ఆకు కూరల్లో గోంగూర రుచే ప్రత్యేకం. మరి దానికి మటన్ కలిపితే.. ఇక ఆహా! అంటూ మైమరిచిపోవాల్సిందే.
కావలసిన పదార్థాలు
మటన్ ముక్కలు: అర కిలో, ఉల్లిపాయలు: పావు కిలో, అల్లంవెల్లుల్లి: 2 టేబుల్ స్పూన్లు, కారం: టేబుల్ స్పూను, పసుపు: టీ స్పూను, కొత్తిమీర: కట్ట, పుల్లగోంగూరకట్టలు: పది(సన్నవి), సోయకూర: 2 కట్టలు(సన్నవి), పచ్చిమిర్చి: ఆరు, నూనె: 50గ్రా., ఉప్పు: తగినంత.
తయారుచేసే విధానం:
కడిగిన మటన్ ముక్కల్ని కుక్కర్‌లో వేయాలి. ఉల్లిముక్కలు, నూనె, పచ్చిమిర్చిముక్కలు, కారం, అల్లంవెల్లుల్లి, ఉప్పు వేసి కలిపి, సుమారు పావులీటరు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ రానివ్వాలి. తరువాత బాణలిలో వేసి, సోయకూర వేసి నీళ్లన్నీ ఆవిరైపోయేవరకు వేయించాలి. మరో బాణలిలో గోంగూర ఆకులు వేసి ఉడికించి మెత్తని ముద్దలా చేసి, ఈ ముద్దను వేయిస్తోన్న మటన్‌లో వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించాక కొత్తిమీర తురుముతో అలంకరించాలి.
ఇదీ చూడండి:మైమరపించే మటన్ ఛట్పటి బిర్యానీ