ETV Bharat / priya

'కశ్మీరీ మటన్ బిర్యానీ' చేసుకోవడం ఎంతో ఈజీ!

బిర్యానీ అంటే నోరూరనివారు ఉంటారా? ఇక మాంసాహారులైతే ముక్క బిర్యానీని మనసారా ఆరగిస్తారు. కానీ, ఇంట్లో చేసుకోవాలంటేనే పెద్ద తతంగంగా ఫీల్ అవుతారు. అలాంటి వారు ఓ సారి ఈ 'కశ్మీరీ మటన్ బిర్యానీ' చేసి చూడండిలా..

try-biryani-in-a-easy-way-with-kashmiri-mutton-biryani
'కశ్మీరీ మటన్ బిర్యానీ' చేసుకోవడం ఎంతో ఈజీ!
author img

By

Published : Aug 29, 2020, 1:00 PM IST

హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా.. కశ్మీరీ మటన్ బిర్యానీ మాత్రం సులభంగా చేసుకునే బిర్యానీల్లో ప్రసిద్ధి గాంచింది. మరి, మటన్ బిర్యానీ సింపుల్ రెసిపీ చూసేద్దామా?

కావాల్సినవి..

మటన్‌: ముప్పావు కిలో, బాస్మతీ బియ్యం: కిలో, పెరుగు: 2 టీస్పూన్లు, సొంటి పొడి: టీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: కప్పు, కెవ్రా ఎసెన్స్‌: పావుటీస్పూను, కుంకుమ పువ్వు: 2 గ్రా., కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, గరం మసాలా: 2 టీస్పూన్లు, సోంపుపొడి: 2 టీస్పూన్లు, పంచదార: పావుటీస్పూను, పలావు ఆకులు: రెండు, ఉప్పు: రుచికి సరిపడా

try-biryani-in-a-easy-way-with-kashmiri-mutton-biryani
'కశ్మీరీ మటన్ బిర్యానీ' చేసుకోవడం ఎంతో ఈజీ!

తయారుచేసే విధానం

  • బాణలిలో నెయ్యి వేసి కాగాక ఇంగువ, మటన్‌ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. అందులోనే పెరుగు కూడా వేసి కలిపి రంగుమారే వరకూ వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, సొంటి పొడి, పలావు ఆకు వేసి కాసేపు వేయించాలి. తరవాత అరలీటరు నీళ్లు పోయాలి. అరటీస్పూను గరంమసాలా, టీస్పూను సోంపు పొడి వేసి సిమ్‌లో ఉడికించి దించాలి. మటన్‌ ముక్కల్ని విడిగా ఓ గిన్నెలో వేసి ఉంచాలి. అదే బాణలిలో రెండు లీటర్ల నీళ్లు పోసి ఉప్పు వేయాలి.
  • ఇప్పుడు గరంమసాలా మిగిలిన సోంపు పొడి అన్నీ పలుచని బట్టలో మూట కట్టి నీళ్లలో వేయాలి. తరవాత బియ్యం వేసి సిమ్‌లో సగం ఉడికేవరకూ ఉంచి దించాలి. తరవాత అందులోనుంచి నీళ్లు వంపేసి మటన్‌ ముక్కలూ అన్నమూ పొరలు పొరలుగా మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి సిమ్‌లో దమ్‌ చేయాలి.

ఇదీ చదవండి: టేస్టీ 'మునక్కాయ మాంసం' ట్రై చేద్దామా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.