వంకాయ పిజా ఒక్కసారి రుచి చూస్తే శాకాహారులే కాదు, మాంసాహరులూ వదలరంతే... మరింకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి..
కావాల్సినవి
వంకాయ- ఒకటి పెద్దది, పిజా సాస్- అర కప్పు, చీజ్ తురుము - పావుకప్పు, ఆలివ్‌లు - మూడు (చక్రాల్లా కోయాలి), నూనె- అరచెంచా, ఉప్పు- తగినంత.
తయారీ..
వంకాయలను కాస్త లావుగా చక్రాల్లా కోసి పెట్టుకోవాలి. ఆ ముక్కలకు నూనె రాసి పైన ఉప్పు చల్లాలి. రెండు నిమిషాల తరవాత వాటిపై పిజా సాస్, చీజ్ తురుము, స్లైసులుగా కోసిన ఆలివ్‌లు వేయాలి. ఈ ముక్కల్ని పెనంపై సన్ననిమంటపై కాల్చాలి. కాసేపటికి చీజ్ కరుగుతుంది. అప్పుడు పొయ్యి కట్టేయాలి. అంతే వేడివేడి వంకాయ పిజా సిద్ధం. దీన్ని అప్పటికప్పుడు తినేయొచ్చు.
ఇదీ చదవండి: 'సొరకాయ హల్వా' రెసిపీ చూసేయండి..