ETV Bharat / science-and-technology

Apple Display Technology: ఐఫోన్‌లో కొత్త ఫీచర్‌.. ఫోన్‌ డిస్​ప్లేతో ఛార్జింగ్ - యాపిల్‌ కొత్త టెక్నాలజీ

Apple Display Technology: యూజర్స్​ సులువుగా ఛార్జింగ్ చేసుకునేలా సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది యాపిల్​ సంస్థ. భవిష్యత్‌లో విడుదల చేసే ఐఫోన్‌, ఐపాడ్‌లలో ఈ సాంకేతికత అందుబాటులో ఉండనుంది.

Through Display Wireless Chareging
యాపిల్‌
author img

By

Published : Jan 3, 2022, 7:38 AM IST

Apple Display Technology: యాపిల్ కంపెనీ భవిష్యత్‌లో విడుదల చేసే ఐఫోన్‌, ఐపాడ్‌లలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. దీంతో యూజర్స్ తమ యాపిల్‌ ఉత్పత్తులను సులువుగా ఛార్జింగ్ చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యూజర్స్ తమ యాపిల్ ఉత్పత్తులను ఐఫోన్‌/ఐపాడ్ డిస్‌ప్లేపై ఉంచి ఛార్జ్‌ చేసుకోవచ్చట. అంటే ఇక మీదట ఐఫోన్‌/ఐపాడ్ డిస్‌ప్లేనే ఛార్జర్‌లా పనిచేస్తుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు యాపిల్ కంపెనీ 'థ్రూ-డిస్‌ప్లే వైర్‌లెస్‌ ఛార్జింగ్' అనే టెక్నాలజీపై పేటెంట్ పొందినట్లు సమాచారం. యూజర్స్‌ ఈ టెక్నాలజీ సాయంతో ఐఫోన్/ఐపాడ్ ద్వారా ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌లతోపాటు ఇతర యాక్సెసరీలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే యాపిల్ డిస్‌ప్లే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే సాంకేతికతను కూడా ఆయా డివైజ్‌లలో పరిచయం చేయాల్సి ఉంటుందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Apple New Technology: ఇప్పటికే యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఛార్జ్‌ చేసేందుకు మెగాసేఫ్‌ ఛార్జర్, బ్యాటరీ ప్యాక్‌లను పరిచయం చేసింది. యాపిల్ కంపెనీ ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ 14లో ఈ-సిమ్‌ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ నేపథ్యంలో వైర్‌లెస్‌ డిస్‌ప్లే ఛార్జింగ్ టెక్నాలజీ వార్తలు రావడంతో ఐఫోన్ 14లోనే ఈ టెక్నాలజీని పరిచయం చేస్తారని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత లేదు. గతేడాది నుంచి యాపిల్ ఐఫోన్లతోపాటు ఇచ్చే ఛార్జింగ్ అడాప్టర్‌ను నిలిపివేసింది. ఈ క్రమంలో యాపిల్ తీసుకొస్తున్న సాంకేతికత యూజర్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఐఫోన్​ 12 మినీపై సూపర్​ కూల్​ ఆఫర్​.. రూ.50వేల లోపే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.