ETV Bharat / priya

ముద్దముద్దకీ రుచి మరింత 'పెరుగు'నోయ్‌! - పెరుగుతో దహీ ఆలూ తయారీ విధానం

ఆవకాయ.. ముద్దపప్పు.. గుత్తివంకాయ.. ఈ జాబితాలో తప్పక ఉంటుంది గడ్డపెరుగు. భోజనంలో చివరిగా వడ్డించినా.. పెరుగు ముద్ద గొంతు దిగాకే కడుపు నిండిన  అనుభూతి కలుగుతుంది. పెరుగును ఫినిషింగ్‌ టచ్‌గా వాడితే వంటకాల రుచి అమాంతంగా 'పెరుగు'తుంది.

curd taste
ముద్దముద్దకీ రుచి మరింత 'పెరుగు'నోయ్‌!
author img

By

Published : Jul 21, 2021, 12:31 PM IST

దహీపూరీలో మసాలా నషాలానికి ఎక్కకుండా చల్లటి దహీ ఓ కాపుకాస్తుంది. బూందీ కూరలో ఆఖర్న పెరుగేసి చూడండి.. బందీలైపోవాల్సిందే! ఇలా బోలెడన్ని వంటల్లో పెరుగు తోడుంటోంది. ఆత్మారాముడిని సంతృప్తి పరుస్తోంది. కావాలంటే ఈ వంటకాలు వండి వడ్డించుకొని చూడండి..

  • పెరుగు తినడం వల్ల చర్మం తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తుంది. యాక్నె సమస్యలుంటే తొలగిపోతాయి. రోజూ తినేవారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
  • సాధారణంగా స్త్రీలల్లో ఎదురయ్యే కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లని సమర్థంగా అడ్డుకుంటుంది.
  • ప్రొబయాటిక్‌ గుణాలున్న పెరుగుని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఉదర సమస్యలు రాకుండా ఉంటాయి.

బూందీకూర

curd taste
బూందీకూర

కావాల్సినవి: పెరుగు- ఒకటిన్నర కప్పు, సెనగపిండి- నాలుగు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద- చెంచా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, పసుపు- పావుచెంచా, ఉప్పు, కారం- తగినంత, నెయ్యి- రెండు చెంచాలు, లవంగాలు- నాలుగు, మిరియాలు- ఐదు, జీలకర్ర- చెంచా, మెంతులు- పావు చెంచా(రాత్రంతా నానబెట్టాలి), ఇంగువ- చిటికెడు, బూందీ- కప్పు

తయారీ: ఒక పాత్రలో పెరుగు, సెనగపిండి, కారం, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి లవంగాలు, జీలకర్ర, మిరియాల పొడి, నానబెట్టిన మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పెరుగు మిశ్రమం వేయాలి. దగ్గరకు వచ్చేంతవరకూ ఉండి బూందీ, కొత్తిమీర వేసి దించుకోవాలి.

దహీ చికెన్‌

curd taste
దహీ చికెన్

కావాల్సినవి: చికెన్‌- పావుకిలో, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, బటర్‌- చెంచా, పెరుగు- 125గ్రా, పచ్చిమిర్చి- మూడు, యాలకులపొడి- చిటికెడు, కొత్తిమీరకట్ట- అరకట్ట గరంమసాలా- అరచెంచా

తయారీ: చికెన్‌ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో చికెన్‌ తీసుకుని పచ్చిమిర్చి పేస్ట్‌, అల్లంవెల్లుల్లిపేస్ట్‌, ఇలాచీపొడి, ఉప్పు, పెరుగు వేసి రెండుగంటలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో బటర్‌ వేసి అది కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. పెరుగు వాడుతున్నాం కాబట్టి ప్రత్యేకించి నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్‌ వేసి పూర్తిగా ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే క్రీం కూడా వేసుకోవచ్చు. చివరిగా గరంమసాలా, కొత్తిమీర వేసుకుని దించుకోవడమే.

స్వీట్‌కార్న్‌తో..

curd taste
స్వీట్​కార్న్​తో

కావాల్సినవి: స్వీట్‌కార్న్‌- అరకప్పు, పెరుగు- అరకప్పు, నూనె- చెంచా, సెనగపిండి- చెంచా, జీలకర్ర- అరచెంచా, పసుపు- తగినంత, పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, కసూరీమేథి- చెంచా, అల్లం- చిన్నముక్క, వెల్లుల్లిపలుకులు- అరచెంచా, ఉప్పు- రుచికి తగినంత.

