ETV Bharat / opinion

'సంస్కరణల పథంతో భాగ్యోదయ విద్యావిధానం'

నూతన విద్యావిధానం- 2020 (న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ- ఎన్‌ఈపీ) భారత విద్యారంగ చరిత్రలో ఓ మైలురాయి అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. విద్యావ్యవస్థ ఆసాంత ప్రక్షాళన జరగాలన్న వాదన బలపడిన తరుణంలో ఈ నూతన విద్యావిధానం వెలువడటం చరిత్రలో సమయోచిత క్షణమని వెల్లడించారు. కనీసం అయిదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన చేయాలన్న ఎన్‌ఈపీ సూచన ప్రశంసనీయమన్నారు.

Vice President Venkaiah Naidu on new education policy
సంస్కరణ పథంతో భాగ్యోదయ విద్య విధానం: వెంకయ్య
author img

By

Published : Aug 3, 2020, 6:56 AM IST

ప్రభుత్వం విభిన్న వర్గాలతో విస్తృతంగా సంప్రతించి ఆమోదించిన నూతన విద్యావిధానం- 2020 (న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ- ఎన్‌ఈపీ) భారత విద్యారంగ చరిత్రలో ఓ మైలురాయి. ఇది సమగ్రమైంది. సంపూర్ణమైంది. దూరదృష్టి కలిగింది. దేశ భావి పురోగతిలో కీలకపాత్ర పోషిస్తుంది. భారత్‌ను చైతన్యపూరిత విజ్ఞాన సమాజంగా మార్చేందుకు వీలుగా పరిపూర్ణమైన, విద్యార్థికేంద్రమైన, సరళమైన వ్యవస్థకు ప్రాధాన్యమిస్తోంది. భారతీయ మూలాలతో పాటు వర్తమాన ప్రపంచ విద్యారంగ మేలిమి భావనలు, పద్ధతులను పరిగణనలోకి తీసుకుని వాటిమధ్య సరైన సమతూకాన్ని సాధించింది. దీని దృష్టి ప్రపంచవ్యాప్తమైంది. అదే సమయంలో భారతీయమైంది.

కాలగర్భంలోకి ఆంగ్లేయుల విధానం

ప్రస్తుత విద్యావ్యవస్థ పునాది వలసపాలనలో వేసింది. ఉన్నతవర్గాలకు విద్య అందించేందుకు, ఆంగ్లం తెలిసిన పనివారిని ఉత్పత్తి చేసేందుకు నాటి బ్రిటిష్‌ పాలకులు రూపొందించింది. విద్యావ్యవస్థ ఆసాంత ప్రక్షాళన జరగాలన్న వాదన బలపడిన తరుణంలో ఈ నూతన విద్యావిధానం వెలువడటం చరిత్రలో సమయోచిత క్షణం. మన విద్యావ్యవస్థను అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. విస్తరించిన నిరుద్యోగిత వీటిలో ప్రధానమైంది. మౌలికంగానే ఎక్కడో ఏదో పొరపాటు ఉందన్న ఆలోచనకు ఇవి దారితీశాయి. 21వ శతాబ్దపు భారతదేశ అవసరాలకు అనువైన ఉన్నతవిద్య కోసం చేపట్టాల్సిన మార్పులనూ ఎన్‌ఈపీ ప్రతిపాదించింది. ఇప్పటి వ్యవస్థ 1857లో ఏర్పాటైంది. చిన్నాచితకా మార్పులు తప్ప అదే కొనసాగుతోంది. దీన్ని ఎలా మార్చాలి, విద్యార్థులకు ఎలా అందించాలి? ఈ అంశాల ప్రాతిపదికగా నూతన విద్యావిధానం రూపొందింది. బడిముఖం ఎరుగని రెండు కోట్లమంది పిల్లలను జాతీయ విద్యా స్రవంతిలోకి తీసుకురావడం, వృత్తివిద్యలను చదువులో భాగం చేయడం వంటి ఉన్నత ధ్యేయాలు గొప్ప ఊరట కలిగిస్తున్నాయి.

