ETV Bharat / priya

నోరూరించే చికెన్​ ఆవకాయ తయారీ ఎలా?

చికెన్ ఆ​వకాయ… పేరు చెప్తేనే నోరూరుతుంది కదా. వేడి వేడి అన్నంలో చికెన్​ ఆవకాయ కలుపుకుని తింటే ఆ టేస్టే వేరప్పా. మరి ఆ చికెన్​ ఆవకాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..!

నోరూరించే చికెన్​ ఆవకాయ తయారీ ఎలా?
నోరూరించే చికెన్​ ఆవకాయ తయారీ ఎలా?
author img

By

Published : Feb 14, 2021, 11:35 AM IST

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌- కేజీ, పసుపు- అరచెంచా, ఉప్పు- తగినంత, జీడిపప్పులు- పది, బాదంపప్పులు- పది, లవంగాలు- ఐదు, యాలకులు- ఐదు, నిమ్మకాయలు- ఐదు(రసం తీసి పెట్టుకోవాలి), అల్లంవెల్లుల్లి పేస్ట్‌- మూడు చెంచాలు, కారం- ఏడు చెంచాలు

తయారీ: చికెన్‌ని శుభ్రం చేసి చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలకి పసుపు, ఉప్పు పట్టించి అరగంటపాటు పక్కనపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకుని చికెన్‌ ముక్కల్లోని నీరంతా పోయి ఎర్రని రంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. పాన్‌లో లవంగాలు, యాలకులు పొడిగా వేయించుకుని చల్లారిన తర్వాత వాటిల్లో బాదం, జీడిపప్పులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముందు చికెన్‌ వేయించిన కడాయిలోనే తగినంత నూనె వేసుకుని అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించుకోవాలి. దీనిలో ముందే మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుని ఇందులో మాంసం ముక్కలు, కారం, ఉప్పు వేసి పొయ్యి కట్టేయాలి. వేడి చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకొంటే చికెన్‌ పచ్చడి రెడీ.

ఇదీ చదవండి: ఇడ్లీ రూపు మారెన్​.. చూస్తేనే నీళ్లూరెన్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.