కరోనా వేళ.. ఇంటి రుచుల కంటే సురక్షితమైనది మరొకటి లేదు. అందుకే పిల్లలకు ఇంట్లోనే టేస్టీ, హెల్దీ బనానా కుకీస్ చేసి పెట్టండి..
కావాల్సిన పదార్థాలు
బాగా పండిన అరటి పండ్లు - 2
ఓట్స్ - 50 గ్రాములు
కొకోవా పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
తురిమిన చాక్లెట్ - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఒవెన్‌ను 180 డిగ్రీల వద్ద ప్రి-హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బాగా పండిన అరటి పండ్లను వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో ఓట్‌మీల్‌ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొకోవా పౌడర్, తురిమిన చాక్లెట్ వేసి అన్నీ కలిసేలా మరోసారి కలుపుకోవాలి. కావాలంటే రుచి కోసం ఇందులో నట్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్లు ఇందులో తేనె లేదా మేపుల్ సిరప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని దానిపై నూనె రాయాలి. ఇందాక కలుపుకొన్న బనానా-ఓట్స్ మిశ్రమాన్ని కుకీస్ ఆకారంలో తయారు చేసి వరుస క్రమంలో బేకింగ్ ట్రేలో పేర్చుకోవాలి. దీన్ని 10 - 12 నిమిషాల పాటు ఒవెన్‌లో బేక్ చేసుకోవాలి. అంతే.. రుచికరమైన బనానా చాక్లెట్ కుకీస్ రెడీ..!
ఇదీ చదవండి :'దేశీ పిజ్జా'తో ఇంట్లోనే మజా చేసుకోండి!