ETV Bharat / priya

బిర్యానీలందు పనసపొట్టు బిర్యానీ వేరయా!

author img

By

Published : Aug 17, 2021, 11:45 AM IST

బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నా.. దేనికి అవే సాటి. అయితే వెజ్​ బిర్యానీలూ రుచిలో నాన్​వెజ్​కు ఏ మాత్రం తక్కువ కాదు. పనసపొట్టుతో తయారు చేసిన బిర్యానీ.. సువాసనతో పాటు రుచికరమైన అనుభూతిని ఇస్తుంది. దాని తయారీ విధానం ఎలా అంటే?

Panasa Pottu Biryani (Jackfruit Biryani) Recipe
బిర్యానీలందు పనసపొట్టు బిర్యానీ వేరయా!

ఏ కుటుంబంలోనైనా చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినేది బిర్యానీ. అయితే బిర్యానీ అనగానే నాన్​వెజ్​ బాగుంటుందని అనుకుంటారు. కానీ అది భ్రమ. వెజ్​లో కూడా నాన్​వెజ్​లా టేస్టీగా చేసుకోవచ్చు. అందులో పనసపొట్టు బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాన్ని తింటే మాత్రం 'వహ్వా' అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంటకం తయారీ విధానాన్ని చూసేయండి.

Panasa Pottu Biryani (Jackfruit Biryani) Recipe
పనసపొట్టు బిర్యానీ

కావాల్సినవి పదార్థాలు:

పనసముక్కలు - అరకేజీ;

పెరుగు - 150 గ్రా.;

అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు;

కారం- టేబుల్‌స్పూన్‌;

పసుపు- పావు టీస్పూన్‌;

గరంమసాలా పొడి- రెండు టీస్పూన్లు;

నిమ్మకాయ- ఒకటి;

ఉప్పు- రుచికి సరిపడా;

బిర్యానీ కోసం: బాస్మతీ బియ్యం- అరకేజీ;

పొడవుగా కోసిన ఉల్లిపాయలు- మూడు;

దాల్చినచెక్క- చిన్నముక్క;

యాలకులు- నాలుగు;

సాజీర- అర టీస్పూన్‌;

లవంగాలు- పది;

నల్ల యాలకులు- మూడు;

బిర్యానీ ఆకు- ఒకటి;

కొత్తమీర, పుదీనా తరుగు- కొద్దిగా;

చీల్చిన పచ్చిమిర్చి- నాలుగు;

వేయించిన జీడిపప్పు- గుప్పెడు.

తయారీ చేసుకునే విధానం:

చేతులకు నూనె రాసుకుని పనసకాయ చెక్కు తీసి అంగుళం సైజు ముక్కల్లా కోసుకోవాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో పావుకప్పు నీళ్లు పోసి రెండు, మూడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. వీటిని గిన్నెలో వేసి అల్లంవెల్లుల్లి పేస్టు, పెరుగు, గరంమసాలాపొడి, కారం, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి పావుగంట పాటు నానబెట్టాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలను గోధుమ రంగులోకి వచ్చేంతవరకు వేయించాలి. పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి నానబెట్టిన బియ్యం, మసాలాలు, ఉప్పు వేసి ఉడికించాలి. ముప్పావు వంతు ఉడికిన తర్వాత అన్నాన్ని వార్చాలి.

వెడల్పాటి పాత్రలో నెయ్యి రాసి వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేయాలి. తర్వాత నానబెట్టి పనసముక్కలు, అన్నం పరచాలి. నెయ్యి, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి అల్యూమినియం ఫాయిల్‌తో పైభాగాన్ని మూసేయాలి. దీన్ని స్టవ్‌ మీద పెట్టి ఇరవై నిమిషాలు దమ్‌ చేయాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి మరో పది నిమిషాలపాటు ఉంచాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కొత్తమీర తరుగు చల్లాలి.

ఇదీ చూడండి.. క్రిస్పీ క్రిస్పీ ఎగ్ పకోడి.. భలే టేస్ట్​ గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.