ETV Bharat / priya

రుచి రుచిగా.. తియ్య తియ్యగా.. స్వీట్​ సమోసా! - స్వీట్​ సమోసా

ఇప్పటివరకు(sweet samosa recipe) చాలా రకాల సమోసాలు రుచి చూసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా స్వీట్​ సమోసా టేస్ట్​ చేశారా? రుచిగా.. తియ్యగా భలే ఉంటుంది. తింటే వదలరంతే.. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే ఈ 'స్వీట్​ సమోసా' రెసిపీపై ఓ లుక్కేయండి.

sweet samosa
స్వీట్​ సమోసా
author img

By

Published : Oct 9, 2021, 8:12 AM IST

సమోసా(sweet samosa recipe).. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఎక్కువగా ఆలూ, ఉల్లి, నూడుల్స్​​, కార్న్​ ఇలాంటి వాటితో చేసే సమోసాలనూ(samosa recipe easy) తరచూ తింటూ ఉంటాం. ఈసారి కాస్త భిన్నంగా స్వీట్​ సమోసా రుచిచూద్దామాా! ఇంతకీ దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసినవి: మైదా: రెండు కప్పులు, బొంబాయిరవ్వ: చెంచా, నెయ్యి: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా. స్టఫింగ్‌కోసం: కోవా: కప్పు, చక్కెరపొడి: అరకప్పు, కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను, యాలకులపొడి: చెంచా, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు: అన్నీ కలిపి ముప్పావుకప్పు. పాకం కోసం: నీళ్లు: పావుకప్పు, చక్కెర: కప్పు

తయారీవిధానం: ముందుగా ఓ గిన్నెలో మైదా, బొంబాయిరవ్వ వేసుకుని బాగా కలపాలి. తరవాత నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా కలిపి ఓ చెంచా నెయ్యి వేసి మరోసారి కలిపి పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక బాదం, కిస్‌మిస్‌, జీడిపప్పు పలుకులు వేసి వేయించి తరువాత కోవా, చక్కెర, కొబ్బరిపొడి, యాలకులపొడి వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. మరో గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా అవుతున్నప్పుడు దింపేయాలి. నానిన పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తి మధ్యకు కోయాలి. అలా కోసిన చపాతీ ముక్క మధ్యలో ఒకటిన్నర చెంచా కోవా మిశ్రమాన్ని ఉంచి... సమోసా ఆకృతి వచ్చేలా అంచుల్ని మూసేయాలి. ఇలా అన్నీ చేసుకుని రెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని రెండు నిమిషాలయ్యాక చక్కెరపాకంలో ముంచి తీయాలి.

ఇదీ చూడండి: వర్షాకాలంలో సాయంత్రపు స్నాక్స్.. ట్రై చేయండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.