ETV Bharat / priya

టేస్టీ 'స్టఫ్డ్​ ఎగ్..' నూనె లేకుండా సింపుల్​గా​ చేసుకోండిలా!​ - egg recipes in telugu

గుడ్డుతో ఏం చేసినా అదిరిపోతుంది.. ప్రోటీన్లు పుష్కలంగా నిండిన కోడిగుడ్డుతో రకరకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. మరి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో స్పెషల్ డిష్​ జాబితాలో ఉండే.. స్టఫ్డ్​ ఎగ్​ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా? మరి, అతి తక్కువ పదార్థాలతో.. ఇంట్లోనే సులభంగా స్టఫ్డ్​ ఎగ్​ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి..

make-this-easy-and-healthy-snack-stuffed-egg-at-home
టేస్టీ 'స్టప్డ్​ ఎగ్..' నూనె లేకుండా సింపుల్​ చేసుకోండిలా!​
author img

By

Published : Jul 1, 2020, 1:00 PM IST

గుడ్డులో విటమిన్​-డి, జింక్​, సెలీనియమ్​, విటమిన్​-ఇ పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన ఎగ్స్​ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కానీ, రోజూ ఉడకబెట్టిన గుడ్డు తింటే బోరు కదా.. అలా అని గిన్నెడు నూనెలో వేసి వెరైటీలు చేస్తే.. పోషకాలన్నీ మాయమవుతాయి. మరి గుడ్డులో పోషకాలను మరింత పెంచే స్టఫ్డ్​ ఎగ్​ రెసిపీ ఇలా సింపుల్​గా చేసుకోండి...

make-this-easy-and-healthy-snack-stuffed-egg-at-home
టేస్టీ 'స్టప్డ్​ ఎగ్..' నూనె లేకుండా సింపుల్​ చేసుకోండిలా!​

కావాల్సినవి ఇవే..

  • ఉడికించిన గుడ్లు- 4
  • ఉడికించిన బంగాళదుంప తురుము-ఒక కప్పు
  • మయోనీజ్​-1 టేబుల్ స్పూన్​
  • ఉప్పు-రుచికి తగినంత
  • కొత్తిమీర తరుగు-2 టీ స్పూన్లు
  • మిరియాల పొడి-1 టీ స్పూన్​
  • ఊరగాయ కారం- 1 టీస్పూన్​

తయారీ ఇలా..

ఉడికించిన గుడ్లను నిలువుగా రెండు ముక్కలు చేసుకొని.. అందులోనే పచ్చసొనను తీసి పెట్టుకోవాలి. ఓ బౌల్​లో బంగాళదుంప తురుము వేసి అందులో ముందుగా తీసిపెట్టుకున్న పచ్చసొన వేసి మెదుపుకోవాలి. తర్వాత, మయోనీజ్​, ఉప్పు, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఊరగాయ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు.. ఈ మిశ్రమాన్ని గుడ్డు తెల్లసొనలోని ఖాలీ గుంటలో స్టఫ్​ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్టఫ్డ్​ ఎగ్స్ రెడీ. మరి మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్​తో పంచుకుంటారు కదూ...!

ఇదీ చదవండి:'గోరుచిక్కుడు'తో నయా రెసిపీ ట్రై చేయండిలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.