ETV Bharat / science-and-technology

ఇంటి నుంచే పని.. ఇవిగోండి కొన్ని!! - TIPS FOR EMPLOYEES

ఇంకెన్ని రోజులో ఈ లాక్‌డౌన్‌..? అందరి ఆలోచన ఇదే.. మీ మదిలోనూ అదే తిరుగుతోందా? ఇప్పటికే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ ప్లాన్‌ చేసుంటారుగా!! ఇంట్లో సిస్టమ్‌, ల్యాపీ.. ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది.. ఆన్‌ చేసి ఈ సర్వీసుల్ని వాడితే సరి..

MANY APPLICATIONS FOR WORK FROM HOME EMPLOYEES
ఇంటి నుంచే పని.. ఇవిగోండి కొన్ని!!
author img

By

Published : Apr 23, 2020, 3:03 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ఇంట్లో ఉండే ఆఫీస్‌ కార్యకలాపాల్ని చక్కబెట్టేయొచ్చు. బృందాన్ని ఒకే వేదికపైకి తెచ్చి కలిసి పని చేయొచ్ఛు. వాడడం కూడా చాలా సులభం. మరి అలాంటి ఆన్​లైన్​ అప్లికేషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి...

మైక్రోసాఫ్ట్‌ మరోటి..

రింత ప్రొఫెషనల్‌గా నెట్టింట్లో మీటింగ్‌లు పెట్టుకుందాం అనుకుంటే ‘మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌’ వేదికలో సభ్యులవ్వొచ్ఛు సుమారు 250 మంది వరకు మీటింగ్‌లో పాల్గొనొచ్ఛు యూజర్‌ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ వలయంలో వీడియో సమావేశాల్ని ఏర్పాటు చేసుకోవచ్ఛు మాట్లాడుతూనే టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపొచ్ఛు సమావేశం జరుగుతున్నప్పుడే ‘ఆఫీస్‌ డాక్యుమెంట్స్‌’ని సులభంగా షేర్‌ చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన క్లౌడ్‌ స్పేస్‌ని మైక్రోసాఫ్ట్‌ అందిస్తోంది.

‘డాక్యుమెంట్‌’ పనుల కోసం..

చేస్తున్న ఉద్యోగం ఏదైనా ‘డాక్యుమెంట్‌’లకు సంబంధించిన పని ఉంటే.. అందుబాటులో ఉన్న క్లౌడ్‌ సర్వీసుల్ని వాడుకుని చేయొచ్చు. ఉదాహరణకు గూగుల్‌ డ్రైవ్‌, మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌.. వీటిల్లోకి లాగిన్‌ అయ్యి డాక్యుమెంట్‌లను క్రియేట్‌ చేయొచ్చు. ఎడిటింగ్‌ చేసి పంపాల్సిన వారితో పంచుకోవచ్చు. అయితే, ఆయా సర్వీసుల్లో కచ్చితంగా సభ్యులై ఉంటేనే వాటిని వాడుకోగలరు. షేర్‌ చేసిన లింక్‌లను ఓపెన్‌ చేయగలరు. మరైతే, బృందంతో పని చేసేటప్పుడు ఎలా? వారిలో ఒక్కొక్కరూ ఒక్కో క్లౌడ్‌ సర్వీసు వాడితే.. అందరూ ఒకే చోట చేరి కలిసి పని చేయాలంటే? అందుకు తగినదే ఈ ‘బిట్‌’ సర్వీస్‌. గూగుల్‌ డ్రైవ్‌, వన్‌డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, బాక్స్‌... లాంటి అన్ని రకాల క్లౌడ్‌ సర్వీసుల్ని సపోర్టు చేస్తుంది. సర్వీసులో రిజిస్టర్‌ అయ్యాక బృంద సభ్యుల్ని దీంట్లోకి ఆహ్వానించొచ్చు. తర్వాత ‘వర్క్‌స్పేస్‌’లను క్రియేట్‌ చేసి పని ప్రారంభించొచ్చు. అన్ని రకాల ఫైల్‌ ఫార్మెట్‌లను బిట్‌ సపోర్టు చేస్తుంది. మీరు ఏ రంగంలో పని చేస్తున్న అందుకు తగిన సర్వీసుల్ని ఎంపిక చేసుకుని వాడుకోవచ్చు. ఉచిత ఎకౌంట్‌లో 50 మందిని బృందంగా జత చేయొచ్ఛు ఉచితంగా 1జీబీ స్టోరేజ్‌ని పొందొచ్ఛు క్రియేట్‌ చేసిన డాక్యుమెంట్‌లను పాస్‌వర్డ్‌లతో సురక్షితం చేయొచ్చు.

