటే.. లైటింగ్ అనేది చాలా ముఖ్యం. ఇందుకోసం మార్కెట్లో రకరకాల లైటింగ్ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. రింగ్ లైట్ చాలా పాపులర్ గాడ్జెట్. దీనిని మీరు తక్కువ బడ్జెట్లోనే కొనుక్కోవడానికి అవకాశం ఉంది.
పోర్టబుల్ హార్డ్ డ్రైవ్
వీడియోలు చాలా ఎక్కువ డేటాను ఆక్రమిస్తాయి. కనుక వాటిని సేవ్, బ్యాక్అప్ చేసుకోవడానికి మంచి పోర్టబుల్ హార్డ్ డ్రైవ్స్ తీసుకోవడం మంచిది.
![hard drive for content creators](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_external_portable_hard_drive.jpg)
ల్యాప్‌టాప్, కంప్యూటర్
వీడియోలు, ఫొటోలు ఎడిట్ చేసుకోవడానికి మంచి మానిటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాప్‌టాప్ కూడా బాగానే ఉంటుంది.
![best monitor and laptop for content creators](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_computer-and-laptop.jpg)
గ్రీన్ స్క్రీన్
మీరు క్రియేటివ్ వీడియోలు తీయాలనుకుంటే.. గ్రీన్ స్క్రీన్ ఉపయోగించాల్సి ఉంటుంది. హై బడ్జెట్ మూవీస్‌లో కొన్ని సీన్స్ తీసేందుకు బ్లూ స్క్రీన్‌ను కూడా వాడుతుంటారు. వాస్తవానికి ఇవి తక్కువ బడ్జెట్లోనే అందుబాటులో ఉన్నాయి.
![green screen for background change and visual effects](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_green-screen.jpg)
పవర్ బ్యాంక్
ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్‌లు చేసేటప్పుడు బ్యాటరీ బ్యాక్అప్ కోసం పవర్ బ్యాంకులు అవసరమవుతాయి.
ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్
మీరు విజువల్ వండర్స్ తీయాలనుకుంటే మాత్రం కచ్చితంగా పవర్ఫుల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వాడాల్సిందే. దీనితో పాటు పవర్ఫుల్ ర్యామ్, గ్రాఫిక్స్కార్డ్ లాంటి హార్డ్వేర్స్ను కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే ఎడిటింగ్ చాలా స్మూత్‌గా చేసుకోవడానికి వీలవుతుంది.
![best software for video editing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2023/18790709_editing-software.jpg)