యాపిల్‌లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అలాగే గుడ్డులోనూ విటమిన్లు, మాంసకృత్తులు ఎక్కువే. మరి ఈ రెండింటిని కలిపి చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఆపిల్ స్నాక్‌ను ఎప్పుడైనా చేశారా? ఇలాంటి స్నాక్‌ను పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ రెసిపీ తయారీ విధానం తెలుసుకుందామా?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కావాల్సిన పదార్థాలు
- యాపిల్
- గోధుమపిండి
- కోడిగుడ్డు
- పంచదార
- జీడిపప్పు
- నూనె
తయారీ విధానం..
ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమపిండి, కోడిగుడ్డు సొన, చెక్కుతీసిన యాపిల్ ముక్కలు వేసుకోవాలి. అందులో దంచిన జీడిపప్పు, పంచదార వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని రొట్టె లాగా వేసుకుని నూనెతో రెండు వైపులా వేయించుకోవాలి.
అలా వేయించిన రొట్టెలను ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా చేసి పిల్లలకు తినిపించాలి.
ఇదీ చదవండి: శ్రావణం స్పెషల్: ఈ వెరైటీలు ట్రై చేయండి!