గూగుల్‌ ‘మీట్‌’ వాడితే...

ఇంట్లో నుంచే సమావేశాలు.. ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించేందుకు గూగుల్‌ అందించే ‘మీట్‌’ సర్వీస్‌ని వాడొచ్చు. నెట్టింట్లో ఎన్నో అనుమానాలు, సెక్యూరిటీ విశ్లేషణలకు దారి తీసిన ‘జూమ్‌’కి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు గూగుల్‌ మీట్‌కే మొగ్గు చూపుతున్నారు నెటిజన్లు. వాడుతున్న జీమెయిల్‌తోనే (జి-సూట్‌ యూజర్లుకు మాత్రమే) సరాసరి ‘మీట్‌’లోకి లాగిన్‌ అయ్యే వీలుంది. మీటింగ్స్‌లో 16 మంది వరకూ పాల్గొనొచ్చు. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌లోని ఎక్స్‌టెన్షన్స్‌తో అదనపు సౌకర్యాల్ని ‘మీట్‌’కి జత చేయొచ్చు. ఉదాహరణకు 'Nod' ఎక్స్‌టెన్షన్‌ని తీసుకోండి. దీంతో మీటింగ్స్‌ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడి అంతరాయం కలిగించకుండా.. అభిప్రాయం, ప్రశ్నల్ని చాట్‌ రూపంలో తెలపొచ్చు. వింటున్న వీడియో క్లాస్‌లో ఏదైనా సందేహం ఉంటే.. తరగతి గదిలో చెయ్యి ఎత్తినట్టుగా ఎమోజీ రూపంలో మెసేజ్‌ పెట్టొచ్ఛు ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నిద్దాం అనుకుంటే https://bit.ly/3bhEIHy లింక్‌ని చూడండి.

టెక్స్ట్‌ మెసేజ్‌లతోనే..

రంగం ఏదైనా.. బృందాలుగా ఏర్పడి పని చేస్తుంటారు. అలాంటప్పుడు ఎవరు ఎక్కడున్నా అనునిత్యం ఛాటింగ్‌ ద్వారా విధి నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ప్రత్యేక వేదిక కావాలనుకుంటే ఈ సర్వీస్‌ని వాడొచ్చు. వందల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నప్పుడు క్షణాల్లో సమాచారాన్ని చేరవేసేందుకు ఇదో చక్కని వేదిక. నలుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి కాల్స్‌ని కూడా మాట్లాడుకోవచ్చు. డాక్యుమెంట్‌లు షేర్‌ చేసుకోవచ్చు. జీసూట్‌, ఆఫీస్‌ 365, డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌.. ఇలా వాడుతున్న క్లౌడ్‌ స్పేస్‌ ఏదైనా దీంతో సింక్‌ చేసుకుని ఫైల్స్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.

‘ప్రాజెక్టు’ల్లో భాగంగా..

అంకుర సంస్థ కావచ్ఛు. పెద్ద కంపెనీలో మీరో ప్రాజెక్టు లీడర్‌ అయ్యుండొచ్చు. ఇంటి పట్టునే ఉండి బృందం మొత్తం చేపట్టిన ప్రాజెక్టుని ఎలా చేస్తున్నారు? ఎంత వరకూ పూర్తి చేశారు? వారికి తగిన సూచనలు చేయడానికి సరైన ప్లాట్‌ఫామ్‌ కావాలంటే.. ‘హెస్పేస్‌’ సర్వీసుని ప్రయత్నించొచ్చు. చేపట్టిన ప్రాజెక్టు పలు విభాగాలుగా విభజించి బృందాన్ని మానిటర్‌ చేయొచ్చు. ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు. డేటాని పంచుకోవచ్చు. చేయాల్సిన పనుల్ని ఫాలోఅప్‌ చేయొచ్చు. అవసరం నిమిత్తం ‘గెస్ట్‌’ రూపంలో ఇతరుల్ని ప్రాజెక్టులోకి ఆహ్వానించొచ్చు. ఉచిత ఎకౌంట్‌లో పది మంది బృందాన్ని, ఐదుగురు గెస్ట్‌లను ప్రాజెక్టులోకి ఆహ్వానించొచ్చు. 10 క్లౌడ్‌ స్పేస్‌ని పొందొచ్చు. ఫోన్‌లలోనే కాకుండా డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లలోనూ అప్లికేషన్‌ టూల్‌లా ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. https://hey.space/

డిజైన్‌’ చేసేందుకు..

