ETV Bharat / science-and-technology

Iphone 13 pro hacked: 15 సెకన్లలోనే ఐఫోన్ 13 ప్రో హ్యాక్​! - ఐఫోన్ హ్యాకింగ్​ న్యూస్​

యాపిల్ కొత్త ఫోన్ ఐఫోన్ 13 ప్రో ను (Iphone 13 pro news) 15 సెకన్లలోనే హ్యాక్ చేశారు చైనా హ్యాకర్లు. అంతర్జాతీయ కాంపిటీషన్​లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భారీ బహుమానం కూడా గెలుచుకున్నారు.

apple-iphone-13-pro-with-latest-ios-15-hacked-in-seconds
15 సెకన్లలోనే ఐఫోన్ 13 ప్రో హ్యాక్​!
author img

By

Published : Oct 22, 2021, 4:03 PM IST

యాపిల్ లేటెస్ట్ మోడల్​ ఐఫోన్ 13 ప్రో ను (Iphone 13 pro news) సెకన్లలోనే హ్యాక్ చేశారు చైనా హ్యాకర్లు. చెంగ్డూలో జరిగిన అంతర్జాతీయ హ్యాంకింగ్ కాంపిటీషన్​లో ఐఓఎస్​ 15.0.2 సాఫ్ట్​వేర్​తో నడుస్తున్న ఈ అత్యాధునిక ఫోన్ సెక్యూరిటీ వ్యవస్థను క్షణాల్లోనే బ్రేక్ చేశారు(iphone 13 pro hacked ). టియాన్​ఫు కప్ పేరిట ఏటా నిర్వహించే ఈ అంతర్జాతీయ పోటీల్లో యాపిల్​, గూగుల్​, మైక్రోసాఫ్ట్ సహా ఇతర టాప్​ బ్రాండ్ల సాఫ్ట్​వేర్లను హ్యాకర్ల ముందుంచారు. వారు వాటిని హ్యాక్ చేసిన తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.

ఈ పోటీల్లో(iphone 13 pro hack news) పాల్గొన్న చైనా టెక్ కంపెనీ కున్​లున్​ ల్యాబ్​కు చెందిన బృందం స్టేజీపై లైవ్​లో 15 సెకన్లలో ఐఫోన్ 13 ప్రోను హ్యాక్​ చేసింది(iphone 13 pro hacked in 15 seconds ). ఈ సంస్థ సీఈఓ గతంలో కిహూ 360 సీటీఓగా పనిచేశారు. మొబైల్ సఫారీ వెబ్ బ్రౌజర్ రిమోట్ కోడ్​ను ఉపయోగించి వీరు ఐఫోన్ 13 ప్రోను హ్యాక్ చేసినట్లు ఫోర్బ్స్​ తెలిపింది.

ఈ పోటీల్లో పాంగూ బృందం మొదటి స్థానంలో నిలిచి 3,00,000(రూ.2.2కోట్లు) డాలర్ల బహుమానం గెలుచుకుంది. యాపిల్​ సాఫ్ట్​వేర్​ను సునాయాసంగా హ్యాక్ చేస్తారని ఈ బృందానికి గుర్తింపు ఉంది. ఈ కాంపిటీషన్​లో సెకన్లలోనే ఐఫోన్​ను హ్యాక్ చేసేలా(iphone hacking ) టెకీలందరు నెలల పాటు సన్నద్ధమవుతారు.

ఇదీ చదవండి: అదిరే ఫీచర్లతో గూగుల్​ పిక్సెల్​ 6 సిరీస్​ ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.