ETV Bharat / priya

అరటికాయ పెరుగు కూర.. ట్రై చేయండిలా! - పెరుగు అరటికాయ కూర

పెరుగుతో రైతా, చారు, మజ్జిగ పులుసు లాంటివి అప్పుడప్పుడూ చేసుకునేవే. అయితే అరటికాయతో కలిపి కూరలు కూడా చేయొచ్చని తెలుసా? ఓ సారి ఇలా ట్రై చేసి రుచిని చూసేయండి. ఎలా తయారుచేయాలంటే..

banana
అరటికాయ
author img

By

Published : Aug 18, 2021, 3:50 PM IST

పెరుగుతో చాలా రకాల వంటకాలు చూసుంటాం. అయితే అరటికాయ, పెరుగు కలిపి కర్రీ ఎప్పుడైనా చేశారా? ఓ సారి ఈ కర్రీని తిని ఓ కొత్త రుచిని ఆస్వాదించండి. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే..

కావలసినవి:

అరటికాయ: ఒకటి

పెరుగు: కప్పు

పచ్చిమిర్చి: రెండు

ఆవాలు: అరచెంచా

సెనగపప్పు: అరచెంచా

మినప్పప్పు: అరచెంచా

కరివేపాకు: రెండు రెబ్బలు

ఎండుమిర్చి: ఒకటి

ఉప్పు: తగినంత

నూనె: రెండు చెంచాలు

పసుపు: చిటికెడు

ఆవపిండి: అరచెంచా

తయారీ విధానం:

అరటికాయను కుక్కర్‌లో మూడుకూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఆ తరువాత చెక్కుతీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి, ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయించి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. ఈ తాలింపుతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ పెరుగులో వేసి బాగా కలిపితే చాలు. రుచికరమైన అరటికాయ పెరుగు కూర రెడీ.

ఇదీ చూడండి: శ్రావణం స్పెషల్: ఈ వెరైటీలు ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.