పాఠ్యప్రణాళికా భారం తగ్గించడం, పర్యావరణంపై దృష్టి సారించడం, విలువలు నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేయడం, అందరికీ అందుబాటులో ఉండటం విద్యావ్యవస్థకు కీలకం. వీటన్నింటినీ నూతన విద్యావిధానంలో పొందుపరచారు. అనేక విధాలుగా ఎన్‌ఈపీ విద్యార్థులకు స్వేచ్ఛ ఇస్తోంది. తాము నేర్చుకోదలచిన అంశాల ఎంపికకు వారికి అవకాశం కల్పిస్తోంది. వైద్య, న్యాయ విద్యాసంస్థలు మినహా అన్ని సంస్థలను ఒకే నియంత్రణ వ్యవస్థ కిందకు తీసుకురావడం ద్వారా ఉన్నతవిద్యపై దృష్టి సారించింది. పరిశోధన మీద దృష్టి సారింపు, మల్టీడిసిప్లినరీ విధానం, టెక్నాలజీ వినియోగం సహా బోధకుల సామర్థ్య సముద్ధరణ అంశాలు విద్యారంగం తీరుతెన్నుల్ని మార్చేస్తాయి. నైతిక, మానవీయ, రాజ్యాంగ విలువల మీద దృష్టి కేంద్రీకరించడం ప్రజాస్వామిక పునాదుల పటిష్ఠతకు అవసరమైన వివేకదాయక పౌరసత్వ సృష్టికి దోహదం చేస్తుంది. పునాది విద్య పరిధి పెంచడానికి ఇప్పుడున్న 6-14 సంవత్సరాల వయోపరిమితిని 3-18కి పెంచడం ఈ విధానం ప్రత్యేకత. పాఠశాల బోధన ప్రణాళికలోకి 3-6 వయోపరిమితి కూడా చేరింది. మానవాభివృద్ధిలో ఇదే కీలక దశ అని ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తున్నారు.

నేర్చుకునే శక్తి ఆధారంగా విద్య గరపాలన్నది ఒక నూతన మార్ఫు మాతృభాషగా దేశంలో గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లోనే కనీసం అయిదో తరగతి వరకు (లేదంటే 8వ తరగతి వరకు) విద్యను బోధించడం నూతన విద్యా విధానం కింద నిర్బంధం అవుతుంది. 'నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ'ని నెలకొల్పడం సకాలంలో చేసిన ఎంతో అవసర ప్రతిపాదన. ఇది విద్యాప్రమాణాలను ప్రాథమిక స్థాయి నుంచి మెరుగుపరుస్తుంది. విద్యార్థి సాధించే ప్రగతితో ముడిపెట్టి నిధులు సమకూర్చే విధానం పోటీదాయక స్కాలర్‌షిప్‌లను ప్రోత్సహిస్తుంది.

విద్యారంగంపై ప్రభుత్వ పెట్టుబడిని జీడీపీలో ఇప్పుడున్న 4.3 శాతం నుంచి ఆరుశాతానికి పెంచాలని ఎన్‌ఈపీ ఉద్దేశించింది. ఈ లక్ష్య సాధనకు నిర్దిష్ట కాల ప్రణాళిక ఉండాలి. 2016లో ఏర్పడిన టీఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యన్‌ కమిటీ, కె.కస్తూరి రంగన్‌ కమిటీలు అద్భుతమైన నివేదికలు ఇచ్చాయి. పిల్లల సర్వతోముఖాభివృద్ధిలో పోషక విలువల ప్రాధాన్యతను ఎన్‌ఈపీ గుర్తించింది. పోషకాహార మధ్యాహ్న భోజనానికి శక్తిదాయక అల్పాహారాన్ని జోడించాలని ప్రతిపాదించింది. పిల్లల విద్యాభ్యాస సామర్థ్యం పెంచడానికి ఈ చర్య దోహదపడుతుంది. విద్యాహక్కును 18 ఏళ్ల వరకు పొడిగించడం హర్షణీయం. 'డిజిటల్‌ డివైడ్'ను ఎన్‌ఈపీ ప్రత్యేకంగా ప్రస్తావించి దీన్ని నిర్దిష్టకాలంలో పూరించాలని నిర్దేచించింది.

మాతృభాషకు పెద్దపీట

కనీసం అయిదో తరగతి వరకు మాతృభాష బోధనా మాధ్యమంగా చేయాలన్న ఎన్‌ఈపీ సూచన అభిలషణీయం. గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్టు (2016) పేరిట యునెస్కో వెలువరించిన పత్రం ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం, వారు అర్థం చేసుకోగల భాషలో విద్యను ఆర్జించే సదుపాయం లేదు. విద్యార్థి సమగ్రాభివృద్ధిలో మాతృభాష కీలకపాత్ర వహిస్తుంది. బిడ్డ భూమ్మీదపడ్డప్పటి నుంచీ తనకు పరిచయమైన మాతృభాష ఆ బిడ్డకు ఒక వ్యక్తిగత గుర్తింపును కల్పిస్తుంది. సంస్కృతితో అనుసంధానిస్తుంది. బిడ్డ ఎలా ఆలోచిస్తుందో, అన్వేషిస్తుందో, ప్రశ్నిస్తుందో, గుర్తుపెట్టుకుంటుందో, సంక్లిష్ట ఆలోచనను పెంపొందించుకుంటుందో, సమస్యాపూరణ నిపుణతను సమకూర్చుకుంటుందో... వీటన్నింటితో కూడిన మేధావికాసానికి మాతృభాష కీలకం.

