ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే రుచి, కావల్సినన్ని ప్రోటీన్లుండే చికెన్ శాండ్‌విచ్.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు. కుదరకపోతే సాయంత్రం స్నాక్‌లాగా లాగించొచ్చు. మరి.. రుచికరమైన చికెన్ శాండ్‌విచ్ రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసేయండి..
![how-to-prepare-chicken-sandwich-at-home-full-recipe-in-telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7819936_556_7819936_1593431258859.png)
కావల్సినవి
బ్రెడ్ స్లైసులు - పన్నెండు, ఎముకల్లేని చికెన్ ముక్క - ఒకటి పెద్దది (దీన్ని ముక్కల్లా కోసుకోవాలి), ఉల్లిపాయ-ఒకటి, పచ్చిమిర్చి- రెండు, మయొనైజ్- మూడు చెంచాలు(బజార్లో దొరుకుతుంది), పుదీనా తరుగు- చెంచా, చీజ్ స్లైసులు- ఆరు, చిల్లీసాస్ - రెండు చెంచాలు, వెన్న - అరకప్పు, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాలపొడి - చెంచా.
తయారీ
ముందుగా చికెన్ ముక్కలపై మిరియాల పొడి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పువేసి ఉడికించి పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు పుదీనా తరుగు, మయొనైజ్, తగినంత ఉప్పు, చిల్లీసాస్ కలిపి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్‌స్లైసుల్ని పెనంపై ఉంచి.. వెన్నతో కాల్చి తీసుకోవాలి. ఒక స్లైసుపై చీజ్ స్లైసు, ఉల్లిపాయ ముక్క ఉంచాలి. మధ్యలో చికెన్ మిశ్రమాన్ని ఉంచి.. మరో స్లైసుతో మూసేయాలి. ఇలాగే మిగిలినవీ చేసుకుంటే చాలు.
ఇదీ చదవండి:'గోరుచిక్కుడు'తో నయా రెసిపీ ట్రై చేయండిలా