తయారీ: ముందుగా మిక్సీలో అల్లం, వెల్లుల్లిపలుకులు, ఉల్లిపాయముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకుని దానికి సెనగపిండి వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడి చేసుకుని అందులో జీలకర్ర వేసి వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్‌ వేసి నూనెపైకి తేలేంతవరకూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కసూరిమేథి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మగ్గనిచ్చి ఆపై పెరుగు మిశ్రమం, స్వీట్‌కార్న్‌ కూడా వేసి ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేంతవరకూ ఉండి.. కొత్తిమీర వేసి దించుకోవడమే.

దహీ ఆలూ

curd taste
దహీ ఆలూ

కావాల్సినవి: పెరుగు- కప్పు, సెనగపిండి- రెండున్నర చెంచాలు, నీళ్లు- కప్పున్నర, బంగాళాదుంపలు- 250గ్రా, నూనె- రెండు చెంచాలు, జీలకర్ర- అరచెంచా, ఉల్లిపాయ- ఒకటి, టమాటా- ఒకటి, పచ్చిమిర్చి- మూడు, వెల్లుల్లిరేకలు- నాలుగు, అల్లం- అంగుళం ముక్క, కరివేపాకు- రెండు రెమ్మలు, పసుపు- పావుచెంచా, కారం- చెంచా, ధనియాలపొడి- అరచెంచా, గరంమసాలా- అరచెంచా, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత

తయారీ: ముందుగా దుంపలని ఉడికించి, మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. లోతైన గిన్నెలో చిక్కగా, తీయగా ఉన్న తాజా పెరుగు తీసుకుని నీళ్లు కలపకుండా కవ్వంతో చిలికి పెట్టుకోవాలి. దీన్లో సెనగపిండి వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ చేసుకోవడానికి అవసరం అయిన ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నింటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసుకుని జీలకర్ర వేసి చిటపటలాడేంతవరకూ ఉండి.. ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆపై అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, చివరిగా టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత కారం, గరంమసాలా, పసుపు, ధనియాలపొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసి వేయించి మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం వేసి గరిటెతో కలపాలి. ఇలా చేస్తున్నప్పుడు మిశ్రమం మరీ చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు. చివరిగా తగినంత ఉప్పు, గరంమమసాలా వేసి కలుపుకొని కొత్తిమీర వేసుకుని దించుకోవాలి.

దహీపూరీ

curd taste
దహీ పూరీ

కావాల్సినవి: గోల్‌గప్పా పూరీలు(చిన్నపూరీలు)- 8, ఉడికించి చిన్నగా తరిగిన బంగాళాదుంపముక్కలు- అరకప్పు, ఉల్లిపాయముక్కలు- పావుకప్పు, స్వీట్‌చట్నీ- రెండున్నర చెంచాలు, గ్రీన్‌చట్నీ- రెండున్నర చెంచాలు, గార్లిక్‌ చట్నీ- చెంచా, పెరుగు- అరకప్పు, సన్నకారప్పూస(సేవ్‌)- పావుకప్పు, కొత్తిమీర- తగినంత.

తయారీ: ముందుగా స్వీట్‌చట్నీ, గ్రీన్‌చట్నీ, గార్లిక్‌ చట్నీలను సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో గోల్‌గప్పా పూరీని తీసుకుని అందులో చెంచా చొప్పున ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయముక్కలు వేసుకోవాలి. దీనిపై చెంచా స్వీట్‌చట్నీ ఆపై అరచెంచా గ్రీన్‌చట్నీ, పావుచెంచా గార్లిక్‌ చట్నీ వేసుకోవాలి. ఆపై చెంచా చొప్పున పెరుగు వేసి సేవ్‌, కొత్తిమీర వేసుకోవాలి.

స్వీట్‌చట్నీ: ఖర్జూరాలు లేదా తగినంత బెల్లం, అంతే సమానంగా చింతపండు గుజ్జు, కొద్దిగా కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్‌మసాలా పొడి వేసి ఉడికించుకుంటే స్వీట్‌ చట్నీ సిద్ధమవుతుంది.

గ్రీన్‌చట్నీ.. ఒక కప్పు పుదీనా ఆకులకి, సగం కప్పు కొత్తిమీర కలిపి దీనికి చిన్న అల్లంముక్క, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, చిటికెడు పంచదార కలిపి రుబ్బితే గ్రీన్‌చట్నీ సిద్ధం.

గార్లిక్‌ చట్నీ: ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకుని వాటిని నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన మిరపకాయలకి, వెల్లుల్లిరేకలు, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పంచదార వేసి రుబ్బుకుంటే అదే గార్లిక్‌ చట్నీ.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.