ఇడ్లీ మంచూరియా:
కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు- నాలుగు, సన్నగా తురిమిన క్యాబేజీ- కప్పు, ఉల్లిపాయ, ఉల్లికాడలు, క్యాప్సికమ్ ముక్కలు- అరకప్పు చొప్పున, మిరియాల పొడి- పావుటీస్పూన్, సన్నగా తురిమిన అల్లం, వెల్లుల్లి ముక్కలు- రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, చిల్లీసాస్, టొమాటో సాస్- టేబుల్‌స్పూన్, సోయాసాస్- టీస్పూన్, ఉప్పు- తగినంత.
తయారీ: ఇడ్లీలను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి వీటిని వేసి రెండు వైపులా ఎర్రగా వేయించి తీయాలి. ఇదే కడాయిలో వెల్లుల్లి, అల్లం ముక్కలు వేయాలి. తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యాబేజీ తురుము వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత సోయా, చిల్లీ, టొమాటో సాస్, మిరియాలపొడి, ఉప్పు వేయాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్‌లో కొన్ని నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని కడాయిలో వేయాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోయాలి. ఐదు నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. తర్వాత ఇడ్లీ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేయాలి. ఈ ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలపాలి.
ఇదీ చూడండి: కశ్మీరి చిల్లీ మటన్.. చూస్తేనే నోరూరెన్..!