ETV Bharat / priya

వెల్లుల్లి వంకాయ పులుసు చేసుకోండిలా! - వెల్లుల్లి వంకాయ పులుసు

వెల్లుల్లి.. వీటిని కూరల్లోకి వేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ వంటకాల్లోకి దీన్ని కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మేలు. ఈ పదార్థంతో చేసిన మసాలా ముద్దను.. గుత్తివంకాయ పులుసుకు జోడిస్తే ఆ రుచే వేరబ్బా. దీనినే వెల్లుల్లి వంకాయ పులుసు అంటారు. దీన్ని ఎలా తయారుచేయాలంటే..

brinjal
వంకాయ
author img

By

Published : Aug 10, 2021, 12:33 PM IST

గుత్తివంకాయ.. ఈ పేరు వినగానే మాసాలా కర్రీ, పులుసు ఇలా రకరకాల వంటలు గుర్తొస్తాయి. చాలా మంది బాగా ఇష్టంగా తింటుంటారు. మరి వెల్లుల్లి వంకాయ పులుసు గురించి తెలుసా? ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి దీని సొంతం. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే..

ముందుగా రోలులో వెల్లుల్లి వేసి దంచుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడెక్కాక దంచుకున్న వెల్లులి, ధనియాలు, శెనగపప్పు, ఎండుమిర్చి, పుట్నాలు, జీలకర్ర, కల్లుప్పు వేసి వేయించాలి. ఇందులో వేయించిన ఉల్లిపాయలను కలిపి ముద్ద చేసుకోవాలి. అప్పుడీ వెల్లుల్లి మసాలా ముద్దను గుత్తివంకాయలో పెట్టి వేడినూనెలో వేయించుకోవాలి.

మరోవైపు పెద్ద బౌల్​లో నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పుసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. అందులో టమాటా గుజ్జు, చింతపండు పులుసులో వెల్లుల్లి మసాలాను కలిపి వేయాలి. ఇందులో కొంచెం నీళ్లు కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత వేయించుకున్న వంకాలయలను వేసి పదినిమిషాల పాటు మళ్లీ ఉడికించాలి. అనంతరం కొత్తిమీర చల్లు కుంటే వెల్లుల్లి వంకాయ పులుసు తయారైపోయినట్లే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శ్రావణం స్పెషల్: ఈ వెరైటీలు ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.