నాన్‌వెజ్ ఐటమ్స్‌లో చికెన్‌తో ఎన్నో రకాల వంటకాలు చేస్కోవచ్చు. వాటలో ఒకటి చికెన్ టిక్కా మసాల. ఫ్రై లేదా గ్రేవీ.. ఎలాగైనా తయారు చేస్కోవచ్చు. చెప్తుంటేనే నోరూరేస్తుంది కదూ.? అయితే.. లేటెందుకు మీ ఇంట్లోనే తయారు చేస్కోండిలా..
కావలసినవి:
- బోన్‌లెస్ చికెన్: అర కిలో
- పెరుగు: అర కప్పు
- నిమ్మరసం: టీస్పూను
- పసుపు: అర టీస్పూను
- కారం: అర టీస్పూను
- మిరియాలపొడి: అర టీస్పూను
- గరంమసాలా: అర టీస్పూను
- ఉప్పు: చిటికెడు
- గ్రేవీ కోసం:
- నూనె: టేబుల్ స్పూను
- వెన్న: టేబుల్ స్పూన్లు
- యాలకులు: మూడు
- లవంగాలు: రెండు
- దాల్చిన చెక్క: అంగుళం ముక్క
- ఉల్లిపాయ: ఒకటి
- ఉప్పు: తగినంత
- అల్లం వెల్లుల్లి: 2 టేబుల్ స్పూన్లు
- దనియాల పొడి: 2 టీస్పూన్లు
- జీలకర్ర: టీ స్పూను
- కారం: అర టీస్పూను
- టొమాటోలు: నాలుగు
- టొమాటోగుజ్జు: 2 టేబుల్ స్పూన్లు
- మంచినీళ్లు: కప్పు
- పంచదార: టేబుల్ స్పూను
- గరంమసాలా: అర టీస్పూను
- క్రీమ్: కప్పు
- కొత్తిమీర: కొద్దిగా
తయారుచేసే విధానం:
- పెరుగులో నిమ్మరసం, పసుపు, కారం, మిరియాలపొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలిపి చికెన్ ముక్కలకు పట్టించి ఉంచాలి.
- విడిగా బాణలిలో నూనె, వెన్న వేసి కాగాక కాస్త కచ్చాపచ్చాగా దంచిన యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేగాక.. అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు దనియాల పొడి, జీలకర్ర, కారం, టొమాటో ముక్కలు, టొమాటో గుజ్జు వేసి నూనె తేలేవరకూ ఉడికించాలి.
- తరవాత చికెన్ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి సుమారు ఇరవై నిమిషాలపాటు ముక్క మెత్తగా ఉడికేవరకూ ఉంచాలి. చివరగా క్రీమ్ వేసి దించి కొత్తిమీరతో అలంకరించాలి.
ఇదీ చదవండి: ఆహా! అనిపించే 'తోటకూర చికెన్'