ETV Bharat / priya

క్రిస్మస్​ రోజు ఈ కేక్స్​ చేయండి - ఫ్యామిలీతో తియ్యని వేడుక చేసుకోండి!

Christmas 2023 Special Cakes : మరికొన్ని రోజుల్లో క్రిస్మస్​ అండ్​ న్యూ ఇయర్​ రాబోతున్నాయి. ఈ రెండు అకేషన్లకు కచ్చితంగా ఉండాల్సింది "కేక్"​. మరి.. మీరు కూడా ఆరోజు కేక్​ కట్​ చేయాలనుకుంటున్నారా..? అయితే.. షాపులో కొనడం ఎందుకు? ఇంట్లోనే టేస్టీ టేస్టీ సూపర్​ కేక్​ మీరే తయారు చేయండిలా!

Christmas 2023 Special Cakes
Christmas 2023 Special Cakes
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 4:49 PM IST

Christmas 2023 Special Cakes: పుట్టినరోజు.. పెళ్లిరోజు.. అకేషన్​ ఏదైనా కేక్​ కంపల్సరీ. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే.. కేక్​ కావాలంటే బేకరీకి వెళ్లాల్సిందే. అయితే.. ఈ సారి కొనుగోలు చేయడం ఆపేయండి. మీకు నచ్చిన ఫ్లేవర్​లో మీరే సూపర్ కేక్ రెడీ చేయండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్​ చేయండి.

కొబ్బరి కేక్​: కావల్సిన పదార్థాలు :

  • కొబ్బరి తురుము-1 కప్పు
  • తేనె -1/2 కప్పు
  • నూనె-1/2 కప్పు
  • గుడ్లు-6
  • వెనీలా ఎసెన్స్-1 టీస్పూన్​
  • బేకింగ్ పౌడర్-1 టీస్పూన్
  • ఉప్పు-చిటికెడు

తయారీ విధానం:

  • ముందుగా మీరు ఓవెన్​ను 180 డిగ్రీల సెల్సియస్​ వద్ద 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. ఓవెన్​ లేని వారు స్టౌ మీద అడుగు లోతుగా ఉండే ఓ మందపాటి గిన్నె తీసుకుని అందులో కొంచెం ఇసుక లేదా ఉప్పు పోసి.. ఓ చిన్న స్టాండ్​ లేదా ప్లేట్​ పెట్టుకుని 10 నిమిషాలు ప్రీ హీట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్​ చేయాలి. తర్వాత కొబ్బరి తురుము, తేనె, నూనె, వెనీలా ఎసెన్స్​, బేకింగ్​ పౌడర్​, ఉప్పు వేసి కట్​ అండ్​ ఫోల్డ్​ విధానంలో కలుపుకోవాలి.
  • ఇప్పుడు మీరు కేక్​ మౌల్డ్​ తీసుకుని దానికి కొంచెం నూనె రాసి కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలి.
  • తర్వాత మీరు రెడీ చేసుకున్న కేక్​ మిశ్రమాన్ని ఆ మౌల్డ్​లో పోసి.. గ్యాప్స్​ లేకుండా కేక్​ టిన్​ను మెల్లగా నేలపై టాప్​ చేయాలి.
  • ఆ తర్వాత బేకింగ్​ కోసం ముందుగా ప్రీ హీట్​ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు కేక్​ను బేక్ చేయాలి.
  • ఓవెన్​ లేని వారు ముందుగా ప్రీ హీట్​ చేసుకున్న గిన్నెలో పెట్టి 30 నిమిషాల పాటు సిమ్​లో పెట్టి కుక్​ చేసుకోవాలి.
  • కేక్​ టిన్ చల్లారిన తర్వాత డీమౌల్డ్​ చేసుకోవాలి. అంతే కేక్​ రెడీ!

మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్​లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!

2. ఆల్మండ్ ఫ్లోర్ ఆరెంజ్ కేక్

కావలసినవి:

  • బాదం పొడి-2కప్పులు
  • గుడ్లు-3
  • తేనె-1/4 కప్పు
  • 1 నారింజపండు తురుము(పొట్టును తురుముకోవాలి)
  • తాజా నారింజ రసం-1/4 కప్పు
  • బేకింగ్ పౌడర్-1 టీస్పూన్

తయారీ విధానం:

  • పైన చెప్పిన విధంగా ఓవెన్​ లేదా గిన్నె రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్​ చేయాలి. తర్వాత బాదంపొడి, తేనె, బేకింగ్​ పౌడర్​, నారింజపండు తురుము, నారింజ రసం వేసి కట్​ అండ్​ ఫోల్డ్​ విధానంలో కలుపుకోవాలి.

  • ఆ తర్వాత బేకింగ్​ కోసం ముందుగా ప్రీ హీట్​ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు కేక్​ను బేక్ చేయాలి. ఓవెన్​ లేని వారు ముందుగా ప్రీ హీట్​ చేసుకున్న గిన్నెలో పెట్టి 30 నిమిషాల పాటు సిమ్​లో పెట్టి కుక్​ చేసుకోవాలి.

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

3. బనానా ఓట్ కేక్

కావలసినవి:

  • అరటిపండ్లు-2 (గుజ్జు చేసుకోవాలి)
  • ఓట్స్-1 కప్పు
  • గుడ్లు-2
  • తేనె లేదా మాపుల్ సిరప్-1/4 కప్పు
  • బేకింగ్ పౌడర్-1 టీస్పూన్
  • వెనీలా ఎసెన్స్​- 1 టీస్పూన్
  • దాల్చిన చెక్క పొడి-చిటికెడు

  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్​ చేయాలి. తర్వాత అరటిపండు గుజ్జు, ఓట్స్​, తేనె, బేకింగ్​ పౌడర్​, వెనీలా ఎసెన్స్​, దాల్చినచెక్క పొడి వేసి కట్​ అండ్​ ఫోల్డ్​ విధానంలో కలుపుకోవాలి.

  • కేక్​ టిన్ చల్లారిన తర్వాత డీమౌల్డ్​ చేసుకోవాలి. అంతే కేక్​ రెడీ

How to Prepare Methi Mutton Curry : మటన్​ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!

4. ఆపిల్ సిన్నమోన్​ కేక్:

కావలసినవి:

  • బాదం పొడి-2 కప్పులు
  • యాపిల్​-2(తురుముకోవాలి)
  • గుడ్లు-3
  • తేనె-1/4 కప్పు
  • దాల్చినచెక్క పొడి-1 టీస్పూన్
  • బేకింగ్ సోడా-1 టీస్పూన్

  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్​ చేయాలి.
  • తర్వాత బాదంపొడి, యాపిల్​ తురుము, తేనె, బేకింగ్​ పౌడర్​, దాల్చినచెక్క పొడి వేసి కట్​ అండ్​ ఫోల్డ్​ విధానంలో కలుపుకోవాలి.

How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.