అమ్మో...! పెట్రోల్, డిజీల్ ధరలు ఇలా పెరిగిపోతున్నాయేంటి..? దీనికి బదులు ఎలక్ట్రిక్ బైక్ కొనుకుందామనిస్తోంది కదూ..! కానీ, వాటి ధరలు కూడా సుమారు లక్ష రూపాయల్లో ఉండటంతో కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తోంది. ఈ సమస్యే హైదరాబాద్ యువకుడిని ఆలోచనల్లో పడేసింది. సొంతంగా విద్యుత్ వాహనం తయారీ వైపు అడుగులు వేసేలా చేసింది. అలా... ఇంట్లోని పాత సైకిల్‌నే... ఎల్టక్రిక్ సైకిల్ (Cheapest Electric bicycle)గా మార్చాడు. రూ. 5 ఖర్చుతో 40 కిలోమీటర్లు ప్రయాణించేలా రూపొందించాడు.
అప్పుడప్పుడు ఎలక్ట్రీషయన్ అవతారం
హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌కు చెందిన అబ్దుల్ అసిమ్ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మసాబ్ ట్యాంకులోని ఆఫీస్‌కు వెళ్తాడు. పెరిగిన పెట్రోల్ ధరలు అతడికి చిరాకు తెప్పించాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్ సైకిల్ (Cheapest Electric bicycle) ఎందుకు రూపొందించొద్దు అని సంకల్పించాడు. విద్యార్థి దశ నుంచే హార్డ్‌వేర్ నైపుణ్యాలున్న అసిమ్.. ఈ అంశంపై విస్తృత శోధన చేశాడు. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగమైనా.. తన ఇంటివద్ద మిత్రుని షాపులో అప్పుడప్పుడు ఎలక్ట్రీషయన్‌గా అవతారమెత్తుతాడు. ఆ అనుభవం ఈ ప్రాజెక్టులో ఉపయోగపడింది. అసిమ్ ఇంట్లోని పాత సైకిల్ బయటకు తీసి దానికి 250 వాట్ల బీఎల్డీసీ మోటారు, 18ఎమ్హెచ్ వోల్టుల రెండు బ్యాటరీలు, ఎక్సలేటర్, హారన్, ఇతర విడిభాగాలు అమర్చాడు.
కేవలం రూ. 6500 ఖర్చు చేసి నా పాత సైకిల్‌నే ఎలక్ట్రిక్ సైకిల్ (Cheapest Electric bicycle)గా మార్చాను. గరిష్ఠంగా గంటకు 30 కి.మీల వేగంతో వెళ్లే ఈ సైకిల్ ఒక యూనిట్ విద్యుత్‌తో ఫుల్ ఛార్జ్ అవుతుంది. తద్వారా ఐదు రూపాయల వ్యయంతో 40 కి.మీల వరకూ ప్రయాణించొచ్చు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ (Cheapest Electric bicycle) రూపకల్పనలో నా మిత్రులు సాయి, సురేష్ ఎంతగానో సహాయం చేశారు. వెన్నంటే ఉండి ప్రోత్సాహించారు. ఈ సైకిల్ సక్సెస్ అయిన ఆనందంలో దివ్యాంగులకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు రూపొందించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.
-అబ్దుల్ అసిమ్, ఎలక్ట్రిక్ సైకిల్ రూపకర్త
లిథియం అయాన్ బ్యాటరీలు బెటర్
ప్రస్తుతం లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉపయోగించిన ఈ డిజైన్‌లో లిథియం అయాన్ బ్యాటరీలు వినియోగించిన మంచి ఫలితాలు వస్తాయి. లిథియం అయాన్ బ్యాటరీల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ (Cheapest Electric bicycle) ద్వారా అటు పెట్రోల్ మోత, పర్యావరణ కాలుష్యం రెండింటికీ విరుగుడు లభిస్తుందని సంతోషంగా చెబుతున్నాడు...అసిమ్.
మీరు కూడా ఇంధన ధరలతో విసిగిపోయారా..? మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎలక్ట్రిక్ సైకిల్ (Cheapest Electric bicycle) తయారు చేయండి. కొంచెం క్రియేటివిటిగా ఆలోచిస్తే... సరికొత్త ఎలక్ర్టిక్ సైకిల్ (Cheapest Electric bicycle)కు శ్రీకారం చుట్టవచ్చు. కావాలంటే... రూపకల్పనలో భాగంగా సలహాలు, సూచనలు ఇస్తానని చెబుతున్నాడు... అబ్దుల్ అసిమ్.
ఇవీ చూడండి: