ETV Bharat / science-and-technology

Android Phones Security Risk : ఆండ్రాయిడ్ యూజర్స్​కు అలర్ట్​.. ఫేక్​ టెలిగ్రామ్​, సిగ్నల్​ యాప్స్​తో​.. జర జాగ్రత్త! - ఆండ్రాయిడ్​ ఫోన్ సైబర్ ఫ్రాడ్​

Android Phones Security Risk In Telugu : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్​. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాాలా సెక్యూరిటీ వల్నరబులిటీస్ ఉన్నట్లు టెక్​ నిపుణులు గుర్తించారు. అలాగే గూగుల్ ప్లేస్టోర్​లో నకిలీ టెలిగ్రామ్​, సిగ్నల్ యాప్​లు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిలోని స్పైవేర్స్​.. యూజర్ల డేటాను చోరీ చేస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆండ్రాయిడ్​ యూజర్లు తమ ఫోన్లను వెంటనే అప్​డేట్​ చేసుకోవాలని, ఫేక్ యాప్​లను డిలీట్ చేయాలని సూచిస్తున్నారు.

Android Phones cyber Security Risk
Android Phones Security Risk
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 2:33 PM IST

Updated : Sep 12, 2023, 3:00 PM IST

Android Phones Security Risk : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతున్నారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్​లో నకిలీ టెలిగ్రామ్​, సిగ్నల్ యాప్​లను తీసుకొచ్చారు. ఇవి చూడడానికి అచ్చంగా ఒరిజినల్​ యాప్స్​ లానే ఉంటాయి. అందువల్ల యూజర్స్ వీటిని గుర్తించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారీగా డౌన్​లోడ్స్​
Fake Apps On Play Store : టెలిగ్రామ్, సిగ్నల్ యాప్​లు రెండూ.. వాట్సాప్​లానే మెసేజింగ్ అప్లికేషన్స్​. వీటికి కూడా చాలా పెద్ద యూజర్​ బేస్ ఉంది. అందుకే సైబర్​ నేరగాళ్లు వీటిని టార్గెట్​ చేసుకున్నారు. టెలిగ్రామ్​, సిగ్నల్ యాప్​లకు సంబంధించిన ఫేక్​, క్లోనింగ్ యాప్​లను రూపొందించి, వాటిని గూగుల్ ప్లేస్టోర్​లో ఉంచారు. ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్ నుంచి మిలియన్ల కొద్దీ ఈ ఫేక్ యాప్​ డౌన్​లోడ్స్ జరిగినట్లు Kaspersky సైబర్ సెక్యూరిటీ​ నిపుణులు గుర్తించారు.

డేటా చోరీ!
Recent Cyber Frauds 2023 : ఫేక్ టెలిగ్రామ్​, సిగ్నల్ యాప్​లు రెండూ ఒరిజినల్ యాప్స్​ మాదిరిగానే ఉంటుంది. కానీ వీటిలో చాలా స్పైవేర్​లు ఇన్​స్టాల్​ అయ్యుంటాయి. వాస్తవానికి ఇవి ఒరిజినల్ యాప్స్ కంటే చాలా వేగం (ఫాస్ట్​)గా పనిచేస్తుంటాయి. ఇవి ఆండ్రాయిడ్ ఫోన్లలోని సున్నితమైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందిస్తాయి. ముఖ్యంగా ఈ బోగస్ యాప్​లు.. యూజర్​ ఐడీ, పేరు, ఫోన్​లోని కాంటాక్ట్​ నంబర్లు​, ఛాట్​ మెసేజ్​లు, ఫొటోలు సహా సమస్త సమాచారాన్ని.. సైబర్​ నేరగాళ్ల సర్వర్స్​కు పంపిస్తాయి. అందుకే ఈ ఫేక్​ యాప్​లకు టెక్​ నిపుణులు 'ఈవిల్ టెలిగ్రామ్'​ అనే కోడ్​నేమ్ ఇచ్చారు.

ఫేక్​ యాప్స్​ను గుర్తించడం ఎలా?
How To Find Fake Apps On Android : సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ ఫేక్​ యాప్ కోడ్​లను పరిశీలించి.. అఫీషియల్​ యాప్​లనే కొంచెం మోడిఫై చేసి వీటిని రూపొందించినట్లు గుర్తించారు. అందుకే ఈ నకిలీ యాప్​లను గుర్తించడం కొంచెం కష్టం. అయితే ఫేక్ యాప్​లో ఒక అడిషినల్​ మాడ్యూల్​ ఉంటుంది. ఇది సదరు యాప్ ఉపయోగిస్తున్న యూజర్​కు సంబంధించిన మెసేజ్​లను, ఫోన్​లోని డేటాను సైబర్ నేరగాళ్లకు అందజేస్తుంది. కనుక మీరు డౌన్​లోడ్​ చేసిన యాప్​లో ఏదైనా ఎక్స్​ట్రా మాడ్యూల్​ గనుక ఉంటే.. దానిని వెంటనే అన్​ఇన్​స్టాల్​ చేసేయండి.

ఆండ్రాయిడ్ యూజర్స్ 'రిస్క్​'లో ఉన్నారు!
Android Phone Security Tips : ఆండ్రాయిడ్ ఫోన్​​ యూజర్లు హై సెక్యూరిటీ రిస్క్​లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందువల్ల కచ్చితంగా యూజర్లు అందరూ తమ ఆండ్రాయిడ్​ డివైజ్​ ఆపరేటింగ్ సిస్టమ్​ (Android OS) అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ప్రకారం, ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్​ 12, ఆండ్రాయిడ్​ 13 ఫోన్లలో భద్రతాపరమైన రిస్క్​లు ఉన్నాయి. అందుకే ఆయా ఫోన్ యూజర్లు వెంటనే తమ ఆండ్రాయిడ్ ఫోన్లను అప్​డేట్ చేసుకోవడం ఉత్తమం.

Last Updated : Sep 12, 2023, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.