ETV Bharat / science-and-technology

Aditya L1 Mission Update : ఆదిత్య-ఎల్​1 డేటా సేకరణ స్టార్ట్​.. ఏం రహస్యాలు తెలుస్తాయంటే.. - ఆదిత్య ఎల్​1 వల్ల జరిగే ప్రయోజనం

Aditya L1 Mission Update : సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో పంపిన ఆదిత్య ఎల్‌-1.. శాస్త్రీయ డేటాను సేకరించడం మొదలు పెట్టింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. సోమవారం అర్థరాత్రి ఆదిత్య ఎల్‌-1 భూప్రదక్షిణ దశ ముగించుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించనుంది.

Aditya L1 Mission Update
Aditya L1 Mission Update
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 3:20 PM IST

Aditya L1 Mission Update : సూర్యుడిపై పరిశోధనలకు పంపించిన ఆదిత్య ఎల్‌-1 శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌ను ఇది కొలుస్తుంది. ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్‌1లోని సూప్ర థర్మల్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పార్టికల్‌ స్పెక్ట్రోమీటర్‌-స్టెప్స్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. స్టెప్స్‌లో మొత్తం ఆరు సెన్సార్లు ఉన్నాయి.

  • Aditya-L1 Mission:
    Aditya-L1 has commenced collecting scientific data.

    The sensors of the STEPS instrument have begun measuring supra-thermal and energetic ions and electrons at distances greater than 50,000 km from Earth.

    This data helps scientists analyze the behaviour of… pic.twitter.com/kkLXFoy3Ri

    — ISRO (@isro) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Aditya L1 Mission Status : ఆదిత్య ఎల్‌1 సోమవారం అర్థరాత్రి కీలక దశకు చేరుకుంటుంది. భూప్రదక్షిణ దశను ముగించుకుని 19వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఇది సన్‌-ఎర్త్‌ లగ్రాంజ్‌ 1కు చేరుకుంటుంది. ఈ పాయింట్‌ భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్‌లో సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్‌ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్‌1 తొలి లగ్రాంజ్‌ పాయింట్‌కు వెళుతోంది.

ఈ కేంద్రం భూమితో పాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. కాబట్టి సౌర పరిశీలనకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికి వీలుంటుంది. ఆదిత్య ఎల్‌1 ఈ కేంద్రం నుంచే సూర్యుడిపై అధ్యయనాలు చేస్తుంది. భూమి మీద ఉన్నట్లుగా అక్కడ వాతావరణం, గాలి ప్రవాహాల వంటి ప్రభావాలేవీ ఉండవు. మరింత స్పష్టంగా, నిశితంగా సూర్యుడిని వీక్షించటం సాధ్యమవుతుంది.
Aditya L1 Mission Launch Date : ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని.. PSLV-C57 వాహకనౌక సెప్టెంబర్​ 2న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మరుసటి రోజే మొదటి కక్ష్య పెంపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా చేపట్టింది.

  • Aditya-L1 Mission:
    The satellite is healthy and operating nominally.

    The first Earth-bound maneuvre (EBN#1) is performed successfully from ISTRAC, Bengaluru. The new orbit attained is 245km x 22459 km.

    The next maneuvre (EBN#2) is scheduled for September 5, 2023, around 03:00… pic.twitter.com/sYxFzJF5Oq

    — ISRO (@isro) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Aditya L1 Takes Selfie : సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్‌-1.. భూమి, చంద్రుడి ఫోటోలు కూడా..

Aditya L1 Maneuver Mission : ఇస్రో మరో కీలక విన్యాసం.. ఆదిత్య ఎల్​1 రెండో భూ కక్ష్య పెంపు సక్సెస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.