ETV Bharat / priya

నవమి నైవేద్యంతో మేలైన ఆరోగ్యం! - bellam panakam and vadapappu uses

'శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం.. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం.. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం.. రామం.. నిశాచర వినాశకరం నమామి..' కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పదార్థాల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ క్రమంలో వీటి తయారీ విధానం, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

sri rama navami naivedyam
నవమి నైవేద్యం
author img

By

Published : Apr 21, 2021, 4:11 PM IST

శ్రీ రామనవమి పర్వదినాన మరి ఆ సీతారామచంద్రునికి నైవేద్యంగా పెట్టేందుకు ఆ ప్రసాదాల తయారీ విధానం, వాటి ప్రయోజనాలు చూసేద్దాం..

sri rama navami naivedyam
శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు

బెల్లం పానకం..
కావాల్సిన పదార్థాలు
* బెల్లం - ఒక కప్పు
* నీళ్లు - నాలుగు కప్పులు
* మిరియాల పొడి - చెంచా
* యాలకుల పొడి - అర చెంచా
* అల్లం పొడి - పావు చెంచా
తయారీ విధానం
ముందుగా నీటిలో బెల్లాన్ని వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం పొడి.. మొదలైన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తియ్యతియ్యటి బెల్లం పానకం రడీ..

navamihealthrg650-2.jpg
శ్రీరాముడికి ఇష్టమైన బెల్లం పానకం

ఆరోగ్యానికి మేలు!
మీకు తెలుసా..! నైవేద్యానికి నవగాయ పిండివంటలు లేకపోయినా, అవి వండడానికి ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లో చిన్న బెల్లం ముక్క ఉంటే చాలంటారు పెద్దలు. బెల్లంతో చేసిన వంటకాలతో దేవతలు సైతం తృప్తి చెందుతారట. అంతటి విశిష్ట స్థానం ఉంది మరి దీనికి. అందుకే దాదాపు ప్రతి పండక్కీ తయారు చేసే నైవేద్యంలో బెల్లాన్ని ఉపయోగిస్తాం. దీనివల్ల కేవలం నోటికి రుచే కాకుండా.. అనేక రకాల పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

  • బెల్లం వివిధ రకాల పోషకాలకు నిలయం. ఇందులో అనేక ఖనిజాలు దాగి ఉన్నాయి.. ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, శరీర ఎదుగుదలకు కావలసిన ఇతర ఖనిజాలు కూడా బెల్లం నుంచే మనకు లభిస్తాయి.
  • శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి.. వెంటనే అలసట మటుమాయమైపోతుంది.
  • బెల్లంలో ఇనుము శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.
  • ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ వల్ల కణజాల వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడతాయి.
navamihealthrg650-1.jpg
రక్త హీనత బారిన పడకుండా కాపాడుతుంది
  • బెల్లం సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేసి శ్వాసకోస గ్రంథులు, వూపిరితిత్తులు, పొట్ట.. వంటి శరీర భాగాలను శుభ్రపరుస్తుంది.
  • కొంతమంది అమ్మాయిలు నెలసరి సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు కొన్ని కాకరకాయ ఆకులు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న బెల్లం ముక్క.. ఈ మూడింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ఒక వారం రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • పొడిదగ్గు, జలుబు, ఆస్తమా.. లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు.
  • బెల్లం శరీరంలోని అనేక రకాల ఎంజైమ్‌లను ఎసిటిక్ ఆమ్లంగా మార్చి, తద్వారా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
  • బెల్లంలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు, నాడీవ్యవస్థ పటిష్టమవుతాయి.
  • మైగ్రెయిన్ తలనొప్పి బాధిస్తుంటే బెల్లం, నెయ్యి.. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • తరచుగా పొడిదగ్గు బాధిస్తున్నట్లయితే ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • శరీరంలో ఎక్కడైనా బాగా నొప్పిగా అనిపించినట్లయితే.. నెయ్యిలో వేసిన బెల్లం ముక్కను నొప్పి ఉన్న చోట ఉంచితే సరిపోతుంది.
  • కడుపులో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలను అధిగమించడానికి ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలు. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడడంలో బెల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • కీళ్లనొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందడంలోనూ బెల్లం చక్కగా పనిచేస్తుంది. అందుకోసం.. రోజూ అల్లం, బెల్లం.. రెండూ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అల్లాన్ని ఎండబెట్టాక పొడి చేసి, దాంట్లో కాస్త బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి.
  • మిరియాలు జీర్ణవ్యవస్థను పటిష్ట పరచడంతో పాటు శరీరంలో కొవ్వు కణజాలాల్ని విచ్ఛిన్నం చేసి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగజేస్తాయి.
  • యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇవి శరీరంలోని విషతుల్యాలను తొలగించి, శ్వాసవ్యవస్థను పటిష్టపరుస్తాయి.
navamihealthrg650-3.jpg
పరిపూర్ణ ఆరోగ్యానికి వడపప్పు

వడపప్పు
కావాల్సిన పదార్థాలు
* పెసరపప్పు - ఒక కప్పు
* తురిమిన కొబ్బరి - మూడు చెంచాలు
* చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చిమిర్చి - కొన్ని
* నిమ్మరసం - చెంచా
* ఉప్పు - రుచికి తగినంత
* కొత్తిమీర - అలంకరణ కోసం
తయారీ విధానం
ముందుగా పెసరపప్పును అరగంట పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులో పైన చెప్పిన ఇతర పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. వడపప్పు రడీ!
ప్రయోజనాలు
* పెసరపప్పులో శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమయ్యే విటమిన్ ఎ, బి, సి, ఇ; క్యాల్షియం, పొటాషియం, ఐరన్.. వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
* బరువు తగ్గాలనుకునే వారికి పెసరపప్పు మంచి ఆహారం. ఇందుకు కారణం దీనిలో తక్కువ మోతాదులో ఉండే కొవ్వు పదార్థాలే. అలాగే పెసరపప్పులో అధికంగా ఉండే ప్రొటీన్, ఫైబర్.. వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించేందుకు సహకరిస్తాయి.
* ఈ పప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరిస్తాయి.
* జీర్ణవ్యవస్థను పటిష్ట పరచడానికి, మధుమేహం రాకుండా నివారించడానికి పెసరపప్పు బాగా తోడ్పడుతుంది.

అలాగే బియ్యప్పిండి, బెల్లం నీటిలో కలిపి చలిమిడిని తయారు చేస్తారు. ఇవన్నీ వేడిని తగ్గించేవే.. అందుకే వేసవితాపానికి గురికాకుండా ఉండేందుకు వీటిని సేవిస్తారు.
చూశారుగా.. బెల్లం పానకం, వడపప్పుల వల్ల ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.. మీరూ ఈ శ్రీరామనవమికి వీటిని నైవేద్యాలుగా అర్పించి, ప్రసాదాన్ని స్వీకరించండి. సీతారాముల శుభాశీస్సులతో పాటు మంచి ఆరోగ్యమూ మీ సొంతం చేసుకోండి..

ఇదీ చదవండి: వేములవాడలో నిరాడంబరంగా జగదానంద కారకుడి కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.