ETV Bharat / priya

చల్లగా వాన పడుతుంటే.. హెల్తీ చిప్స్ చేసుకోండిలా! - etv bharat food

వాన కాలం.. సాయంత్రం పూట చల్లగా చిరుజల్లులు కురుస్తుంటే.. వేడి వేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. కానీ, ఎప్పుడూ పకోడీలు, సమోసాలే వండితే ఇంట్లోవారికి బోర్​ కొట్టి, బయటికెళ్లి చిప్స్ కొంటారు. కానీ, ఈ కరోనా కాలంలో బయటి చిప్స్​ తింటే ప్రమాదమే. పైగా ఎప్పుడూ బంగాళ దుంపల చిప్స్ తింటే బరువు పెరిగిపోతారు. అందుకే కాస్త ఆరోగ్యకరంగా, చిప్స్​ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి...

how-to-make-healthy-chips-recipes-of-apple-and-brinjal-in-telugu
చల్లగా వాన పతుంటే.. హెల్దీ చిప్స్ చేసుకోండిలా!
author img

By

Published : Jun 28, 2020, 1:01 PM IST

వర్షాకాలంలో పిల్లలు చిప్స్​ అంటే భలే ఇష్టపడతారు. కానీ, చిప్స్​ మాయలో పడి.. యాపిల్ వంటి ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తిననేతినరు. ఇక వంటల రాజు వంకాయ.. కూరలో కనిపిస్తే తీసి అవతల వేస్తారు. అందుకే, వారికే తెలియకుండా... యాపిల్​, వంకాయలలోని పోషకాలను అందిద్దామిలా...

యాపిల్‌ చిప్స్‌

how-to-make-healthy-chips-recipes-of-apple-and-brinjal-in-telugu
చల్లగా వాన పడుతుంటే.. హెల్దీ చిప్స్ చేసుకోండిలా!

కావల్సినవి:

  • యాపిల్స్‌ - రెండు
  • బ్రౌన్‌ షుగర్‌ - రెండు చెంచాలు
  • దాల్చిన చెక్క పొడి - అరచెంచా
  • వెన్న - రెండు చెంచాలు.

తయారీ:

యాపిల్స్‌ కడిగి, తుడిచి పల్చని స్లైసుల్లా కోయాలి. వీటికి మిగిలిన పదార్థాలన్నీ కలిపి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్‌ చేసుకోవాలి. లేదంటే.. వెన్న వేసుకుంటూ పెనంమీద కాల్చుకోవాలి. ఈ చిప్స్‌ని గిలక్కొట్టిన క్రీంతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

వంకాయ చిప్స్‌

  • పొడుగు వంకాయలు - మూడు
  • ఉప్పు - తగినంత
  • నూనె - చెంచా
  • మిరియాలపొడి - అరచెంచా
  • ఆరిగానో - చెంచా,

తయారీ:

వంకాయల్ని చక్రాల్లా కోసి కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. తరువాత ముక్కలకు ఉన్న తడి తుడిచి మిరియాలపొడి, ఆరిగానో, నూనె కలిపి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటసేపు బేక్‌ చేసుకుని తీసుకోవాలి. లేదంటే వంకాయ ముక్కల్ని ముందు వేయించుకుని ఆ తరవాత ఉప్పూ, మిరియాలపొడి, ఆరిగానో చల్లుకోవాలి. ఇలా చేసుకున్న చిప్స్‌ సాస్‌తో బాగుంటాయి.

ఇదీ చదవండి:తొక్కలోనూ పోషకాలు​.. ఇలా వండుకుంటే అదిరిపోద్ది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.