మాతృభాషలో విద్యాభ్యాసం విద్యార్థి సృజనాత్మక, వూహాత్మక ఆలోచనా పటిమను పెంపొందిస్తుంది. విద్యార్థి భావోద్వేగపూరిత మానసిక పురోగతిలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇతర భాషలను త్వరితగతిని నేర్చుకునేందుకు దోహదపడుతుంది. పాఠశాల విద్య తొలినాళ్లలో మాతృభాషలో విద్య నేర్చిన పిల్లలు, పరాయిభాషను బోధనా మాధ్యమంగా కలిగిన పిల్లలకంటే మెరుగ్గా ఉన్నారని ఎన్నో నివేదికలు సూచించాయి. ఎప్పుడో వచ్చిఉండాల్సిన ఈ విద్యావిధానాన్ని ఇప్పుడు సమర్థంగా, ఫలప్రదంగా, ఉన్నది ఉన్నట్లుగా ఆమలు చేయడం మీద దృష్టి సారించాలి. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా కృషిచేస్తే ఇది ఫలప్రదం అవుతుంది. భారత దేశాన్ని విజ్ఞాన ప్రపంచపు ఇరుసుగా మార్చివేసే దిశలో నూతన విద్యావిధానం ఒక ముందడుగు. ఈ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు హృదయపూర్వక మద్దతు అందిస్తాయని ఆశిస్తున్నా!

  • మాతృభాషలో వివిధ పాఠ్యాంశాలను నేర్చుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఇనుమడిస్తాయి. తప్పులు దొర్లుతాయన్న బెరుకు లేకుండా భావాలను వ్యక్తీకరించడానికి మాతృభాష దోహదపడుతుంది.
  • పిల్లల భావోద్వేగాలు మాతృభాషలోనే చక్కగా వ్యక్తమవుతాయి. గణిత, విజ్ఞానశాస్త్ర అంశాలను వారు మెరుగ్గా అర్థం చేసుకొని బాగా నేర్చుకోగలరు.
  • ఒక అధ్యయనం ప్రకారం 2017 వరకు నోబెల్‌ పురస్కారం పొందినవారిలో 98 శాతం వారి మాతృభాషే బోధనా వ్యవస్థగా ఉన్న దేశాలవారే.
  • బ్లూంబర్గ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ప్రకారం 50 దేశాల్లో 90 శాతం మాతృభాషే బోధనా మాధ్యమంగా కలిగి ఉన్నాయి. 30 అత్యంత ధనిక దేశాల్లో 28 దేశాల్లో మాతృభాషే బోధనా భాషగా ఉంది.
  • బోధనా మాధ్యమంగా మాతృభాషే అత్యుత్తమమైనదని గాంధీజీ, గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ అభిప్రాయపడిన విషయం మనం గుర్తుచేసుకోవాలి.
  • పిల్లల్లో ప్రాంతీయ సాహిత్యం, సంస్కృతి పట్ల ఆసక్తి పెంచడానికి కూడా మాతృభాషల్లో విద్య దోహదపడుతుంది. ఆయా ప్రాంతాలకు పరిమితమై ఉండే ఆచారాలను, సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టే, భారతీయ ప్రాచీన భాషలపట్ల ఈ విధానం దృష్టి సారించింది. భారత్‌ విభిన్నమైన భాషలు, మాండలికాలు, మాతృభాషలు గల సువిశాలమైన వైవిధ్యభరితమైన దేశం.
  • అనేక వర్తమాన దేశాలు తమ పిల్లలకు మాతృభాషలోనే విద్యను నేర్పిస్తున్నాయి.
  • నాతో సమావేశమయ్యే ప్రపంచ నేతలు వారు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగలిగినప్పటికీ తమ మాతృభాషలోనే మాట్లాడటానికి ఇష్టపడుతుంటారు. మాతృభాషలో మాట్లాడటం వెనక ఒక స్వాభిమానం ఇమిడి ఉంటుంది. పిల్లల్లో స్వాభిమాన స్పృహ పెరుగుతుంది.
  • ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ నూతన విద్యావిధానం 'ఏ ఒక్క భాషను రుద్దడం గాని, ఏ ఒక్క భాషను వ్యతిరేకించడం ఉండదని' నూతన విద్యావిధానం సుస్పష్టంగా ప్రస్తావించింది.

--- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.