ETV Bharat / opinion

కష్టనష్టాల కలనేత- నేడు జాతీయ చేనేత దినోత్సవం - జాతీయ చేనేత దినోత్సవం

ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం ముఖ్యమైన పాత్ర పోషించింది. స్వాతంత్య్రం అనంతరం కొన్నేళ్లపాటు అన్ని జాతీయ విధానాలూ చేనేత విశిష్టతను నొక్కిచెప్పాయి. కానీ ప్రస్తుతం చేనేత కార్మికులు తీవ్ర జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేనేతరంగం దయనీయ స్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలో.. దేశ ఔన్నత్యం, వైవిధ్యం, కళాత్మకతలను శతాబ్దాలుగా నిలబెడుతూ వచ్చిన ఈ రంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల విహిత బాధ్యత.

Weaving of hardships- Today is National Handloom Day
కష్టనష్టాల కలనేత- నేడు జాతీయ చేనేత దినోత్సవం
author img

By

Published : Aug 7, 2020, 7:09 AM IST

'చేనేతరంగం వైవిధ్యభరితం, పర్యావరణ హితకరం. వ్యవసాయం తరవాత అత్యధికులకు ఉపాధి కల్పిస్తోంది. దేశ ప్రజలు చేనేత వస్త్రాలను విరివిగా ప్రోత్సహించాలి. వినియోగం అయిదు శాతం పెరిగినా ఆదాయంలో 33శాతం వృద్ధి ఉంటుంది'- అయిదేళ్ల క్రితం ఆగస్టు ఏడో తేదీన తొలి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విన్నపమిది. అప్పటికీ ఇప్పటికీ చేనేతరంగంలో ఎలాంటి మార్పు లేకపోవడమే విషాదం. వాస్తవం ఏమిటంటే- అది మరింత దయనీయ స్థితికి చేరుకుంది. ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ప్రపంచీకరణ, మారుతున్న సామాజిక-ఆర్థిక పరిస్థితుల కారణంగా చేనేత కార్మికులు తీవ్ర జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికితోడు కరోనా గోరుచుట్టుపై రోకలిపోటుగా మారింది. వృత్తిపై ఆధారపడేవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కొత్తతరం దూరమవుతోంది. జౌళి రంగం ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా చేనేత పతనావస్థ వైపు నడుస్తోంది.

పునర్‌ వైభవం ఎప్పుడు?

ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం ముఖ్యమైన పాత్ర పోషించింది. స్వాతంత్య్రం అనంతరం కొన్నేళ్లపాటు అన్ని జాతీయ విధానాలూ చేనేత విశిష్టతను నొక్కిచెప్పాయి. యంత్రాల వాడకం, మిల్లుల రాకతో కష్టకాలం మొదలైంది. గత మూడు దశాబ్దాల్లో చేనేత వృత్తిదారుల సంఖ్య 70 శాతం తగ్గడం ఆందోళనకర పరిణామం. దేశవ్యాప్తంగా కంచి, వారణాసి, కశ్మీరీ, ధర్మవరం, పోచంపల్లి, గద్వాల వంటి చీరల రకాలు, ధోవతులు, శాలువాలు, దుప్పట్లు తదితర ఉత్పత్తులు మాత్రమే ఆదరణలో ఉన్నాయి. 43 లక్షల మంది వరకే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నారు, 24 లక్షల మగ్గాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. దేశ వస్త్రఉత్పత్తిలో చేనేత శాతం 14కి తగ్గింది. చేనేత వస్త్రాల విపణి పరిమాణం రూ.10 వేలకోట్ల నుంచి రూ.6,500 కోట్లకు చేరింది. ఎగుమతుల విలువ రూ.1,343 కోట్లు మాత్రమే.

మరమగ్గాలు

చేనేతకు ప్రత్యామ్నాయంగా జౌళి వస్త్రాలు వచ్చాయి. మరమగ్గాల వంటివి విస్తరించాయి. వస్త్ర విపణిపై గుత్తాధిపత్యం సాధించాయి. అతి తక్కువ శ్రమతో కోరిన డిజైన్లతో అనుకున్న వస్త్రాన్ని తయారు చేసే వెసులుబాటు వచ్చింది. తక్కువ మానవ వనరుల వినియోగం, పరిమిత వ్యయాలతో మరమగ్గాలు పారిశ్రామికవర్గాలను విశేషంగా ఆకర్షించాయి. పెద్దయెత్తున పెట్టుబడులు ప్రవహించాయి. భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.

