ETV Bharat / priya

యమ్మీ యమ్మీగా మ్యాంగో ఛీజ్​ కేక్ చేసుకోండిలా! - మ్యాంగో కేక్​

ఇప్పటివరకు ఎన్నో ఫ్లేవర్స్​తో చేసిన కేక్​లు తిని ఉంటాం. మరి మ్యాంగో ఛీజ్​ కేక్ ఎప్పుడైనా తిన్నారా?​ తినకపోయి ఉంటే ఇంట్లోనే తయారుచేసుకుని రుచి చూసేయండిలా!

mango
మ్యాంగో ఛీజ్​ కేక్​
author img

By

Published : Aug 11, 2021, 12:15 PM IST

పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలా వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది కేక్​. ఇలాంటి సమయాల్లో కేక్ కట్​ చేసి తింటూ సెలబ్రేషన్స్​ చేసుకోవడం మనకు అలవాటే. భిన్నమైన ఫ్లేవర్స్​లో దొరికే ఈ కేక్​ను ఏదో ఒక బేకరీ నుంచి కొనుగోలు చేయడమో.. అప్పుడప్పుడూ ఇంట్లో తయారుచేసుకోవడమో చేస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైనా మ్యాంగో ఛీజ్​ కేక్​ తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి. అందుకోసం దీని తయారీ విధానం మీకోసం.

కావాల్సినవి: 10 బిస్కెట్లు, వెన్న- 50 గ్రాములు , పన్నీర్-30 గ్రాములు, క్రీమ్​ ఛీజ్-30 గ్రాములు, హంగ్​ కర్డ్-30 గ్రాములు​, ఫ్రెష్​ క్రీమ్-30 గ్రాములు, కస్టర్డ్- 50 గ్రాములు​, మ్యాంగో గుజ్జు-50 గ్రాములు, జెలిటన్​- 5 గ్రాములు, కొన్ని మామిడి పండు ముక్కలు.

తయారీ విధానం

ముందుగా ఓ బౌల్​లో బిస్కెట్స్​ తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కరిగించిన వెన్న వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ గ్లాస్​​ బౌల్​లో​ వేసి ఫ్రిజ్​లో పెట్టుకోవాలి.

ఇంకో గిన్నెలో పన్నీర్​ను మెత్తగా​ చిదుముకోవాలి. అందులో క్రీమ్​ ఛీజ్​, హంగ్​ కర్డ్​, ఫ్రెష్​ క్రీమ్​ వేసి కలపాలి. ఆ తర్వాత కస్టర్డ్​, మ్యాంగో గుజ్జు, బేసిల్​(తులసి), మామిడి పండు ముక్కలు, కరగపెట్టిన జెలిటన్​ను వేసి మరోసారి బాగా కలపాలి. దీన్ని మ్యాంగో క్రీమ్​ అంటారు.

ముందుగా మనం కలిపిపెట్టుకున్న బిస్కెట్​ గుజ్జు మిశ్రమం పైన మ్యాంగ్​ క్రీమ్​ను వేసి దానిపైనా మామిడి ముక్కలను నచ్చిన విధంగా పరచాలి. ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఫ్రిజ్​లో ఉంచాలి. అంతే.. మీకు కావాల్సిన టేస్టీ మ్యాంగో ఛీజ్​ కేక్​ రెడీ. ​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: వెల్లుల్లి వంకాయ పులుసు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.