How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్ అనేది హైదరాబాద్‌లో ఫేమస్ రెసిపీ. దీని గురించి తెలియని వారుండరు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. పెళ్లిళ్లు, స్పెషల్ పార్టీలు, ముఖ్యంగా రంజాన్ మాసంలో ఈ ఖీర్‌ను తయారు చేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. స్వీట్ షాపుల్లో కూడా ఇది లభిస్తుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ ఖీర్‌ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇక్కడ చూద్దాం..
'దూద్ పేడా'.. సులువుగా చేసుకోండిలా!
కద్దూ కీ ఖీర్కి కావాల్సిన పదార్థాలు:
- లేత సొరకాయ తురుము- 500 గ్రాములు
- పాలు(చిక్కటివి)-1 లీటరు
- సగ్గుబియ్యం- అరకప్పు(30 నిమిషాలు నానబెట్టుకోవాలి)
- పచ్చికోవా-100 గ్రాములు
- జీడిపప్పు-50 గ్రాములు(పేస్ట్ చేసుకోవాలి)
- పంచదార-250 గ్రాములు
- యాలకుల పొడి-1టీ స్పూన్
- బాదం-10, పిస్తా-10(నానబెట్టాలి)
- ఫుడ్ కలర్ (గ్రీన్) - చిటికెడు
కద్దూ కీ ఖీర్ తయారీ విధానం:
- ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి.. అందులో సొరకాయ తురుము వేసి మంట మీడియంలో పెట్టి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో అరకప్పు నీళ్లు పోసి.. అవి ఇంకిపోయి.. సొరకాయ మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
- అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని అందులో ఒక లీటరు చిక్కటి పాలను పోసి మరిగించుకోవాలి.
- పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత.. అరకప్పు వేడి పాలను ఓ గిన్నెలోకి తీసుకోని.. అందులో 100 గ్రాముల పచ్చికోవాను వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా కరిగించుకోవాలి.
- ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి.. మెత్తగా ఉడికించుకోవాలి. దీనికి కనీసం 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది.
- పాలను ప్రతి 30 సెక్లనకు ఒకసారి కలుపుతూ ఉండాలి.
- తర్వాత సగ్గుబియ్యం కాస్తా ఉడికింది అనుకున్న టైంలో.. కలిపిపెట్టుకున్న కోవా.. జీడిపప్పు పేస్ట్‌ను వేసుకోని కలుపుకోవాలి.
- రెండు నిమిషాల తర్వాత.. ఉడికించిన సొరకాయ తురుము వేసి బాగా మంటను సిమ్‌లో పెట్టి సుమారు 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- పాలు చిక్కపడిన తర్వాత.. పావు కిలో పంచదార పోసి, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి.
- పంచదార కరిగి చిక్కబడే వరకు అంటే సుమారు 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత యాలకుల పొడి వేసుకుని ఓ రెండు నిమిషాలు ఉడికించుకోని దింపేసుకోండి.
- ఆ తర్వాత ఓ బౌల్లోకి తీసుకుని ఖీర్ పైన నానబెట్టుకున్న బాదం, పిస్తా పలుకులు వేసుకోండి.
- దీనిని వేడి వేడిగా లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకోని తిన్న కూడా టేస్ట్ అదిరిపోద్ది.
- ఈ పాయసం ఫ్రిజ్‌లో వారం, పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఇంకెందుకు మరి మీరు కూడా దీనిని ట్రై చేయండి.
Chakkara Pongal recipe: నోరూరించే చక్కెర పొంగళి
రుచి రుచిగా.. తియ్య తియ్యగా.. స్వీట్ సమోసా!