ETV Bharat / priya

పొరుగు రుచి: హుమ్మస్‌... అదుర్స్‌!

పెద్ద సెనగల పచ్చడి.. ఇదేం వెరైటీ ఎప్పుడూ వినలేదు అనుకుంటున్నారా? మన దగ్గర పల్లీ చట్నీలాంటిదే ఇది కూడా. హుమ్మస్ అని పిలుచుకుంటూ.. పాశ్చాత్యులు ఎంతో ఇష్టంగా తింటున్న ఈ వంటకం ఎలా చేయాలో తెలుసుకోండి..

hummus
హుమ్మస్‌
author img

By

Published : Jul 27, 2021, 11:30 AM IST

ఇడ్లీ, దోసె, వడల్లాంటి టిఫిన్లను మనం చట్నీలో నంజుకుని తింటుంటాం కదా.. అలాగే మధ్య ప్రాచ్య దేశాలకు చెందినవాళ్లు 'హుమ్మస్‌'ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. బ్రెడ్‌ను దీంట్లో ముంచుకుని తింటే భలే ఉంటుందంటారు. ఇంతకీ దీన్నెలా చేస్తారో మీరూ తెలుసుకోండి..

hummus
టేస్టీ హుమ్మస్
hummus
పెద్ద శనగలతో హుమ్మస్
hummus
రంగురంగుల హుమ్మస్

పెద్ద సెనగలను ఉడికించి, నీళ్లు వడకట్టి దాంట్లో నువ్వులు, వెల్లుల్లిరేకలు వేసి మెత్తగా మిక్సీ పడతారు. చివరగా కాస్త నిమ్మరసం పిండుతారు. అలాగే ఉడికించిన సెనగల్లో బీట్‌రూట్‌ కలిపితే గులాబీరంగు హుమ్మస్‌ సిద్ధమవుతుంది. దీంట్లో పాలకూరను కలిపితే పచ్చపచ్చగా, చూడముచ్చటగా ఉండి కనువిందు చేస్తుంది. రకరకాల రంగులు, రుచుల్లోని హుమ్మస్‌లు ఇప్పుడు అమెరికా సూపర్‌ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటున్నాయట. అయినా కమ్మగా, రుచిగా ఉండే సెనగల పచ్చడి పాశ్చాత్యుల మనసులనూ దోచేయడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.