మీరో ప్రొడక్టు డిజైనరా? అయితే, ఇంటి నుంచే ఉత్పత్తుల్ని డిజైన్‌ చేయాల్సిన అవసరం ఏర్పడితే ‘ఫిగ్మా’ సర్వీసుని వాడుకోవచ్చు. ఎవరు ఎక్కడున్నా బృందంగా ఏర్పడి ‘వెక్టార్‌ డిజైన్లు, ఇతర అవసరాలకు తగిన వాటిని ప్రత్యేక టూల్స్‌తో రూపుదిద్దొచ్చు. ప్రొటోటైప్స్‌, టెంప్లెట్స్‌ని క్రియేట్‌ చేసేందుకు ఇది తగినది. డిజైన్‌ చేసిన వాటిని మీకు కావాల్సిన ఫార్మెట్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. ప్రొడక్టులను రూపొందించే క్రమంలో బృందంగా ఏర్పడి లైవ్‌లోనే మార్పులు చేర్పులు చేయొచ్చు. ‘ఎడిటర్‌’ టూల్‌తో అందుకు కావాల్సిన ఆప్షన్లు ఉన్నాయి. డ్రాయింగ్స్‌కి తగిన సూచనల్ని టెక్స్ట్‌ మెసేజ్‌లతోనూ చెప్పొచ్చు.

‘డెడ్‌లైన్‌’ల కోసం..

దేనికైనా నిర్ణీత సమయం ఉంటుంది. ఆ డెడ్‌లైన్‌లోపే పనుల్ని పూర్తి చేయడం కొన్ని సార్లు అనివార్యం అవుతుంది. అందుకే.. ఎవరికి ఏ పని అప్పగించినా దాన్ని నిత్యం ట్రాక్‌ చేస్తూ ప్రోగ్రెస్‌ని పరిశీలించాలి. అందుకే ఈ ప్లాట్‌ఫామ్‌. ఇదో టైమ్‌ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌. ఒక్కసారి సిస్టమ్‌లో లాగిన్‌ అయ్యాక ఎంత సమయం దేనికి కేటాయిస్తున్నారో ట్రాక్‌ చేసి చెబుతుంది. ఇలా రోజు మొత్తం మీద బృందంలో ఎవరి ప్రోగ్రెస్‌ ఎలా ఉందో చెక్‌ చేయొచ్ఛు ఎక్కడ సమయం వృథా చేస్తున్నారో తెలుసుకుని అప్రమత్తం చేసేందుకు వీలవుతుంది. ‘డ్యాష్‌బోర్డు’తో అన్ని వివరాల్ని రివ్యూ చేయొచ్ఛు బ్రౌజర్‌ సర్వీసుగానే కాకుండా అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లా సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్ఛు ఒకవేళ ఫోన్‌లో పని చేసే ప్రాజెక్టు అయితే యాప్‌ల రూపంలో సర్వీసుని వాడుకోవచ్చు.

‘లింక్‌’తోనే ప్రవేశం..

వీడియో ఛాటింగ్‌ గురించి మాట్లాడితే కచ్చితంగా ప్రస్తావించేది స్కైప్‌ గురించే. అంతలా నెటిజన్లకు సుపరిచితం. నేటి లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త సదుపాయాన్ని స్కైప్‌ యూజర్లకు పరిచయం చేస్తోంది. అదే ‘మీట్‌ నౌ’ దీంతో లాగిన్‌ కాకుండానే వీడియో సమావేశంలో పాల్గొనొచ్చు. ఓ లింక్‌ని క్రియేట్‌ చేస్తే చాలు. దానిపై క్లిక్‌ చేసి వీడియో కాల్‌ మాట్లాడొచ్చు.

ఇదీ చూడండి:- కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.