నిమిత్తమాత్రంగా నేత సంఘాలు

దేశంలో జౌళి పరిశ్రమ ఔషధ, ఆహారశుద్ధి, ఇంజినీరింగ్‌, ఐటీ తరవాతి స్థానంలో ఉంది. అదే క్రమంలో చేనేత రంగం ప్రాధాన్యం మసకబారింది. కొన్ని రకాల ఉత్పత్తులకు మాత్రమే పరిమితమైంది. చేనేత కార్మికులకు పెద్దదిక్కుగా ఉన్న నేత సంఘాలు నిమిత్తమాత్రంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తమ సంస్థలైన ఆప్కో, టెస్కోల ద్వారా పాఠశాల విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు అందిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేలు, వైమానిక రంగం తదితర చోట్ల చేనేత వస్త్రాలను వినియోగించడం లేదు. గత పదేళ్లలో 22 కేంద్ర పథకాలు రద్దయ్యాయి. తాజాగా చేనేత మండలినీ రద్దు చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాలు, పథకాలకు సంబంధించీ చేనేత కార్మికులకు సమాచారం లేదు. గృహవసతి, వైద్యసేవలు అందడం లేదు. ఆధునిక శిక్షణ అసంఘటిత రంగానికి అందుబాటులో లేదు. వీటన్నింటినీ ప్రభుత్వాలు సమీక్షించాలి. గుంతమగ్గాల స్థానంలో తక్కువ శ్రమతో పనిచేసేలా ఆధునిక మగ్గాలు రావాలి. చీరలు నేయడానికి 'ఆసు' యంత్రాలను కనిపెట్టినా అవి పరిమితంగా ఉన్నాయి. వాటిని ఇంటింటికీ పరిచయం చేయాలి. నూలు, రంగులు, రసాయనాల ధరలు ఏటా అధికమవుతున్నాయి. చేనేత ప్రదర్శనలు అరుదైపోయాయి. సంతలు కూడా లేక అసంఘటిత రంగంలోనివారి ఉత్పత్తుల విక్రయాలు జరగడమే లేదు.

స్వదేశీ ఉద్యమస్ఫూర్తితో...

చేనేత భారతదేశ వారసత్వంలో భాగం. దేశ ఔన్నత్యం, వైవిధ్యం, కళాత్మకతలను శతాబ్దాలుగా నిలబెడుతూ వచ్చింది. ఈ రంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల విహిత బాధ్యత. వేగంగా మారుతున్న మార్కెట్‌ స్థితిగతులు, గిరాకీకి అనుగుణంగా ఈ రంగాన్ని తీర్చిదిద్దాలి. వ్యవసాయ రంగంలో మాదిరిగానే నేతన్నలకు ఆధునికతను పరిచయం చేయాలి. డిజైన్ల తయారీని ప్రోత్సహించాలి. వృత్తి సమూహాలు కార్మికుల అవసరాలను తీరుస్తాయి. చేనేత రంగం ఉత్పత్తి, ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచడానికి, కార్మికుల నైపుణ్యాల మెరుగుదలకు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి చేపట్టాలి. వారి ఆదాయ మార్గాలను పెంచాలి. సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు పథకాలు, కార్యక్రమాలను విరివిగా రూపొందించాలి.

శాశ్వత పరిష్కారం కావాలి

జాతీయ, అంతర్జాతీయ విపణులకు వృత్తి వేదికలను అనుసంధానించి జీవనోపాధి మార్గాలను బలోపేతం చేసి వృత్తిపట్ల కొత్త భరోసా కల్పించాలి. ఇంత పెద్ద శ్రామికశక్తికి ప్రభుత్వం ఎప్పటికీ ఉపాధి కల్పించలేదు. ప్రస్తుతం ఉన్న ఉపాధి మార్గాన్ని కొనసాగించే విధానాలను అవలంబించాలి. ముడిపదార్థాలైన నూలు, రంగుల ధరలను నియంత్రించాలి. అవసరమైతే నూలును ఉచితంగా సరఫరా చేయాలి. తెలుగు రాష్ట్రాలు చేనేత రంగం అభివృద్ధికి ఆశాజనకమైన పథకాలను చేపట్టాయి. కొత్తవారు ఈ రంగంలోకి రావడానికి మాత్రం అవి అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ- ఆ స్ఫూర్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడేలా సమస్యల శాశ్వత పరిష్కారానికి ముందుండి బాటలు పరవాలి!

- ఆకారపు మల్లేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.