పాపులర్ వాచ్ బ్రాండ్ ఫాస్ట్‌ట్రాక్.. కొత్త రివోల్ట్ స్మార్ట్‌వాచ్ సిరీస్‌ను లాంఛ్ చేసింది. రివోల్ట్ FS1 పేరు గల ఈ స్మార్ట్‌వాచ్ పూర్తి బడ్జెట్ రేంజ్లో వస్తోంది. దీనిలోని బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఈ వాచ్కే హైలైట్‌గా నిలిచింది. సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్‌తో వస్తుండడం వల్ల ఎలాంటి శబ్దం లేకుండా క్లియర్‌గా కాల్స్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌ట్రాక్ రివోల్ట్ FS1 వాచ్‌లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లు..
- 24x7 హార్ట్ రేట్ మానిటరింగ్
- SpO2 మానిటర్
- స్లీప్ ట్రాకర్
- స్ట్రేస్ మానిటరింగ్
- స్టెప్ కౌంట్
- డిస్టాన్స్ కౌంట్
- కేలరీస్ బర్న్
ఈ స్మార్ట్‌వాచ్ సుమారు 100కు పైగా స్పోర్ట్ మోడ్స్‌ను కలిగి ఉంది. దీనిలో ఉన్న 2.5x నైట్రోఫాస్ట్ ఛార్జింగ్ వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. వీటితో పాటు ఏఐ వాయిస్ అసిస్టెంట్ సౌకర్యాన్ని కల్పించారు. గూగుల్ అసిస్టెంట్‌తో పాటు సిరి కూడా ఇందులో పనిచేస్తుంది. స్మార్ట్ నోటిఫికేషన్స్‌తో పాటు వాతావరణ అప్డేట్స్, అలారం క్లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫాస్ట్‌ట్రాక్ రివోల్ట్ FS1 ధర రూ. 1,695గా నిర్ణయించారు. ఈ వాచ్ మార్చి 22 నుంచి ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, టీల్ రంగుల్లో ఈ వాచ్ రిలీజ్ కానుంది.
అమేజ్‌ఫిట్ GTR మినీ
అమేజ్‌ఫిట్ తన GTR స్మార్ట్‌వాచ్ సిరీస్‌ను కొనసాగిస్తూ GTR మినీని తీసుకురాబోతుంది. బడ్జెట్ ధరలో జీపీఎస్ సపోర్ట్‌తో 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. GTR మినీ లైట్ వెయిట్ డిజైన్, స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో రూపొందించారు. 1.28 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో కర్వ్డ్ గ్లాస్, హెచ్డీ రెజల్యూషన్‌తో వస్తుంది. ఇందులో 80 వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. యాపిల్ వాచ్‌లో లాగా మూడు ఫొటోలను వాచ్ ఫేసెస్గా పెట్టుకోవచ్చు. ఫైవ్ శాటిలైట్ పొజిషనింగ్ వ్యవస్థతో జీపీఎస్ సౌకర్యాన్ని కల్పించారు. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్ కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌వాచ్‌లో రన్నింగ్, ఔట్‌డోర్ సైక్లింగ్, వాకింగ్ లాంటి 120 స్పోర్ట్ మోడ్స్ యాక్టివిటీస్ ఉంటాయి. మీరు చేసిన వర్కౌట్ల వివరాలను ఇతరులతోనూ షేర్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌తో స్ట్రావా, రిలీవ్, గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్‌లను వినియోగించవచ్చు. ఇది జెప్ ఓఎస్ 2.0తో నడుస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 14 రోజుల పాటు, బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తే సుమారు 20 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది 5 ATM వాటర్ రెసిస్టేన్స్ను కలిగి ఉంది.
వీటితో పాటు చెస్, చెకర్స్ గో లాంటి ఇన్‌బిల్ట్ గేమ్స్‌ను అందిస్తుంది. ఇందులో మ్యూజిక్, కమెరా కంట్రోల్స్, DND మోడ్, స్క్రీన్‌లాక్, వాతావరణ అప్డేట్ ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుండగా.. దీనిలో కాలింగ్ ఆప్షన్ సపోర్ట్ చేయదు. ఈ వాచ్ ధరను రూ. 10,999గా నిర్ణయించారు. ఇది మిడ్నైట్ బ్లాక్, మిస్టీ పింక్, ఓషియన్ బ్లూ రంగులతో అమెజాన్ ఇండియాలో అందుబాటులోకి రానుంది.
ఇవీ చదవండి : 'పల్సర్ NS160'కి కిరాక్ అప్డేట్.. లేటెస్ట్ మోడల్ ఫీచర్స్ ఇవే..