ETV Bharat / priya

వేసవిలో 'ఆమ్​ కా పన్నా' తాగాల్సిందే!

ఈ వేసవిలో మీరు కూల్​గా ఎలా ఉండాలనుకుంటున్నారా? సీజన్​లో దొరికే పళ్లతో వెరైటీగా, ఆరోగ్యంగా ఏదైనా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే , 'ఆమ్ కా​ పన్నా' తాగాల్సిందే. మరి ఆమ్​ పన్నా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి!

author img

By

Published : Jun 2, 2020, 2:33 PM IST

aam panna
వేసవిలో 'ఆమ్​ కా పన్నా' తాగాల్సిందే!
వేసవిలో 'ఆమ్​ కా పన్నా' తాగాల్సిందే!

మామిడి కాయలతో తయారు చేసే 'ఆమ్​ కా పన్నా'.. మీ దాహాన్ని తీర్చి.. శరీరంలోని గ్యాస్ట్రో ఇన్​స్టైనల్ సమస్యలను దూరం చేస్తుంది. మీ శరీరంలో సోడియం క్లోరైడ్ (ఉప్పు), ఐరన్ శాతాన్ని​ పెంచుతుంది. ఆమ్​ కా పన్నాను తరచుగా తీసుకోవడం వల్ల.. క్షయ, రక్తహీనత, కలరా, విరేచనాలు వంటి వ్యాధులూ అదుపులోకి వస్తాయి. వడదెబ్బకు ఇది చక్కటి ఔషదం. మరి ఇన్ని లాభాలున్న ఆమ్​ కా పన్నాను ఇంట్లోనే సులువుగా చేసుకోండి.

కావలసిన పదార్థాలు..

పచ్చి మామిడి కాయలు- రెండు , బెల్లం లేదా చక్కెర-రుచికి సరిపడా, యాలకుల పొడి-చిటికెడు, మిరియాలు- చిటికెడు.

తయారీ విధానం..

ముందుగా మామిడి కాయలను ఉడికించి, తోలు తీసేసి, గుజ్జు తీసుకోవాలి. అందులో బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వత కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత ఐస్​ క్యూబ్స్​ వేసి చల్లచల్లగా సర్వ్​ చేసుకోవడమే!

వీడియోలో చూపినట్టుగా.. ఆమ్​ కా పన్నా తయారు చేసుకుని.. మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్​తో పంచుకోండి.

ఇదీ చదవండి:వలస వ్యథ: సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.