'పెసర చెగోడీలు' అంటే నోరూరని వారుంటారా? కానీ, అవి మెత్తగా సాగుతూ ఉంటే రుచించదు. మరి కరకరలాడే 'పెసర చెగోడీలు' చేసుకోవడం ఎలాగో రెసిపీ చూసేయండి...
కావాల్సినవి
పెసరపిండి - కప్పు,
వరిపిండి - రెండుటేబుల్‌స్పూన్లు,
జీలకర్ర - చెంచా,
కారం - చెంచా,
ఉప్పు - సరిపడా,
నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ
మొదట పెసరపిండి, వరిపిండి, కారం, జీలకర్ర, ఉప్పు అన్నింటినీ కలగలిపి గట్టి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకొని సన్నగా, పొడుగ్గా కాడల్లా చేసుకుని గుండ్రంగా అంచులు జతచేసుకోవాలి. తరవాత వాటిని కాగుతున్న నూనెలో వేయిస్తే సరిపోతుంది. కరకరలాడే చెగోడీలు సిద్ధం.
ఇదీ చదవండి: కమ్మగా 'బ్రెడ్‌దోశ'.. చిటికెలో తయారవ్వగా!